మొన్న శిల్పారామం వెళ్ళాం
అలా చూస్తూ చూస్తూ ఒక రైతు కుటుంబం
ఆ రైతు భార్య శ్రమజీవన సౌందర్యం నన్ను కట్టిపడేసింది
నాకు ఆ శ్రమజీవన సౌందర్య రాశిని ముద్దుపెట్టుకోవాలని అనిపించింది.
కానీ ఎలా అందరూ చూస్తున్నారు. అంతేకాక పక్కనే అతని భర్తవున్నాడు
నా భార్య కూడా చూస్తూనే వుంది కానీ నాలో చెలరేగుతున్న భావనలని పసిగట్టలేకపోయింది.
సరే ఏమైనా సరే ఆమెని ముద్దుపెట్టుకోవాలన్న కోరిక బలపడింది. వెంటనే ఆమె బుగ్గపై ముద్దుపెట్టాను.
ఆమె ఈ హఠాత్ పరిణామానికి ఖంగారు పడింది మనసులో ఆనందపడింది. అలాగే ముందుకు వెళితే మరో బంజారా జంట కనిపించింది. ఆ బంజారా యువతి కూడా ఎంతో అందంగా ఉంది. ఇందాకటిలాగానే ఆమె భుజంపై చెయ్యివేసాను ఆమె కూడా ఏమి అనలేదు అందంగా సిగ్గుపడింది. చేసిన తప్పు చెపితే పోతుంది అంటారు కదా అందుకే పబ్లిగ్గా మీ ముందు పెట్టాను.ఇదండీ ఇంతకీ నేను చేసింది తప్పా, ఒప్పా మీరే చెప్పాలి. అప్పటివరకూ నాకు మనశాంతి లేదు. మీ సత్యసాయి విస్సా
కథకాదు కాదు వాస్తవం సర్ అందుకే మనసు మనసులో లేదు ఎంటో అలా జరిగిపోయింది
No comments:
Post a Comment