తన దేశం తరపున ప్రపంచకప్ ఫుట్‌బాల్ మాచ్‌లు ఆడిన ప్రఖ్యాత ఆటగాడికి క్యాన్సర్ వచ్చింది. అతడిచ్చిన ఇంటర్‌వ్యూలో ఒక భాగాన్ని యథాతథంగా ఇక్కడ చెబుతాను. ‘‘నేను బ్రతికుండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు. నాదేశం తరపున ప్రాతినిధ్యం వహించాలని కృతనిశ్చయుడినై ఉన్నాను. ఇక్కడ నాకు మూడు ‘డి’లు సాయపడ్డాయి. డిజైర్, డిటెర్మినేషన్, డెడికేషన్ (కోరిక, పట్టుదల, అంకితభావం). బ్రతకాలన్న కోరికని నేను చాలా గాఢంగా పెంచుకోవాలని తెలుసు. అంతేకాదు, నా దేశం తరపున ప్రాతినిధ్యం వహించటానికి నేను అంకితభావంతో పని చేయాలి. దీనికి పట్టుదల కావాలి. ఓటమికి లొంగిపోకూడదని నేను గాఢంగా అనుకొంటున్నాను. నాకు తెలుసు, నా జీవితంలో మరిన్ని దీర్ఘకాలిక విజయాలని సాధించటానికి సమయంలేదని. కానీ, అందువల్ల ప్రపంచం మీద ద్వేషాన్నీ, నామీద నిరాసక్తతనీ నింపుకో దల్చుకోలేదు. దాని బదులు ప్రేమనీ, పట్టుదలనీ పెంచుకోవాలనుకుంటున్నాను. ప్రపంచం అందాలని ఆస్వాదించటానికి కాలం ప్రాతిపదికగా కాకుండా మనసుని ప్రాతిపదికగా తీసుకోవాలనుకుంటున్నాను. నా మరణం ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ నుంచి ఎలాగూ నేను బయటపడలేను. నేనేమిటో నన్ను అలాగే స్వీకరిస్తాను తప్ప, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా స్వీకరించదల్చు కోలేదు. నేను పోరాడదల్చుకున్నాను. నవ్వుతూ పోరాడదల్చుకున్నాను.’’
చాలా ఆశ్చర్యకరంగా, శాస్త్రజ్ఞులు, వైద్యశాస్త్ర నిపుణులు ఆశ్చర్యపోయేలాగా ఆ ఆటగాడు క్యాన్సర్ నుంచి అద్భుతంగా బయటపడ్డాడు. మానసిక ఒత్తిడిని అధిగమించటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉన్నదా? అతడు చెప్పిన ఇంటర్‌వ్యూ ఎoత ఆర్ధ్రంగా, ఎంత నిర్దుష్టంగా, ఎంత ప్రభావవంతంగా ఉన్నదో గమనించండి. యువరాజ్ సింగ్, జెఫ్రీ బాయ్-కాట్, జెన్స్ గుత్రేజ్ మొదలైన వారందరూ ఈ విధంగా కేన్సర్ని జయించిన క్రీడాకారులే. చిన్న చిన్న మానసిక ఒత్తిడులకే క్రుంగిపోయే మనం వీరి నుంచి తెలుసు కోవలసింది చాలా ఉంది.

No comments:
Post a Comment