ఐ లవ్యూ డియర్
నర్సాపురం నుండి పాలకొల్లు ట్రైన్ లో వెళ్తున్నాను. గోధూళివేళ. కిటికీ లోంచి పొలాలు, అందమైన ప్రకృతి, స్వచ్చమైన గాలి... అక్కడక్కడా పెంకుటిళ్ళు, డాబాలు... ఇంత అందమైన ప్రకృతిలోనూ ప్రకృతికే అందానిచ్చే అద్భుతమైన దృశ్యం. ఇంటి పెరట్లో మొక్కల మధ్య గట్టు మీద కూర్చున్న తండ్రి, పక్కన నిల్చుని తల రుద్దుతూన్నభార్య, చెంబుతో నీళ్ళు అందిస్తున్న పదేళ్ళ కొడుకు, గిన్నె పట్టుకొని కుంకుడో, శీకాకాయరసమో తల మీద పోస్తున్న కూతురు... ఇలాంటి దృశ్యం చూసి ఎన్నో ఏళ్ళు అయింది.
చేస్తున్న పనిలో ఇలా కుటుంబ సభ్యులందరూ మమేకమవడం చాదస్తంగా, కాస్త పాతచింతకాయ పచ్చడిగా ఉందని అనేవారూ ఉండకపోరు. తినడానికే సమయం దొరకని ఈకాలంలో, ఏ షాంపూతోనో రెండునిముషాల్లో అయిపోయే స్నానానికి సొంత పనులు మానుకొని ఇంతమంది చేయడం ఏమిటని వాదించేవారూ ఉంటారు. కానీ జీవితంలో చెరిగిపోని సంపద ఈ మధురానుభూతులే కదా.
మామని చంపటానికి కోడలు చేసే ప్రయత్నాలూ… రక్త సంబంధికుల మధ్య చిచ్చులు పెట్టే విలన్ కథలూ చూస్తూ సాడిస్టిక్ భావప్రాప్తి చెందే టి.వీ. నుంచి ఒక పది నిముషాలు పిల్లలకి (మానవ సంబంధాల మీద, ప్రేమా ఆప్యాయతల మీదా) కథలు చెప్పటానికి కేటాయిస్తే బావుంటుంది. ఎన్నో మంచి కథలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ క్రింది జపనీస్ కథ చదివండి.
ఒక యువకుడు పుట్టిన రోజు నాడు తన ఎనభై ఏళ్ళ తాతని డిన్నర్‌కి తీసుకువెళ్ళాడు. భోజనం మధ్యలో పొలమారి, ఆ వృద్ధుడు గ్లాసు సరిగ్గా పట్టుకోలేక వదిలెయ్యటంతో ఆ హడావుడీ, కంగార్లో అన్నం ఆయన బట్టల మీద పడి, దాని మీద చిక్కటి సూపు జారి, అసహ్యంగా తయారైంది. పెద్ద శబ్దంతో గ్లాసు క్రింద పడటంతో అటు తిరిగిన కస్టమర్లు, వాళ్ళ వైపు జిగుప్సగా చూసారు.
ఇదేమీ పట్టనట్టు ఆ యువకుడు ఆయన భోజనం పూర్తయ్యేవరకూ ఆగి, ఆ తరువాత వాష్-బేసిన్ దగ్గరకు తీసుకు వెళ్ళి, అన్నం మెతుకులు చేత్తో దులిపి, బట్టల మీద పడిన సూపు శుభ్రంగా కడిగి, తడి చేసిన జేబు రుమాల్తో మొహం తుడిచి, దువ్వెన తీసి తల దువ్వి, కళ్ళజోడు తిరిగి సరిగ్గా సర్ది, మొత్తం పరికించి సంతృప్తి చెంది, తిరిగి టేబుల్ దగ్గరికి తీసుకొచ్చాడు.

అప్పటి వరకూ శబ్దపు వర్షంలో మునిగిపోయిన రెస్టారెంటు ఒక ఇబ్బందికరమైన స్వీయ అపరాధనా భావపు అవమానంతో నిశ్శబ్దమై పోయింది. బిల్లు పే చేసి ఇద్దరూ బయటకు వెళ్తూ ఉండగా, వెనుక నుంచి ఒక కస్టమరు "బాబూ... నువ్వు ఇక్కడ ఏవో వదిలేసి వెళ్తున్నావ్" అని అరిచాడు.
ఆ యువకుడు వెనక్కి తిరిగి తన టేబుల్ వైపు చూసి "ఏమీ లేవే. ఏమిటి?" అని అడిగాడు.
"ప్రతి కుర్రాడికీ ఒక పాఠం. ప్రతీ వృద్ధుడికీ ఒక నమ్మకం".
(From: velugu vennela deepaalu: bedtime stories for your child)
(From: velugu vennela deepaalu: bedtime stories for your child)
No comments:
Post a Comment