Wednesday, January 4, 2017

రోజూ విజ్ఞానం పెరుగుతోందని సంతోషించాలా
పెరుగుట విరుగుట కొరకే అని చింతించాలా .......
అమ్మా నాన్న వద్దు .... అమెరికాయే ముద్దు అంటున్న కాలం
పరుగు పందెం లో యాంత్రికమై , ఆర్ద్రత తగ్గిన జీవితం
చందమామ చూస్తూ బామ్మ కధలు వింటూ ,
ఎంతో సరదాగా ఆ నాడు ముద్దలు తిన్నాము
రోజులో ఒక్కసారి కలిసి చేసే రాత్రి భోజనం
అది కూడా మౌనంగా..... టి. వి చూస్తూ నేడు చేస్తున్నాము
యధారాజా తధా ప్రజా ! చేసుకున్న వారికీ చేసుకున్నంత
పెద్దలు కంప్యూటర్స్ , పిన్నలు టాబ్లెట్స్ తో మునుగుతూ ......
మంచీ చెడూ మాట్లాడే సమయం కూడా తగ్గి పోతూ
ఇనవారితో లేదు బంధం , కానివారితో గంటలు కాలక్షేపం
రామాయణ, భారత ,పంచతంత్రా లు వింటూ నీతులుఎరిగిన మన బాల్యం
కార్టూన్స్ పేరుతో వయసుకు మించే నేర్పుతున్న చెత్త తో నేడు అద్వాన్నం
ఉరుకులు పరుగుల జీవనంలో లోపిస్తున్న అనురాగ మాధుర్యం
ఈ నాడు ఎవరి వారే యమునా తీరే ...... ఐ పొఇన కుటుంబ జీవనం......
పెద్దలే లేని ఇళ్ళు , భయ భక్తులు క్షీణిస్తున్న వైనాలు
అంతర్జాలం,టి . వి. ,సినిమా ల్లో తెలిపే అక్కరలేని సమాచారాలు
సంస్కృతి, సంస్కారం మరుస్తూ సంప్రదాయానికే ఎసళ్ళు....
సమాజ క్షేమానికి ఊపిరి .. . క్రమ శిక్షణ నిండిన కుటుంబం
మంచీ చెడు విచక్షణ ..... ఉగ్గుపాలతో రంగరిస్తేనే భద్రం
ఒకరికొకరై, సాగుతూ లక్షణం గా ఉంటె అదే సుఖ పరివారం
మొక్కై వంగనిది మానై వంగునా .... అన్నారు
పిల్లలకు కావాల్సినది... కావు ఖరీదైన బహుమతులు
మనసున మనసై ఉండే అమ్మా-నాన్నా ఆత్మీయతలు
అరచేతి లో వైకుంఠాలు నేర్పద్దు
కస్టపడి సాధించుకునే మనస్తత్వాలు ముద్దు
నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తులు
పిల్లల జీవితాలు శోభాయమానంగా తీర్చి దిద్దండి
జీవిత విలువలు నేర్పుతూ ..... వారి వ్యక్తిత్వాలు
దివ్యంగా , మోహనంగా చెక్కండి
సువర్ణ భవితకు బాట వేయండి ......

No comments:

Post a Comment

Total Pageviews