Thursday, January 3, 2019

భగవంతుణ్ణి పూజించే ఉపచారాలు.

భగవంతుణ్ణి  పూజించే విధానాలలో  మనకు  16 ఉపచారాలు మాత్రమే తెలుసు  మరింత సమగ్రంగా తెలుసుకుందాం .!
        ఉపచారాలు
సంక్షేపం విస్తారం అని షోడశోపచారాలు అనేక విధాలుగా ఉన్నాయి. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, ముప్ఫైఆరు, అరవైనాలుగు. అవి ఇక్కడ ఇవ్వబడుతున్నాయి.
 పంచోపచారాలు- 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం
 
దశోపచారాలు-  1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం
9. దీపం 10. నైవేద్యం

  షోడశోపచారాలు- 1. పాద్యం 2. అర్ఘ్యం  3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం
అష్టాదశోపచారాలు- 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం  5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం
 ముప్ఫైఆరు ఉపచారాలు- 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్తనం 4. నిరుక్షణం 5. సమ్మార్జనం 6. సర్పిఃస్నపనం 7. ఆవాహనం 8. పాద్యం 9. అర్ఘ్యం  10. ఆచమనం 11. స్నానం 12. మధుపర్కం 13. పునరాచమనం 14. యజ్ఞోపవీతం, వస్త్రం 15. అలంకారం 16. గంధం 17. పుష్పం 18. ధూపం 19. దీపం 20. నైవేద్యం 21. నైవేద్యం 22. పుష్పమాల 23. అనులేపనం 24. శయ్యా 25. చామరం 26. వ్యంజనం 27. ఆదర్శం 28. నమస్కారం 29. గాయనం 30. వాదనం 31. నర్తనం 32. స్తుతిగానం 33. హవనం 34. ప్రదక్షిణం 35. దంతకాష్ఠం 36. విసర్జనం
 
చతుష్షష్టి ఉపచారాలతో అంటే (64) ఉపచారాలు- 1. ద్యానం 2. ఆవాహనం 3. ప్రభోధనం 4. మణి మందిరం 5. రత్న మండపం 6. దంత ధావనం 7. సిబికాం 8. రత్న సింహాసనం 9. వితానం 10. పాద్యం 11. అర్ఘ్యం  12 ఆచమనీయం 13 మధుపర్కం 14. అభ్యంగనమ్‌ 15. ఉద్వర్తనం 16. పంచామృతం 17. ఫలోదకం 18. శుద్దోదకం 19. సమ్మార్జనమ్‌ 20. వస్త్రం 21 పాదుకా 22 ఆభరణం 23 కిరీటం 24 కుండలం 25 కవచం 26 యజ్ఞోపవీతం 27 శ్రీ గంధం 28 అక్షతం 29 హరిద్రాచూర్నమ్‌ 30 కుంకుమ 31 పరిమళ ద్రవ్యం 32 సింధూరం 33. పుష్పాణి 34. దూర్వాదళం 35. ధూపం 36. దీపం 37. కుంభ నీరాజనం 38. నైవేద్యం 39. హస్త ప్రక్షాళనం 40 కరో ద్వర్థనమ్‌ 41. పానీయం 42ఫలసమర్పణ 43.తాంబూలం 44.దక్షిణ 45 ఛత్రం 46 చామరం 47. దర్పణం 48. మంగళ నీరాజనం 49. మంత్రపుష్పం 50. ప్రదక్షిణం 51 నమస్కారం 52. తురంగవాహనమ్‌ 53. మదగజం 54. రధం 55. సైన్యం 56. దుర్గం 57. మూషిక వాహనం 58 ఆయుధం 59. వ్యజవీజనం (వింజామర) 60. నృత్యం 61. వాద్యాని 62. గీతశ్రవణం 63. అబినయం 64. క్షమా ప్రార్ధన

ఈ 64 ఉపచారాలు ప్రధానమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఒక చిన్న కథ

