పోతన భాగవత పద్యం.
వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద!
దాస దు:ఖనాశ వాసుదేవ!
యవ్యయాప్రమేయ! యనిశంబు గావింతు
మిందిరేశ! నీకు వందనములు.
భావం:- విముక్తులైన రాజులూ శ్రీకృష్ణునిట్లు స్తుతించిరి. ఓ ఇందిరేశా! కృష్ణా! వరద ( వరములిచ్చువాడా ) పద్మనాభ! శ్రీహరీ ! గోవిందా! దాసుల దు:ఖమును హరించువాడా! వాసుదేవా! అవ్యయా ! ( శాశ్వతుడా!)అప్రమేయా! ( ప్రమాణములచే నిరూపింపశక్యము కానివాడా!) నీకు మే మెల్లప్పుడును వందనము నాచరించెదము. ప్రభూ!
No comments:
Post a Comment