Monday, January 11, 2016

మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..పాలగుమ్మి విశ్వనాథం గారు

ప్రపంచ వ్యాప్త తెలుగు బంధువులకు ముందస్తుగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగ శుభాకాంక్షలతో... పల్లెల్లోనే పండుగ సందడి వెల్లి విరిసేది. మరి పండుగకు వెళ్ళాలంటే ముందస్తుగా ప్రణాళిక వేసుకోవాలి. అందునా సంక్రాంతి పెద్దపండుగకు ఎన్ని ఇక్కట్లు పడినా దొరకని టిక్కట్లు వెళ్ళాలన్నా దూరాలు, భారాలు, బాధ్యతలు ఈ సారి నేను కూడా వెళ్ళలేక పోయాను. అందుకే ఈ సంక్రాంతి కానుక ఈ లింక్ నొక్కి ఆనందం అనుభవించండి. https://www.youtube.com/watch?v=hXr9B4R9gWo పాలగుమ్మి విశ్వనాథం గారు రచించి, స్వరపరచి గానం చేసిన ఈ పాట మనకోసం. పండుగకు వెళ్ళాలన్నా వెళ్ళలేక పోయిన మనందరి కోసం
ఓహొ ఓ...ఓ...ఆ.ఆ...ఆ.ఆ...
పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.. ||పంట చేల||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..||మా ఊరు||
ఒయ్యారి నడకలతో ఆ ఏరు..
ఆ ఏరు దాటితే మా ఊరు ||ఒయ్యారి||
ఊరి మధ్య కోవెలా కోనేరు..
ఒక సారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య కోవెలా కోనేరు..
ఒక సారి చూస్తిరా వదిలి పోలేరు..||పంట చేల......తిరిగి రావాలి||
పచ్చని పచ్చిక పైనా మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...||పచ్చని||
ఏరు దాటి తోట తోపు తిరగాలి...
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి... ||ఏరు దాటి||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..||2||
చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...||చిన్ననాటి||
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...||ఒకరొకరు||
పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.. ||పంట చేల||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..||మా ఊరు||
ఓహొ హో...ఓ..ఒ..ఒ..ఒ..ఓ....||2||

No comments:

Post a Comment

Total Pageviews