టీన్స్ - సెల్ఫ్ లవ్:
తమ ఛార్మ్ అందం, స్టయిల్, సంభాషణతో ఇతరులని ప్రభావితం చేసేందుకు టీన్స్ అమితంగా ఇష్టపడతారు. తాము ఎత్తయిన స్టేజిపై ఉన్నామనీ, క్రింద నిల్చుని యావత్ ప్రపంచం తమవైపు కళ్ళప్పగించి చూస్తోందనీ ‘నిజాయితీగా’ నమ్ముతారు. అందుకే అద్దం ముందు గంటల కొద్దీ గడుపుతారు. ఆ చర్యని ఎగతాళి చేసినప్పుడు వారు అమితంగా హర్ట్ అవుతారు. కొందరు రివోల్ట్ అవుతారు. పైకి ఎలా కనపడినా, చాలామంది టీన్స్ మనసులు అతి సున్నితం. వాళ్ళ మూడ్ పాడుచేయడానికి చిన్న కామెంట్ చాలు. వాళ్ళ అందాన్ని, ఫ్యాషన్నీ, బ్రతికేవిధానాన్నీ విమర్శించినా, ఏడిపించినా అది వాళ్ళని ఎంతగా బాధిస్తుందంటే, వారు తమ గుహలోకి వెళ్ళిపోయి, ఇక బయటికి రారు.
అలా కామెంట్ చెయ్యటం కన్నా చిన్న చిన్న ప్రాపంచిక సహజ స్వాభావిక మానసిక సూత్రాలు వారికి వివరించండి. పిల్లలకి సెల్ఫ్-అడ్మిరేషన్ మరీ ఎక్కువ అవుతోందని అనిపించినప్పుడు సున్నితంగా మందలించండి. "…ఎప్పుడూ నువ్వు నీ గురించే ఆలోచించడం వల్ల నీకు నీపట్ల అవసరమైన దాని కన్నా ఎక్కువ అభిమానం (నెగెటివ్ సెల్ఫ్-ఈగో) ఏర్పడుతుంది. అందరూ అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ ఉంటారన్న అభిప్రాయం మార్చుకో. అవతలివారికి నువ్వు ఎంతో దగ్గరయితే తప్ప, నీ గురించి ఆలోచించడానికి ఎవరికీ అంత సమయం ఉండదు అందరిలోకీ స్పెషల్‌గా ఉండాలన్న ఆలోచన మంచిదే కానీ, దానికి కావలసింది మొహo మీద మేకప్ కాదు. నీ ప్రవర్తన" అన్న వాస్తవo వారికి అర్థమయ్యేలా చెప్పండి.
నార్సిస్-సిస్ట్ మనస్తత్వం:
నార్సిసేస్ అనే యువకుడు చెరువులో మొహం చూసుకుని తనతోనే ప్రేమలో పడతాడు. అందులోంచి వచ్చిందే ఈ పేరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ప్రకారం, ఈ రకమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు తమని తాము అవసరమైనదానికన్నా ఎక్కువ ప్రేమించుకుంటారు. లేని లక్షణాలని ఆపాదించుకుంటారు. తాము నమ్మిందే వేదం అని భావిస్తారు. స్వీయ-ప్రేమ మంచిదే కానీ అవధులు దాటితే, అవతలి వారు చెప్పిన సలహాల్ని పాటించనివ్వదు. ఈ లక్షణాలున్న పిల్లలందరూ నిశ్శబ్దం, ఆవేశం, దుఃఖం మొదలైన ఆయుధాలతో తమ కోపాన్నీ / అసంతృప్తినీ బహిర్గతపరుస్తూ ఉంటారు. సెల్ఫ్-లవ్ మరీ ఎక్కువైతే, అది మిసంత్రోప్ మనస్తత్వానికి దారి తియ్యవచ్చు.

మిసాంత్రోప్ మనస్తత్వం: పక్క ప్రయాణీకుడు సైకాలజిస్ట్. అభిమాని. మాటల సందర్భంలో ‘దున్నపోతులు’ అన్న కథాంశం ప్రసక్తి వచ్చింది. “టైటిల్ ఇంటరెస్టింగ్ గా ఉంది. కథ ఏమిటి?” ఉత్సుకంగా ప్రశ్నించాడు. “... ఒక మనిషికి కొద్దికొద్దిగా కొమ్ములు పెరుగుతాయి. కుడితి తాగాలని కోరిక పుడుతుంది. గేదెల మీద రొమాంటిక్ కోరిక పెరుగుతుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి, ప్రపంచంలో ప్రతివాడూ దున్నపోతుగా మారిపోయి, ఒక్క హేతువాది మిగులుతాడు. దున్నపోతులన్నీ కలిసి ఆ మనిషిని కొమ్ములతో కుమ్మి చంపేస్తాయి” సంక్షిప్తంగా వివరించాను. వెళ్ళేటప్పుడు కరచాలనం చేస్తూ, "నేను మీ గురించి అనుకున్నది కరక్టే. మీరూ రాoగోపాల్ వర్మ లాగే మిసాంత్రోప్” అని వీడ్కోలు తీసుకున్నాడు.
