ఇది చదివిన తర్వాత ఐనా మరి కళ్ళు తెరుద్దామా? మాతృభాషలో విద్యాభోదన ఎంతో మేలు అని అనాదిగా భాషా శాస్త్రవేత్తలు, మేధావులు, విజ్ఞులు, ఎంతో మొత్తుకుంటున్నా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు, ఇటు ఆంగ్ల చదువుల మోజు, మాతృభాషలో చదివితే ఉపాధిలేకపోవడం, ప్రభుత్వపు ఉదాసీనత, అది ఆసరాగా తీసుకుని పుట్ట గొడుగుల్లా పుట్టు కొచ్చిన ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాకంతో చదువు 'కొనడం' గా మారిపోయింది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవని ఇతర సన్నాయి నొక్కులు నొక్కుతూ మాతృభాషలో మాట్లాడితే దండించడం వంటి చర్యలకు తెగబడ్డాయి. ఉన్నత విద్య రాసి పెరిగింది వాసి తగ్గింది. ఆంగ్లభాష ప్రాధాన్యం చాలా గొప్పది అందులో ఎటువంటి సందేహమూ లేదు, మరి గతంలో చదువుకున్న మేధావులకు అడ్డురాని మాతృభాష మరి నేటి కుహనా మేధావులకు ఎందుకు అడ్డువస్తోంది. వాస్తవాలు వెల్లడైన ఇటువంటి సర్వేలను గుర్తించి పిల్లి పాలు తాగినట్లు గా, వేలం వెర్రిగా, గొర్రెల మందల్లా పోకుండా మాతృభాషలో పునాది వేద్దాం! ఆంగ్లం, ఇతర భాషల భవనాలు నిర్మిద్దాం!! జై తెలుగు తల్లి! జై జై తెలంగాణా తల్లి!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.
No comments:
Post a Comment