#ప్రపంచ నదుల దినోత్సవం🌊🎉 #ప్రపంచ నదుల దినోత్సవం #ప్రపంచ నదుల దినోత్సవం
వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికా లోని ఎడారులలోను, సౌదీ అరేబియా లోని ఎడారులలోను ఇలా భూమి లోకి ఇంకిపొయే నదులు ఉన్నాయి. ఇవి వర్షాలు పడ్డప్పుడు మాత్రం పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండి పోతాయి. మన వైపు దొంగేర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేల లోకి ఇంకి పోగా మిగిలిన నీరే జీవనదులలో ప్రవహించేది. ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపు రాయి (లైమ్ స్టోన్) ఉంటే ఎక్కువ నీరు ఇంకే సావకాశం ఉంది. అడుగున నల్లసేనపు రాయి (గ్రేనైట్) ఉంటే నీరు అంతగా ఇంకదు.
ప్రపంచంలోని పెద్ద నదుల: పొడవైన నదుల జాబితా నైలు నది (6,695 కి.మీ.) అమెజాన్ నది (6,683 కి.మీ.) యాంగ్‌ట్జీ నది (చాంగ్ జియాంగ్) (6,380 కి.మీ.) మిసిసిపి నది (5,970 కి.మీ.) ఓబ్ నది (5,410 కి.మీ.) హువాంగ్ హో (4,830 కి.మీ.) కాంగో నది (4,630 కి.మీ.) లెనా నది (4,400 కి.మీ.) అమూర్ నది (4,350 కి.మీ.) యెనిసెయి నది (4,106 కి.మీ.) భారత దేశాన్ని🇮🇳 నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. నదులను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పాటమాలజీ అందురు. మరిన్ని వివరాలకు www.sriwritings.blogspot.com/2000/07/blog-post_1.html గంగ, సింధు, యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి, పంజాబు లోని ఐదు నదులు : **సింధూ నది, **రావి నది, **బియాస్ నది, **సట్లెజ్ నది, **చీనాబ్ నది, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, నర్మద, తపతి, మహానది, భరతపూయ, దహీసార్, దామోదర్, ఘాగర్ గోమతి, కోయెనా, మండోవి, మిధి, ఓషివార, సబర్మతి, శరావతి, ఉల్హాస్, వశిష్ఠి, జువారి, పంబా, నాగావళి, నేడు ప్రపంచ నదుల దినోత్సవం🌊 #WorldRiversDay 🌊🌊🌊🌊 సముద్రుడే విశ్వమంటు సర్వస్వము ధారబోసి అస్థిత్వము కోల్పోయిన నదినెవ్వరు ఓదార్చిరి ఔషధముల ఆస్తినంత ఒడిదుడుకుల దూకుడులో వారాశికి సమర్పించు నదినెవ్వరు ఒడార్చిరి పిల్ల నదుల తీసుకొచ్చి సంగమమున ప్రేమమీరి సంద్రుడికే బలి ఇచ్చెడి నదినెవ్వరు ఓదార్చిరి తనలో తీపిని సైతము విశ్వాసపు ముసుగులోన ఉప్పుకు దాసోహమిచ్చు నదినెవ్వరు ఓదార్చిరి తానై జమకట్టు రాళ్ళు కడలిలోని రత్నములని భ్రమసి ఎగసె నదినెవ్వరు ఓదార్చిరి సంప్రోక్షణ పరమైనను కాలుష్యపు కోరలలో సర్వరోగిగా మారిన నదినెవ్వరు ఓదార్చిరి తన గమనమును మార్చివేసి మనిషి కట్టు ఆనకట్ట ఆకాశపు హర్మ్య మన్న నదినెవ్వరు ఓదార్చిరి నది యెన్నడు సజీవమే కష్టాలలో కడలియె నది ఒంటరిగా పయనించును ఒంటరియై అమరమౌను. కవి: అష్టకాల విద్యాచరణ శర్మ
No comments:
Post a Comment