Friday, June 29, 2018

కోపం ఎలావుండాలి అంటే ...

ఉత్తమే క్షణికః కోపః,
మధ్యమే ఘటికాద్వయమ్,
అధమే స్యాత్ అహోరాత్రం,
పాపిష్టే మరణాన్తకః"
భావం:
ఉత్తముని యందు కోపం క్షణకాలం ఉంటుంది.
మధ్యముని యందు 2ఘడియలు ఉంటుంది.
అధముని యందు ఒక రోజు ఉంటుంది.
కాని పాపిష్టియందు చచ్చేంత వరకూ ఉంటుంది.
మనిషికున్న లోపలి శత్రువులలో కోపం ఒకటి. దీనికి వశం కారాదు.
అయినను కొన్ని సందర్భాలలో తెచ్చుకున్న కోపం ప్రకటించాలి.
కాని సహజకోపానికి వశం కారాదు. సహజకోపం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
భారతయుద్ధంలో భీష్ముని ధాటికి అర్జునుడు తట్టుకోలేక నీరుకారి పోతున్నాడు. ఆ సమయంలో అర్జునుని ఉత్సాహపరచటానికి శ్రీకృష్ణుడు తెచ్చుకొన్న కోపంతో సుదర్శనచక్రంతో భీష్ముని వధిస్తానని రథం నుండి కిందికి దూకి విజృంభిస్తాడు.
అపుడు అర్జునుడు కృష్ణుని వారించి, నేను యుద్ధం చేస్తానని మరింత ఉత్సాహంతో భీష్మునిపై మహాయుద్ధం చేస్తాడు. ఇలా ఉండాలి కోపం.
శ్రీరాముడు కోపంతో సముద్రునిపై అస్త్రం ఎక్కుపెట్టాడు. సముద్రుడు
ఆ అస్త్రాన్ని తనలో దాగి ఉన్న రాక్షసులపై ప్రయోగించమని కోరాడు. ఉత్తముల కోపం ఒక ప్రయోజనాన్ని కూడా సూచిస్తుంది.
చెడుమార్గం పడుతున్న వారిపై తెచ్చుకున్న కోపాన్ని తాత్కాలికంగా ప్రదర్శించడంలో తప్పులేదు

No comments:

Post a Comment

Total Pageviews