69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ అందరికీ శుభాకాంక్షలు! శుభాభినందనలు!! ఈ రోజు మన ప్రధాన మంత్రి మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏది కేవలం ఒక స్వాతంత్ర్య దినం కాదు..దేశ వాసులకు సంకల్ప దినం కావాలన్నారు...ఎంతో ఉత్తేజంతో స్ఫూర్తి దాయకం గా ఇంకా చెప్తూనే ఉన్నారు..మనం కేవలం వినడమే కాకుండా ఈ 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుందాం! శ్రీమతి అరుణ గారి ఈ ఆవేదన చదవండి! ఈ జీవన శైలి మనందరిదీ...తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా? ఈ ధోరణి వదిలేద్దాం! మన ఈ భావజాలం మార్చుకుందాం! కొన్ని సంకల్పాలు మనము, పిల్లలతో కలసి చేద్దాం! బయట ఉగ్రవాదం ఎంత ప్రమాద కరమో ఇంట మరిన్ని ప్రమాదాలు పొంచి వున్నాయి. అందులో ముఖ్యమైనవి మన పిల్లల్ని టీ వీ, కంప్యూటర్ గేమ్స్, ఇంటర్నెట్, సెల్ ఫోన్స్, బైక్స్, వంటివి తల్లితండ్రుల పర్యవేక్షణలో, అవసరానికి మాత్రమే వినియోగించేలా చూడాలి! సత్యసాయి - విస్సా ఫౌండేషన్.
ఎవరికి స్వాతంత్ర్యం వచ్చింది..?
స్వాతంత్ర్యం వచ్చిందా..? యెవరికి? యెక్కడ?..అన్ని దినాల్లాగే ఇదీ ఇంకోదినం కాదా..? అబ్బో..!ఒకటే పిల్లలచేతుల్లో మూడురంగుల బెలూన్లూ, వెంట్రుకలు నిక్కబొడవ, ఉద్వేగపు సెల్యూట్లూ.. అన్నీ మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్లు..ఆ సీన్ కట్చేస్తే..సాయంత్రానికంతా రోడ్లంతా, యెక్కడబడితే అక్కడ తొక్కుకుంటూ జాతీయ జండాలూ, స్టిక్కర్లూ..అసల జెండాలో రంగులు యే ఆర్డర్లో ఉండాలోకూడా తెలియనంత బిజీ మనం మరి.. ఇదండీ మన దేశభక్తి..యెవడెలా పోతేనాకేంటీ..? ఇదీ నినాదం..మనం ఉంటున్న కాలనీల్లోనో ఇళ్ళపక్కనో యేదైనా సమస్యొస్తే అడగం, యేదో పారేసుకున్నట్టు ఒకటే ఉరుకులూ పరుగులూ..చెప్పలేనత అసహనం..మన చదువంతా...పరాయిదేశానికి రాత్రీపగలూ ఏసీ రూముల్లో అందంగా కూర్చుని పోష్ గా గాడిద చాకిరీ చెయ్యడానికేతప్ప పౌరుడిగా స్పందించడానికి, రెండునిముషాలు వెచ్చిస్తే చాలు తీరిపోయే సమస్యల దగ్గరకూడా వాడనే వాడం..ఇక్కడకూడా గాడిదబుద్ధే, గొర్రె బతుకే. మన ఇంటిపక్కే రోజుల చెత్త పేరుకుపోయినా, రోడ్లన్నీ గుంతలు పడి నానాతిప్పలూ పడాల్సివస్తున్నా, ఒక్కమాటా యెవర్నీ నిలదీయం..అసలది మనహక్కనీ గుర్తించం, పిల్లలకు చక్కగా చెప్తాం.." యెవడెలాపోతే నీకెందుకురా..? నీ గొడవ నువ్వు చూసుకోనాన్నా.."అని..

యేంసాధించేసాం? స్త్రీలకు యెక్కడా ఇళ్ళలోనూ ,రోడ్లపైనా, ఆఫీసుల్లోనూ.. రక్షణలేదు హ్యుమన్ ట్రాఫికింగ్ యధేచ్చగా జరిగిపోతూనే వుంది. గ్రామీణ యువతులు రెడ్లైట్ యేరియాలకు తరలిపోతూనే వున్నారు,పిల్లల గాడిదమోతకు విముక్తిలేదు..చదువులనే సంకెళ్ళలో మగ్గిపోతున్నారు..ప్రైవేటు చదువులు మోతెక్కిస్తున్నాయ్, తల్లిదండులు " లక్షలకొద్దీ ఫీజులు కట్టడానికి బ్రతుకుల్ని తాకట్టుపెట్టుకుంటున్నారు గానీ, యెందుకింత ఫీజులు? యెందుక్కట్టాలీ అని నిలదీయరు? ర్యాగింగు చేస్తున్నారని తెలిస్తే " ఈ ఒక్క యేడూ యెలాగోలా భరించు.." అని సర్దిచెప్తారు తప్ప, అసలు సమస్యని పరిష్కరించే అలోచన చెయ్యరు..ర్యాగింగునీ, కుల, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యరు.అందరికీ ఆరోగ్యం, బదులు.. అందరికీ యాండ్రాఇడ్ ఫోన్లూ,నాలుగు సిమ్ములూ అన్నట్టు బతుకుతున్నాం..చదువులు ఉద్యోగం కోసం తప్ప..యెదుటివాణ్ణి మనిషిగా చూసే సంస్కారం ఇవ్వట్లేదు, అసలా ఆలోచనే యెవ్వరికీ లేదు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం తెచ్చుకుంటేనో అమెరికాలో ఉద్యోగమొస్తేనో మాత్రమే సంతోషించే మరబొమ్మలా మనుషులు మారిపోయారు.ప్రతీ బాధ్యతనీ ఒక "దినం"పేరుతో కానిచ్చేసి,పరిమితంచేసేసి ఐ ఫోనులూ, పనికిరాని సినిమాలూ, ఐటెం సాంగులూ..ఇలా రకరకాల వ్యామోహాల్లో పడి యువత నిర్వీర్యమౌతుంది.కనీసావసరాలు తీరకుండానే బతుకులుచాలిస్తున్న వారి ప్రాణాలకు విలువలేదు.మత మౌఢ్యంతో ప్రభుత్వాలు తుగ్లక్ పాలనలు సాగిస్తున్నాయ్, దొరికినంత దండుకొనే దిశలో మత్రి పుంగవులు ముందుకెళ్తున్నారు.
మరిక్కడ.. యెవరికి స్వాతంత్ర్యమొచ్చింది?.
మరిక్కడ.. యెవరికి స్వాతంత్ర్యమొచ్చింది?.
No comments:
Post a Comment