Thursday, August 7, 2014

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
శ్రావణ శుక్రవారము పాట.
కైలాసగిరిలో కల్పవృక్షము క్రింద ప్రమధాధి గణములు కొలువగాను
పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండిపరమేశ్వరుని అడిగెను
పార్వతి అప్పుడు || జయమంగళం నిత్య శుభమంగళం.||
ఏ వ్రతము సంపదలు నెలమి తోడుత నిచ్చు యే వ్రతము
పుత్రా పోవ్త్రాభివ్రుద్ది నొసగు అనుచును పార్వతి పరమేశు నడిగెను. || జయ మంగళం ||
కుండిన అనిఎది పట్నంబులో చారుమతి అని ఒక పడతి గలదు
అత్తమామల సేవ అతి భక్తితో చేసి పతిభక్తి కలిగియుండు భాగ్యశాలి || జయ మంగళం ||
వనితా స్వప్నమందు వరలక్ష్మీ చేబోయి చారుమతీ లేలేమ్మని చేత చెరచెను
చరచినప్పుడు లేచి మీ రెవ్వరని నమస్కరించి పల్కె నలినాక్షి || జయ మంగళం ||
వరలక్ష్మిని నేను వరమూలు యిచ్చేను మేల్కొనవే చారుమతి మేలుగాను
కొలచినప్పుడు మెచ్చి కోరిన రాజ్యముల్ వరములానిచ్చేటి వరలక్ష్మీ || జయ మంగళం ||
ఏ విభుని పూజచేయవలె ననుచూ చారుమతి యడిగెను శ్రావణముగనూ
యే మాసంబున యే పక్షంబు యే వారమునాడు యే ప్రొద్దున || జయ మంగళం ||
శ్రావణమాసాన శుక్ల పక్షమునందు శుక్రవరమునాదు మునిమాపునా
పంచాకల్వలు దెచ్చి బాగుగా నను నిల్పి భక్తితో పూజిమ్చమని చెప్పెను. || జయ మంగళం ||
చారుమతి లేచి యా శయ్యపై కూర్చుండిబంధువుల పిలిపించి బాగుగానూ
స్వప్నమున శ్రీమహాలక్ష్మి చకచక వచ్చి కొలవమని బల్కెను కాంతలారా || జయ మంగళం ||
ఏవిధమున పూజ చేయవలెనని బంధువులు అడిగిరి ప్రేమతోను
యే యే మాసంబున యే వారమునాడు యే ప్రొద్దు నాడు
శ్రావణ మాసాన శుక్ల పక్షమునందు శుక్రవారము నాడు మునిమాపునా
పంచాకల్వలు దెచ్చి బాగుగా తను నిల్పి భక్తితో పూజించమని చెప్పెను || జయ మంగళం ||
అపుడు శ్రావణమాసము ముందుగ వచ్చెనని భక్తితో పట్నము నలంకరించే
వన్నె తోరణాలు సన్నజాజులతో చెన్నుగా నగరు శృంగారించిరి || జయ మంగళం ||
వరలక్ష్మి నోమనుచు వనితలు అందరూ పసుపు తోడి పట్టు పుట్టములు గట్టి
పూర్ణంబు కుడుములూ పాయసాన్నములు అవశ్యముగా నైవేద్యము పెడుదురు || జయ మంగళం ||
కండి మందిగాలు గడగ నెంచి వండిన కుడుములు ఘన వడలునూ
దండిగా పళ్ళేల ఖర్జూర ఫలములూ విధిగా నైవేద్యములు పెడుదురు || జయ మంగళం ||
నిండు బిందేలలోను నిర్మల ఉదకము పుండరీకాక్షునకు వారు పోసి
తొమ్మిదిపోగులతోరమోప్పగ పోసి తల్లికి కాదు సంభ్రమునను || జయ మంగళం ||
వేదవిదుడైనట్టి విప్రుని పిలిపించి గంధ మక్షతలిచ్చి కాళ్ళు కడిగి తొమ్మిది పిండి
వంటలతోనురయ మొప్పగ బ్రాహ్మణునకు వాయనం బెట్టుదురు. || జయ మంగళం ||
శ్రావణ శుక్రవార పాట సంపూర్ణం.

No comments:

Post a Comment

Total Pageviews