Saturday, January 16, 2016

"ఎంకంటె ఎంకిరా , ఎన్నెల్ల మల్లిరా"......" వెన్నలొచ్చినవేళ "...... డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ


"ఎంకంటె ఎంకిరా , ఎన్నెల్ల మల్లిరా"
Vijayavenkatakrishna Subbarao Ponnada's photo.
ఎంకి సూపుల్లోన ఏముందొ గాని ,
వెలుగు పూలను సిమ్మి ఎద గిల్లుతాయి !
ఎంకి నవ్వుల్లోన ఏముందొ గాని ,
సెలయేటి గలగలలు తెల్ల బోతాయి !
ఎంకి నడుమున తానేమి సూసేనొ ,
ఎల వాగు వంకర్లు యెగిరి పోతాయి !
ఎంకి జడ బిగువు నేముందొ గాని ,
నల్ల నాగు మెలితిరిగి సుళ్ళు తిరిగేను !
ఎంకి నడకలలో ఏముందొ గాని ,
ఎల హంసలన్నీను మురిసి సూత్తాయి !
ఎంకి తలపులలో యేముందొ గాని ,
గుండె సందడి సేసి గుంజాటతాది !
ఎంకి సైగల్లోన ఏముందొ గాని ,
గుండె గొంతున కొచ్చి, ఆడ సూత్తాది !
ఎంకి సొగసులోన ఏముందొగాని ,
ఎన్నెల్లొ సిందేయ ఎర్రి పుట్టేను !
ఎంకి లాంటీ పిల్ల యేడుందొ సెప్పు ,
సెప్ప లేవుర మల్ల !
ఎంకంటె ఎంకిరా , ఎల మావి పూతరా ,
ఎంకంటె ఎంకిరా , సెలయేటి ఆటర ,
ఎంకంటె ఎంకిరా , ఎన్నెల్ల మల్లిరా !
ఎంకంటె ఎంకిరా , జాబిల్లి సెల్లిరా !(2)
................ డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 16 /01 /2016 .



" వెన్నలొచ్చినవేళ ".......................... డా .కృష్ణ సుబ్బారావు పొన్నాడ.
వెన్నలొచ్చినవేళ వేధింపు లేల !
చిన్నదానీ మోము చిగురించ దేల !
వన్నెలన్నియు జూడ వాడేను బాల !
కన్నె మనంబునా కలవరం బేల !
ఎన్నెన్ని కోర్కెలో ఎదనిండ జూడు !
అన్నెపున్నె మెరుగ అతివ నీ తోడు !
కన్నాను కలలెన్నొ కలికి నీ కొరకు !
మన్నించి దరిజేరి మరులతో చిలుకు !
పరువాలు పగబూని పమిటనే వీడె !
కురవాలి జవరాలి కులుకులే నేడె !
మురవాలి మనసులూ ముద్దుగా తడిసి !
మరవాలి లోకాన్ని మనసార మరచి !
కలువతో చంద్రయ్య కలిసేటి వేళ !
నిలువెల్ల వెన్నెలే నెపమేల బేల !
అలసిసొ లసితేను హాయినే మరచి !
కిలకిలా రవములా కేరింత పరచి !
కలహంస రావేమె కథకంచి కేగ !
కలహంస రావేమె కథకంచి కేగ !
" ద్విపద మాలిక " ............. డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ. 02 /02 /2016 .

No comments:

Post a Comment

Total Pageviews