Tuesday, January 31, 2017

వసంత పంచమి శుభాకాంక్షలు.

శుభోదయం! వసంత  పంచమి శుభాకాంక్షలు.
ఓం శ్రీ సరస్వత్యై నమః
యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై  నమోనమః !!!!
మాఘమాసంలో వచ్చే వసంత పంచమి దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పంచమి నాడే "సరస్వతీదేవి అమ్మవారు" జన్మించిందట. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ తల్లి. అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతిఅమ్మవారిని పూజించడం జరుగుతోంది.  ఆధ్యాత్మిక, ధార్మిక చింతన అన్నది రిటైర్మెంట్ అయ్యాక, వయస్సు అయ్యిపోయిన తర్వాత పొందవలిసినది కాదు, చిన్నప్పటి నుండి మనదైన ఘన సంప్రదాయ వారసత్వాన్ని మన పిల్లలకి అందిస్తే వారు ఉత్తమ పౌరులుగా తద్వారా ఉత్తమ సమాజం ఏర్పడేందుకు దోహద పడుతుంది. మనకు రాంకులు రావాలంటే లక్షలు ఖర్చు చేసి పేరుపొందిన కాలేజీలో చేర్చడం కన్నా అత్యంత ముఖ్యమైనది సరస్వతి మాత కటాక్షం, దైవానుగ్రహం ఉంటేనే కాని ఉత్తమ ఫలితాలు రావు. పిల్లలకి చిన్నప్పటి నుండి మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు గురించి తెలియచెప్పడం వాటిని ఆచరించేలా చూడడం మన తల్లి తండ్రుల బాధ్యత, కనీస కర్తవ్యం! శుభం భూయాత్!!

No comments:

Post a Comment

Total Pageviews