Monday, July 13, 2015

శివలింగ వృక్షం

శివలింగ వృక్షం
శివలింగ వృక్షం  శివుడి జటాజూట ఆకృతి లో వెంట్రుకలు విప్పరినట్లుగా ఉంటుంది. ఈ చెట్టుకి పూసే పుష్పాలు కొమ్మలకి పూయకుండా వెంట్రుకలలాంటి జడలకు పూస్తాయి. పువ్వు పైభాగాన నాగపడగ కప్పినట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి.అందుకే ఈ పుష్పాలను శివలిన్గాపుష్పాలను నాగమల్లి పుష్పాలు, మల్లికార్జున పుష్పాలు అని పిలుస్తారు. ఈ పుష్పాలు అద్భుతమైన సుగంధ పరిమళాన్ని కలిగి  ఉంటాయి.ఆ పరమేశ్వరుడు ఈ శివలింగ పుష్పం  రూపంలో కొలువై ఉన్నాడని భక్తులు భావిస్తారు. ఈ శివలింగ పుష్పాలు శివుడికి, మరియు సమస్త దేవతలకి ప్రీతికరమైన పుష్పాలు. ఈ పుష్పాలతో పూజ చేయడం శివభక్తులకి ఒక వరం. శివలింగ పుష్పాలతో  ఆ పరమేశ్వరుని పూజ చేసినవారు జన్మరాహిత్యం పొంది చివరకు కైవల్యం పొందుతారని  శివపురాణం లో ఉన్నది. 
శ్రీ పరమేశ్వరార్పణమస్తు!! 




No comments:

Post a Comment

Total Pageviews