Wednesday, August 26, 2015

శ్రీ రాయప్రోలు సుబ్బా రావు గారి పద్య మాధురి

ప్రబోధము శ్రీ రాయప్రోలు సుబ్బా రావు గారి
ఆంధ్రా వళి నుండి.

తనగీతి అరవ జాతిని గాయకులను గా 
దిద్ది వర్ధిల్లిన తెనుగు వాణి,
తన పోటులు విరోధి తండంబు లకు సహిం 
పనివి గా మెరసిన తెనుగు కత్తి,

తన యందములు ప్రాంత జనుల కభి రుచి వా

సన నేర్ప నలరిన తెనుగు రేఖ,
తన వేణికలు వసుంధర ను సస్య శ్యామ
లను జేయ జెలగిన తెనుగు భూమి,
అస్మదార్ద్ర మనో వీధి నావ హింప
జ్ఞప్తి కెలయించు చున్నాడ ! చావలేదు
చావ లే దాంధ్ర జన మహోజ్జ్వల చరిత్ర
హృదయములు చీల్చి చదువుడో సదయులారా !
---- 

తెనుగు తల్లి

నాగార్జునాద్రి కంఠముల గండూషించె 
పలుభాష్య బంధ మై తెలుగు శిక్ష, 
ప్రాకృతాశ్రమ వాటికా కులమ్ములనాటె 
తీయమామిడి యంట్లు తెనుగు కవిత, 
బౌద్ధ ధర్మరహస్యభావముల్ పరమ
తా
త్త్విక దృష్టి విడదీసె తెనుగు ప్రతిభ,
కొండ లోయల లోన కోమల లావణ్య
మలరార చిత్రించె తెనుగు కుంచె,
గంగ తల నుండి కావేరి కాళ్ళ దాక
వెలిగె దిక్ మోహనమ్ముగా తెలుగు ఠీవి,
తమ్ముడా! మాయ నిత్తువే తల్లివన్నె?
చెల్లెలా! చిన్నబుత్తువే తల్లిచిన్నె?

----------

తెనుగు తల్లి 

శ్రీకాకు ళస్వా మిసిగపై సువాసించె
తెల్లని ఆంధ్రుల మల్లెపూలు,
ఒడ్డె రాజుల జీవ గడ్డ గ్రక్క దలంగ
కోరా డె మత్తాంధ్ర కుంజరములు,
చీకటి మన్నెముల్ ఛే దించి నవధాన్య 
ముల నెత్తె ఆంధ్రుల పోపు టె డ్లు,
చిలుక సరస్సు లో శృంగార నౌకల 
నడిపె ఆంధ్రుల యింటి పడుచు జతలు,


ఉత్కలా శా నితంబమ్ములొత్తి హత్తె
ఆంధ్రుల యశో దుకూల సితాంచ లములు;
తమ్ముడా! మాయ నిత్తువే తల్లివన్నె?
చెల్లెలా ! చిన్న బుత్తువే తల్లిచిన్నె?
----- శ్రీ రాయప్రోలు సుబ్బా రావు గారి 
అభినవ కవిత నుండి.

No comments:

Post a Comment

Total Pageviews