అది నాకు కొత్త పదం. విమర్శనో, పొగడ్తో అర్థం కాలేదు. తరువాత పరిశీలిస్తే ఆయన చెప్పింది నిజం అనిపించింది. మిసాంత్రోప్ అంటే తన అభిప్రాయాల మీద నమ్మకం వల్ల ప్రపంచం పట్ల కలిగిన కోపంతో ప్రతిస్పందించే వాడు. వీరు కళాకారులైతే రచనల్లోనో, సినిమాల్లోనో, పాటల్లోనో ఇది ప్రతిబంబిస్తూ ఉంటుంది. "ఈ ప్రపంచంలోకెల్లా నేను ఎక్కువ అసహించుకునే జంతువు - మనిషి" అంటాడు అలెగ్జాండర్ పోప్. ఆస్కార్ వైల్డ్, జాపాల్ సార్త్రే, జోనాథన్ స్విఫ్ట్ ఈ వర్గం వారే.
వీరు మనుషులలోని నెగటివ్ కోణాన్ని ఎక్కువ పరిశీలిస్తూ, నచ్చని వాళ్ళని మొదటిక్షణంలోనే అవాయిడ్ చేస్తారు. అవతలి వారిని ఇంప్రెస్ చేయటం కోసం ముసుగు వేసుకోరు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఏదో జనాల్తో కలిసి బ్రతకాలి అన్నట్టు ఉంటారు. అందువల్ల వీరికి (తమ గ్రూపు తప్ప) మిత్రులు చాలా తక్కువ ఉంటారు. వీరు తమ సిద్ధాంతాలే నమ్ముతారు. ఏకీభవించని వారందరూ మూర్ఖులు. వారి పట్ల కోపం. జాలి. బలమైన స్నేహాలుoడవు. ప్రపంచానికి ‘అవుట్ సైడర్’ గానే జీవిస్తారు. తాము నమ్మిందే వేదం అన్న ఫీలింగ్ తప్పు కాదు కానీ, కొంత వయసు వచ్చాక ఒంటరి అయిపోతారు. సాధారణంగా ఎక్కువ నవ్వరు.
ఈ మనస్తత్వం మితి మీరితే అది అమానుషం అవుతుంది. తమ వాదన వినని వ్యతిరేకుల్ని అమితంగా ద్వేషిస్తారు. అమాయకుల్ని చంపే ఐ.ఎస్ ఉగ్రవాదులనుంచీ, ప్రేమించిన అమ్మాయి మీద ఆసిడ్ పోసేవారు ఇలాంటి శ్రుతి మించిన మిసాంత్రోప్ మనస్తత్వంవారే.
ప్రస్తుతం టీనేజ్ యువతలో ఈ మనస్తత్వం ఎక్కువ అవుతోంది. హుక్కా తాగినా, పదహారేళ్ళ వయసులో ప్రేమలోపడినా, తాగి ఆక్సిడెంట్ చేసినా తన సిద్దంతమే తన మతం..! పెద్దల మార్గదర్శకత్వాన్ని ఆమోదించటం లేదు. మాటని గౌరవించటం లేదు. (పెద్దల గతం కూడా గౌరవిoచేటంత గొప్పగా లేకపోవటం ఒక కారణం అయ్యుండవచ్చు). వీరి దృష్టిలో కష్టాలు స్వయంకృతాపరాధాలు. ఇతరుల కష్టాల్లో పాలుపంచుకోరు.
భవబంధాలు ఎక్కువ ఉండవు కాబట్టి వీరికి దుఃఖం కూడా తక్కువ ఒక వ్యక్తి కూతురు వేరే కులం మనిషిని పెళ్ళి చేసుకుందనుకుందాం. సమాజం ఏమనుకుంటుందో అని ఆ తండ్రి అని విలవిలలాడిపోతాడు. 'మిసాంత్రోప్' వ్యక్తి అసలు పట్టించుకోడు.. ఇష్టం ఉంటే కూతురిని తిరిగి ఆహ్వానిస్తాడు, లేదా నిర్ధాక్షణ్యంగా వదిలేస్తాడు. సమాజం గురించి క్షణం కూడా ఆలోచించడు. ఎవరూ లేకపోయినా బ్రతగ్గలనన్న ధైర్యo, పేరు ప్రఖ్యాతలు, ధనము ఉంటే పర్వాలేదు కానీ, లేకపోతే ఈ రకమైన 'మిసాంత్రోప్' మనస్తత్వం మనిషిని అజాత మిత్రువుగా చేస్తుంది.

No comments:
Post a Comment