Monday, June 30, 2014

పోతన భాగవత పద్యం.



అడిగేద నని కడువడిం జను
నడిగినం దను మగుడ నుడుగం డని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడంబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలెన్.

భావం :- అప్పుడు లక్ష్మీదేవి భర్తను ఎక్కడికి వెళ్ళుతున్నాడో ఎందుకు వెళ్ళుతున్నాడో అడగాలనుకొని వేగంగా ముందుకు అడుగులు వేసేది. అడిగితె మారుమాటాడకుండా వెనుకకు పోమ్మంటాడని నడక మానేది. చీకాకుతో తొట్రుపడుతూ మళ్ళీ మెల్లగా ముందుకు అడుగులు పెట్టేది. మళ్లీ ఆగేది. అడుగులు కదిలించ లేక తడబడుతూ నడిచేది

No comments:

Post a Comment

Total Pageviews