ఒక చిన్న కథ

వెన్నెల అనే అందమైన అమ్మాయికి పెళ్ళి కుదిరింది..
చదువు, అందం , ఆస్తి, సాంప్రదాయం అన్ని ఉన్న అమ్మాయి కనుక మగపెళ్ళివారు చూడగానే ఒప్పుకున్నారు.. ఆ అమ్మాయి పెళ్ళి కొడుకుతో మాట్లాడాలి అన్నది...సరే ఇద్దరూ కూర్చున్నారు...
వెన్నెల అన్నది ..." పెళ్ళికి నాది ఒకే ఒక షరతు ...."
అతను కుతూహలంగా  చూసాడు..
" అది ఏమిటంటే ఏ మాట మాట్లాడాలనుకున్నా  సరే,
 అంటే విపరీతమైన కోపం వచ్చినా ..... టెన్షన్ వచ్చినా ..... విసుగ్గా వున్నా... ఏదైనా అసలు నచ్చకపోయినా గొంతు పెంచి మాట్లాడకూడదు.. మీరు ఏం మాట్లాడాలనుకున్నా సరే మెల్లగా అనాలి అంతే !!!
అలా కాకుండా గొంతు పెంచి అరిస్తే నేను పుట్టింటికి వచ్చేస్తాను.. ఆ పై నన్ను ఏమీ అనకూడదు !!!" అన్నది..
అతనికి కొంచెం వింతగా అనిపించినా..తిట్టవద్దు అనలేదు కదా కొంచెం గొంతు తగ్గించమంటున్నది ఫర్వాలేదు అనుకున్నాడు....
పెళ్ళి అయిపోయింది... వెన్నెల పెట్టిన షరతు అత్తగారింట్లో తెలిసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు...
పొద్దున్నే ఇద్దరికీ ఆఫిస్ హడావిడి..." వెన్నెలా కాఫీ అడిగి ఎంతసేపయింది ???" హాలులో కూర్చుని అరిచాడు.. " మెల్లగా... మిమ్మల్ని కలుపుకోమన్నాను కదా !!!"అన్నది వెన్నెల.
 " నేనా ????ఇంకా పెళ్ళి చేసుకున్నది దేనికి  ???" మెల్లగా అన్నాడు...
వెన్నెల నవ్వేసింది.... " మీరు
పెళ్ళికి ముందు షరతు పెట్టాల్సింది నా కాఫీ ఎప్పుడూ నువ్వే పెట్టాలని..." అతను కూడా నవ్వేసాడు
రెండు నెలల తరువాత వెన్నెల తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి బంగారు నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వాలని తెచ్చింది..
అంత ఖరీదైన బహుమతి తనకి చెప్పకుండా తేవడంతో అతని కోపం తారాస్థాయికి చేరుకుంది....
" సంపాదిస్తున్నానని  అంత పొగరా!!!! కనీసం నాకు......"
ఎంతో పెద్దగా అన్నాడో అతనికే తెలియలేదు.. ఒక్కక్షణం మౌనంగా వుండి, వెన్నెల అన్నది.. " ఇదే మాటని మళ్ళీ చెప్పండి... మెల్లగా...."
 ఒక్క నిమిషం ఆగి అతను అన్నాడు..." నిజమే ! నీ ఫ్రెండ్
పెళ్ళి ..కాదనను కానీ నాకు ఒక్క మాట....సరేలే ..."
వెన్నెల " తను నా పెళ్ళిలో డైమండ్ రింగ్ ఇచ్చింది.. " అన్నది శాంతంగా..
  " ఓ..కే.. ఇకనుంచి మీ ఫ్రెండ్స్ విషయంలో నేను జోక్యం చేసుకోను " అన్నాడు
వారి వివాహం అయి ఒక సంవత్సరం అయింది....
గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు...
బంధువులు,మిత్రులు,వచ్చారు.ఎవరో అతనిని ప్రశ్నించారు....
" మీ వైవాహిక జీవితం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి అయింది కదా !! మీ ఆనంద రహస్యం ఏమిటి ??"
" ఏమీ లేదు ...నా భార్య నా గొంతు నొక్కేసింది ...అంతే !"
అన్నాడు .. అందరూ నవ్వారు..
"అంటే ఏమిటి ??" ఎవరో కుతూహలంతో అడిగారు..
అతను వివరించాడు... 
" అందరికీ ఉపయోగపడే సూత్రం చెబుతాను వినండి..
ఏం భావావేశమైనా గొంతు పెంచి మాట్లాడవద్దు... గొడవలు వాటంతట అవే సమసిపోతాయి...ఇక వాదన పెరగదు... కోపం తారాస్థాయికి చేరుకోదు.. నా భార్య నా గొంతులో సైలెన్సర్..బిగించింది
అంతే జీవితం సాఫీగా సాగిపోతున్నది...."
అందరూ ఆమెను అభినందించారు..అతను గర్వంగా చూసాడు...

నీతి...

మన చాలా సమస్యలు పరుష పదజాలంతో రావు ‌.. వాటిని పలికే స్థాయితో వస్తాయి.
" ఈ కూర ఇట్లా తగలడిందేమిటి ???" అనే మాటని పెద్దగా అనండి... చిన్నగా అని చూడండి ..
తేడా మీకే అర్థం అవుతుంది..
పెద్దగా అరవటంవలన మన బి.పి.పెరుగుతుంది మనసులో అశాంతి....ఎదుటివారితో దూరం పెరుగుతుంది...వారి మనసుని గాయం పరుస్తాము..అది వారు ఏనాడూ మర్చిపోరు..
ఇప్పుడు లాభాలు చెప్పండి చూద్దాం...!!!!!

    🙏🙏🙏🙏🙏🙏
    °°°°°°°°°°°°°°°°°°°°°°

Total Pageviews