Monday, January 30, 2017

అప్పడాల పిండి తయారు చేయండి

అప్పడాల పిండి - అప్పడాలు:
ఈ వంటకం అందరికీ తెలుసు. మన ఇళ్ళల్లో పెళ్లిళ్లు, వడుగులు వగైరా శుభకార్యాలు అయితే మొదటగా విగ్నేశ్వరుని మీదు కట్టిన తరువాత చేసే మొట్టమొదటి వంటకం. ఇంట్లో వాళ్ళని, పక్క వాళ్ళని పిలిచి ఈరోజు అప్పడాలు వత్తాలమ్మ వచ్చి కాస్త సాయం చేయండి అని పిలిచి ప్రపంచం లో ఉన్న అన్నీ విషయాలు ముచ్చట్లాడుకుంటూ సరదాగా చేసే పిండివంట ఇది. అప్పటి రోజుల్లో ఈ సమావేశం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోయేవి కాదు. మా బామ్మ మా అమ్మ అయితే అప్పడాలు చేసేముంది కొద్దిగా అప్పడాల పిండి చిన్న ఉండలు చేసి అన్నం లోకి వేసుకోడానికి తీసి పెట్టేది. ఈ విషయమే నేను చెప్పేది. ఇది ఎలా తయారు చేయాలో మరి చూద్దామా.
ముందుగా మినపప్పు మిల్లు ఆడించాలి. ఆ మినప పిండిని ఒక కంటైనర్ లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు కావలసినంత మినప పిండిని ఒక చిన్న బేసిన్ లోకి తీసు కోవాలి. అందులో కొద్దిగా అంటే ఒక స్పూన్ మిల్లు ఆడిన పప్పు నుని వేసుకుని సరిపడినంత ఉప్పు వేసి, మిర్చి పొడి తగినంత వేసుకుని, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపాలి. ఇప్పుడు చపాతీ పిండి కలిపినట్లు కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. ఎక్కువ నీరు పోస్తే పల్చగ అయి పోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఒక స్పూన్ ఉండే టట్లుగ
పోస్తూ ఉండాలి. పప్పు నూనె సరిపోక పోతే మళ్ళా కొద్దిగా తీసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొవాలి. ఈ అప్పడాల పిండి ఉండలు బహు రిచిగా ఉంటాయి. ఉండలు చేసి కొద్ది కొద్ది గా తీసుకుంటూ వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని నంచుకుంటూ తింటే అద్భుతహ: ఇంట్లో పచ్చళ్లు రెడీ గా లేనప్పుడు ఈ ఉండలు చేసుకుని తినచ్చు. పెళ్లి విందులలో ఈ ఉండలు తప్పనిసరిగా మెనూ లో ఒక ఐటెమ్ ఇవాళ రేపు. మరి మీరు కూడా ట్రై చేస్తారా.

No comments:

Post a Comment

Total Pageviews