Tuesday, August 25, 2015

తెలుగు సాహితికి రసగంగాధర తిలకం.

నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.
తిలక్ తన కవిత్వ స్వరూపాన్ని తెలుపుతున్న గేయం ఇది ... అప్పటికి భావ కవిత్వంలో ఎవరెస్ట్ అనదగ్గ దేవుల పల్లి వారు తమ కవిత్వపు వెన్నెలల వెల్లువలో తెలుగు వారి గుండెని తడిపెశారు ... అభ్యుదయ,విప్లవ కవిత్వ దృక్పధంతో శ్రీ శ్రీ కవితా దీప్తి వెలుగులు కురిపిస్తోంది ... ఆ వెలుగూ ,ఈ వెన్నెలా కలిసిన అద్వితీయ సంగమం తిలక్ ఽఅయన భావాభ్యుదయ కవి .
ఆఖరి వాక్యాలు చూడండి ... కన్నీళ్ళలో తడిసే దయాపారావతాలు.. ఇది మానవతావాదం ... "నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు "ఇది తిలక్ అభ్యుదయ వాదం .... ఇక భావుకత కి పరాకాష్ట ..."వెన్నెలలో ఆదుకునే అందమైన ఆడపిల్లలు".... వెన్నెలలో ఆడుకుంటున్న తెలుగు అమ్మాయి అందం ఊహల్లొ చూడాల్సిందే ...

No comments:

Post a Comment

Total Pageviews