భర్తృహరి నీతి శతకము
తెలియని మనుజుని సుఖముగ
దెలుపందగు, సుఖతరముగ దెలుపంగవచ్చున్
దెలిసినవానిం, దెలిసియుం
దెలియని నరుం దెల్ప బ్రహ్మదేవుని వశమే.
భావం :- తెలియని వారికి సులభంగా తెలియజేయవచ్చు. తెలిసిన వారికి ఇంకా సులభంగా తెలియచేయవచ్చు. కాని తెలిసింది కోచేమే అయినా సర్వజ్ఞుడనని భావించే వ్యక్తిని బ్రహ్మదేవుడు కూడా రంజింప జేయ జాలడు.
No comments:
Post a Comment