Friday, June 29, 2018

కంచు పాత్ర మహత్తు!

కంచు పాత్ర మహత్తు!
ఇవాళే ఓ మిత్రుడి దగ్గర చూశాను. కనీసం 250-300 ఏళ్లనాటిది. ఈ పాత్రలో ప్రత్యేకత దాని వయసుకాదు. దానిని తయారుచేసిన విధానం. వాడిన టెక్నాలజీ. బ్రిటీషోడు భారతదేశానికి రాకముందే, సైన్సు, టెక్నాలజీ తెలివితేటలు మనకు ఇవ్వకముందే తయారయిన పాత్ర ఇది.
ఆ పాత్ర గురించి నేను అవగతం చేసుకున్న మూడు ముక్కలు చెబుతాను. అది పూర్తిగా కంచుతో తయారుచేసిన పాత్ర. అంచుమీద మూడు వైపులా మూడు చేప బొమ్మలు వుంటాయి. చేతులు శుభ్రంగా కడుక్కుని.. ఒక్కో చేప బొమ్మమీద రుద్దుతూ వుంటే ఒక్కో శబ్దం వినిపిస్తుంది. ఒక చేపమీద ఓంకార నాదం వినిపిస్తుంది. రెండో చేపమీద ఘంటారావం వినిపిస్తుంది. మూడో చేపమీద శంఖారావం వినిపిస్తుంది.
మన రణగొణ ధ్వనుల మధ్య కాకుండా నిర్మలమైన వాతావరణంలో ఆ చేప బొమ్మలను వేలితో తడిమితే.. ఆ శబ్దాలు వీనులవిందుగా వుంటాయి. కనీసం అరకిలోమీటరు వరకూ ఆ ధ్వనులు వినిపిస్తాయి.
ఆ పాత్రను తయారుచేసిన వారి జ్ఞానం, వారు అందించదలచిన సందేశం ఏ ఉన్నత స్థాయిలో వున్నదో నాకు తెలియదు. ఆ పాత్రను చూశాక నాకు బోధపడిన విషయాలు మాత్రం ఇవే.


No comments:

Post a Comment

Total Pageviews