Monday, March 4, 2019

జల్లూరు లో మా పెద్దమ్మగారింట జ్ఞాపకాల జలకాలాట

ఏ బ్రహ్మాండాల నుంచి
దొలికి పడ్డాయో నీళ్లు
ఊహలో పట్టని
ఏ వైశాల్యాల గుండా
వీటి చిరంతన ప్రయాణమో
ఏ విశ్వాంతరాళాల
ఆదిమ శబ్ధాలను మోసుకొచ్చాయో'
అంటారు ఆచార్య ఎన్.గోపి జలగీతం కావ్యారంభం చేస్తూ ఇంకా
జలం ఒక సంస్కృతి
జలం ఒక చారిత్రక కృతి
జలం సకల విన్యాసాల ఆవిష్కృతి
భూమికి పురుడు పోసింది
నీటిని కోరటమంటే 
జీవనసారాన్ని కాంక్షించటం
మనిషీ! నీటిని తెలుసుకోవటమంటే
నిన్ను నువ్వు తెలుసుకోవటమే.
చెరువులు బాల్యస్మృతిగా మారటం
ఎంత విషాదం
చెరువుల్ని ఎవరెత్తుకు పోయారు
అంటారు ఆవేదనగా
'కాల ప్రవహానికి
దృశ్యరూపం కదా నది!'
ప్రవహించిన నీరు గతించిన కాలమూ వెనక్కి రావు.
అలాగే ఇలా చెరువుల్లో ఈతలూ,
కాలువలు, బోరింగ్ పంపులు, బావులవద్ద జలకాలు
మన బాల్యస్మృతుల జ్ఞాపకాలు
మరోమారు ఆస్వాదించ గలిగే అవకాశాలు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు
మన స్థాయి, అహం అడ్డురాని బాల్యంలోకి వెళ్ళిపోవాలి ఇలా...



నిన్న పిఠాపురం మండలం 
జల్లూరు లో మా పెద్దమ్మగారింట జ్ఞాపకాల జలకాలాట
ముక్తాయింపు
నీరుపల్లమెరుగు అని నమ్మినంత కాలం
ఇంటి పక్క ఇల్లు అలా ఊరు పక్క ఊరు విశ్వమంతా విస్తరించాం!
పైపైకి పారించగలం అన్న నమ్మకం చిక్కాక
ఇంటి పై ఇల్లు అలా బహుళ అంతస్తుల భవనాలు
విశాల ఆధునిక స్నానాల గదులు
ప్రతి నిమిషం మన అవసరాలకు జీవనదుల్ని
డ్రైనేజీ నదులుగా మారుస్తున్నాం
ఒకసారి మన ఇంటి నీటి వాడకం పై ఓ కన్నేద్దాం
వృధాని అరికట్టి వృధానీటిని వీలైనంత తిరిగి వాడుకకు వినియోగిద్దాం
జపాన్ వంటి దేశాలు ఈ దిశగా ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టాయి
అవసరం మేరకే వాడుకుందాం!
వృధా నీరు అవకాశాన్ని బట్టి మొక్కలకు ఇతర అవసరాలకు వినియోగిద్దాం!
భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం...
జల వనరులు వారికీ అందిద్దాం!! 
సత్యసాయి - విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews