Thursday, June 28, 2018

మన సంస్కృతిని గౌరవిద్దాం

మమ్మీ డాడీ పిలుపులు*
నమ్మల నాన్నల దినములు నరువుల సొమ్ముల్*
కమ్మని పిలుపులు మానుకు*
నమ్మకముల పెంపు రోజు లవసరమేలో*

వ్యాపారములు పెంచుకొనుటకు పాశ్చాత్యులు అనుసరించు విధానాలలో ఈ *దినములు ఒకటి. బహుమతులు, గులాబీలు, శుభాకాంక్షలు తెలుపు పత్రముల అమ్మకముల కొరకు వివిధ దినములు పుట్టించు చున్నారు. ఉగ్గుపాలతోనే మాతృదేవో భవ, పితృదేవోభవ, ఆశ్చర్యదేవోభవ, అతిధి దేవోభవ అని నేర్పించిన సంస్కృతి మనది.
కానీ నేటి విద్యావ్యవస్థ, సామాజిక వర్తన, కుటుంబవ్యవస్థలలో వచ్చిన మార్పుల వలన ఈ మంచి విషయములు మరుగున పడిపోవుచున్నవి. విపరీతములు చోటు చేసుకొనుచున్నవి.

మా నాన్నకు (బదులుగా ఇక్కడ ఒక బూతు పదం వాడుతూ) చాదస్తం ఎక్కువరా... ఎప్పుడు చూడు ఏవో నీతులు చెప్తాడు, ఖర్చులకు డబ్బులు మాత్రం ఇవ్వడు అంటూ కనీస గౌరవం లేకుండా మాట్లాడే పిల్లలు,

 అంతర్జాలంలో వావి వరసలకు తిలోకదకాలిచ్చి అసభ్యమైన కధలు, చిత్రాలు పెట్టి, చదివి, చూసి చెడిపోతున్న యువత,

పాఠశాలల్లో, కళాశాలల్లో చదువు మాని ఇతర వ్యాపకాలు ఎక్కువై గురువులను దూషిస్తూ, మహిళా ఉపాధ్యాయులను సైతం లైంగిక వేధింపులకు గురిచేస్తున్న విద్యార్థులు,

ఈ విదేశీ దినాల, సంస్కృతి అలవరచుకుంటూ ఒక్కరోజు శుభాకాంక్షలు పంపితే మురిసిపోదామా? పెద్దలుగా వారిని సంస్కరించే పని మొదలుపెడదామా?

ఎవరో పనిగట్టుకు వచ్చి చెప్తే అది సంస్కరణ కాదు. మార్పు మనతోనే మొదలు పెడదాం.... 6 నుంచి 60 ఏళ్ల వారి వరకు మంచి వైపు మనమే తొలి అడుగు వేద్దాం

మన సంస్కృతిని గౌరవిద్దాం

No comments:

Post a Comment

Total Pageviews