Saturday, January 2, 2016

*రక్తంలో కొవ్వు తగ్గాలంటే..*

*రక్తంలో కొవ్వు శాతం తగ్గించుకుంటే గుండె జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని, ఇందుకు ఆహార పద్ధతుల్లో మార్పులు అనివార్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

*ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టగలిగితే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని వారు భరోసా ఇస్తున్నారు.

*రక్తంలో కొవ్వు తగ్గేందుకు కొన్ని పద్ధతులు ఆచరిస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.

*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన ఆలివ్ నూనెను వంటల్లో వాడడం ఉత్తమం.

*కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఆలివ్ నూనె ఎంతగానో ఉపకరిస్తుంది.

*తరచూ బాదం, వాల్‌నట్స్, నానబెట్టిన గింజలను తినడం వల్ల గుండె జబ్బులకు దూరం కావొచ్చు.
*ఉప్పు, పంచదార కలపకుండా గింజలను తినడం ఆరోగ్యరీత్యా శ్రేయస్కరం.

*ఒమెగా-3 ఫాటీ యాసిడ్లు పుష్కలంగా లభించే చేపలను తరచూ తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను అధిగమించవచ్చు.

*రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను నివారించ్ఘేందుకు ఓట్స్ ధాన్యం వాడడం మంచిది.

*తాజా కూరలు, పండ్లు తీసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు శాతం తగ్గుతూ, గుండె వ్యాధులకు అవకాశం లేనిరీతిలో ఆరోగ్యం వృద్ధి చెందుతుంది.

No comments:

Post a Comment

Total Pageviews