Saturday, January 16, 2016

నమస్కార సంస్కారం!! తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!విస్సా ఫౌండేషన్.

నమస్కార సంస్కారం!! 
తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!!
మిత్రులందరికీ శుభరాత్రి! మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికీ పడితే వారికి స్టైల్ గా ఒంటి చేత్తో నమస్కరించి ఎంతో సంస్కార వంతుల మనుకుంటాము, దేవాలయం లో ఎవరూ పరస్పర అభివాదం(నమస్కార పలకరింపులు) చేసుకో కూడదు, ఒకవేళ ఎవరైనా మనకి నమస్కరించినప్పుడు మనం ఈ దేవాలయం లో ఉన్నామో ఆ దేవునికి సమర్పించాలి. పరమేశ్వరార్పణ మస్తు! అనాలి ఒక వేళ ఎవరికైనా మనం నమస్కరించాలి అనుకుంటే ఆ దేవుని నామస్మరణ చెయ్యాలి. ముఖ్యంగా దేవాలయం ప్రాంగణం లోనికి ప్రవేశించగానే మనం అహాన్ని, ఇహలోక విషయాల్ని వదిలేసి చిత్తం చెప్పులమీద కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే "త్వాం మురారిహృదయేశ్వరీం భజే" కనకధారా స్తోత్రంలో సంకారా చార్యుల వారు చెప్పినట్లుగా. నమస్కారం అనేది ఎలా చేయాలి? వచన, అంగ, మానసం. వచన - నోటితో; అంగ - శరీరంతో; మానసం - మనస్సుతో; త్రికరణ శుద్ధిగా చేసే నమస్కారానికి ప్రణతి అని పేరు. ఇంకా వంటి చేత్తో నమస్కారం పెడితే జరిగే నష్టం గురించి శ్రీ విష్ణు పురాణం లోని ఈ శ్లోకం, భావం చదవండి.
తెలియక పోవడం తప్పుకాదు, తెలుసుకోలేక పోవడం తప్పు, తెలిసినదాన్ని ఆచరించక పోవడం మహా మాహా తప్పు
శ్లో!!జన్మ ప్రభృతి యత్కించిత్!
చేతసా ధర్మ మాచరేత్!
సర్వంతు నిష్ఫలం యాతి!
ఏకహస్తాభివాదనాత్!!
పుట్టినది మొదలుకొని గావించుతూ వచ్చిన ధర్మము ఏకొంచెమున్నను అదికూడా ఒక్కచేతితో పెద్దలకు అభివాదనము చేయుటవల్ల నశించిపోతుంది. ఎందువల్లనంటే ఏకహస్తాభివాదన
మందు అవినయమే భాసిస్తుంటుంది. దానివల్ల సర్వ ధర్మములు నిష్ఫలమైపోతాయి. నమస్కారానికి ఒక సంస్కారం వుంది, ఉదాహరణకి మనం సౌచాలయంలో (టాయిలెట్స్) మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు లేదా ఆ ప్రదేశంలో కూడా నమస్కరిస్తాము అది చాలా తప్పు ఆంగ్లేయుల సంస్కృతిని విడిచిపెట్టి తిరిగి మన సంస్కృతిని పూర్తిగా అలవాటు చేసుకోకపోవటం వల్ల వచ్చిపడిన దుస్థితి యిది. అంగ్ల భాషనీ అవసరమైన మేరకు వినియోగిద్దాం! మన భాషా సంప్రదాయాలను ఎల్లప్పుడూ పాటిద్దాం! ఇప్పటికైనా మనమందరం అందరికీ రెండు చేతులూ ఉపయోగించి హృదయపూర్వకమైన నమస్కారాన్నే అందిద్దాము.తెలుసుకుందాం! ఆచరిద్దాం!! తరిద్దాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews