Monday, November 29, 2021

అమ్మా శ్రీ మాత్రై నమ: అమ్మలా ఇలా ప్రదోష వేళ శివ శివానీ ఆరాధన మా తరమా! 1

అమ్మా శ్రీ మాత్రై నమ:




అమ్మలా ఇలా ప్రదోష వేళ శివ శివానీ ఆరాధన మా తరమా!
1) https://www.youtube.com/watch?v=CH_ur268TmQ

అమ్మ పూజలు లేని కార్తికం నమ్మ లేకుండా వుంది.
నింగీ, నేల, నీరు, నిప్పూ, గాలి,
గుళ్ళు, గోపురాలు, నదులు, సముద్రాలు
చెట్టు, చేమ, పుట్ట, గుట్ట, రాయి, రప్ప, సకల జీవాల్లొ
సర్వే సర్వత్రా నిండివున్న ఆ సర్వేస్వరుణ్ణి ప్రార్ధించేందుకు
వయస్సు, వాతావరణం అడ్డంకి కాదు ఆవిడకి
నోములూ, పూజలు, వ్రతాలు, పండుగలు, పబ్బాలు
తెల్లవారు ఝామున చన్నీటి స్నానాలు, ఉపవాసాలు
మధు మేహం వున్నా, హృద్రోగం వున్నా దేవుడికి నైవేద్యం పెట్టకుండా తినకుండా
ఇంటిలోను, పెరట్లో తులసికోటకు పూజలు అయినాక
రుబ్బురోలు కూడా శివ శివానీ స్వరూపమైపోతుంది పూజలందుకుంటుంది.
ఆ భక్తి సంకల్పం ముక్కోటి దేవతలూ ఆవిడ చేత
నిత్యనీరాజనల పూజలందుకుని ఆనందించి ఆవిడ కోరుకున్న
"పువ్వులా తీసుకు వెళ్ళిపోండి" అన్న ఆవిడ ప్రార్ధనలు
విని వారి సన్నిధిలో నిత్య కైంకర్యాలకు నియమించుకున్నారు.
చిన్నప్పటి నుంచి ఏ మాసమైనా,
ఏ పండుగైనా ఆవిడ హాడావుడి అవిడదే
అందరికీ సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానాలు అయిపోవాల్సిందే
ఎప్పుడూ మా అందరి క్షేమం కోసం అదుర్ధా పడే దానివి
అలా ఎలా వెళ్ళిపోగలిగావు, అనాయాసంగా
అర్ధాంతరంగా, నిర్దయగా,
మమ్మల్ని ఈ లోకంలో పడేసి
అయ్యో పిల్లలు ఏమైపోతారు అన్న బెంగ లేకుండా
అమ్మా శ్రీమాత్రై నమ:

మాతృదేవోభవ! అమ్మా నీ విలువ ఇప్పుడే తెలుస్తోంది. వెలుగు చూపిన అమ్మ అంటే ఎందుకో అంత చిన్న చూపు. అమ్మ జ్ఞాపకంగా మారిపోడం వ్యక్తి జీవనంలో అత్యంత దురదృష్టకరం. చిన్నప్పుడు ఆటపాటల్లో మురుస్తూ అమ్మను మరుస్తాం. అది తెలియని తనం పెద్దయ్యాక బతుకు తెరువుబాటలో మరోమారు అమ్మను మరుస్తాం అది తెలిసిన తనం. అమ్మేకదా అన్నచులకన భావం అమ్మ విలువ అమ్మ ఉండగా తెలుసు కోలేము తల మీద తైలం పెట్టి అమ్మ కడుపు చల్లగా అంటూ వెన్ను నిమురుతూ ఆశీర్వదించిన ఆ ఆ చెయ్యి, ఆ స్పర్స, ఆ సుస్వరం ఒక్కసారిగా మాయమై స్వర్గానికి చేరుకోవడం ఎంత దురదృష్టకరం శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష!! అన్న అభ్యంగన స్నానానంతర ఆశీర్వచన అనుభూతి అనిర్వచనీయం ఇక సదా స్మరణీయం! కోరితేగానీ, కోరినాగాని వరమీయడు ఆ దైవం కోరకుండానే ఎల్లప్పుడూ మన బాగుకోరే అమ్మే మన దైవం అమరపురికేగిన అమ్మ ఆశీర్వచనం మాత్రం అమరం మాతృదేవోభవ! అమ్మ కనుమరుగైన వేళ ఆదరంతో అనునయించిన బంధు మిత్రులందరికీ శతసహస్ర వందనాలు🙏🙏🙏🙏🙏🙏


Sunday, November 28, 2021

ప్రణయ పల్లవి .... రసామయి! ఈ కథ వెనుక కథ



ఈ కథ వెనుక కథ

2006 సంవత్సరంలో ఇంటర్నెట్ కేఫ్ లో స్టూడెంట్స్ రొమాన్స్, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆటో డ్రైవర్ ని ముద్దు పెట్టుకున్న సంఘటనలు తీవ్రంగా ఆవేదనకు గురి చేసి, ఆ విపరీత రుగ్మతల నివారణకు సుగర్ కోటెడ్ మాత్ర లా ఒక సామాజిక ప్రయోజనాన్నిఆశించి అందించాలన్నతపనకు ప్రేరణ ఈ కథ 
 స రస హృదయులకు అంకితం. కధ పాతదే అయినా అటువంటి సంఘటనలు నిత్యనూతనం.







 

Thursday, November 4, 2021

మారిషస్‌ వారి తెలుగు భాషా, సంస్కృతిక, సంప్రదాయ భక్తికి అంధ్ర పుణ్యభూమి నుంచి ఈ చిరుకానుక ఈ లింక్‌ లో చూడండి.

 జై జై జై జై జై జై జై తెలుగు తల్లీ! జై జై జై జై జై జై జై సాయిరాం! మీ కృషికి మా హృదయపూర్వక శుభాభివందనలు! మారిషస్‌ వారి తెలుగు భాషా, సంస్కృతిక, సంప్రదాయ భక్తికి అంధ్ర పుణ్యభూమి నుంచి ఈ చిరుకానుక ఈ లింక్‌ లో చూడండి. https://www.youtube.com/watch?v=M0d7YgdAtSQ మా చానల్‌ ను సబ్‌ స్క్రయిబ్‌ చెయ్యండి!

Wednesday, November 3, 2021

అనేకానేక ఆనందాలనందించిన రేడియోకి ధన్యవాదాలు!🙏🙏🙏

ఉదయం ఆరు గంటలకు  ఆకాశవాణి... విజయవాడ కేంద్రం ఇప్పుడు సమయం(గంటలు, నిమిషాలు, సెకండ్లు) చెప్పేవారు.

 రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైము సరిచేసేసుకొనేవారు!

 రేడియోలో ప్రతి హిందూ పండగకి ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి. 

 4 గంటలనుండి *మంగళ స్నానం చేసుకునే సమయంలో మంగళ వాయిద్యాలు (సన్నాయి) ప్రసారం చేసేవారు.

ఆరు గంటలకు పుష్పాంజలి మొదలయ్యేది. ఆదివారం నాడు 'శ్రీ సూర్య నారాయణ... వేద పారాయణ...', సోమవారం నాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, 'శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా' అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో 'నమో నమో హనుమంతా' అన్నపాటో... ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!

7 గంటలకు! వార్తలు చదువుతున్నది "అద్దంకి మన్నార్ "

 మధ్యాహ్నం 'ఆకాశవాణి! వార్తలు చదువుతున్నది...' అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో... ఎవరో ఒకరు పలకరించేవారు. ఆ తర్వాత... ' కార్మికుల కార్యక్రమం'. 

 చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు. సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే 'పసిడిపంటలు' మొదలయ్యేది . 

 పసిడిపంటలవ్వగానే 'ప్రాంతీయ వార్తలు' చదివేవారు... ప్రయాగ రామకృష్ణ లేక తిరుమలశెట్టి శ్రీరాములు . అవవ్వగానే 'మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు!' అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం. ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించి మరీ వినేవాళ్ళం. 

 రెండవ్వగానే 'ఢిల్లీ నుంచి వార్తలు' అని చెప్పేవారు. ఇంకా కొన్ని సెకన్లు ఉంటే... కు... కు... కు... అంటూ ఏదో రకం సౌండ్ పెట్టేవారు. ఇంగ్లీషులో వార్తలు... ఢిల్లీనించి ప్రసారమయ్యేవి . ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం. 

 ఇక ఆదివారాలు 

 సంక్షిప్త శబ్ద చిత్రం,  సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు.. వి.బి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఎ.వి.యస్. రామారావు, పాండురంగ విఠల్... వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు... మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.

 ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు. అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం .

 ఇక 'సిలోన్' ఇక్కడ హిందీ పాటలు బాగా వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు వచ్చేవి . ఆ సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు, కానీ, చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినేవాళ్ళం. 

 రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం. 

 ఆ కాలంలో... పసితనం నుండి మనమందరం రేడియోతో పెనవేసుకుపోయాం. కాలక్షేపం, వినోదం అంతా రేడియోతోనే! 

 అప్పట్లో... సినిమా, రేడియో తప్ప వేరే వినోదం అనేది ఉండేది కాదు. రేడియోలో పాత, కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం . పాట  ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్..ఇలా మ్యూజిక్ మొదలవ్వగానే పాట ఏమిటో చెప్పేసేవాళ్ళం. ఇక హిందీ పాటలు... శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్  ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ , ఆర్.డి బర్మన్.. . ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు . ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి. 

అసలు రేడియో విచిత్రం..  అందులోకి మనుషులు   వెళ్లి మాట్లాడతారా అన్న  ఆశ్చర్యం...అమాయకత్వం..

 ఆదివారం మధ్యాహ్నం  గుమ్మం ముందు కూర్చుని రేడియో లో ' సంక్షిప్తశబ్ద చిత్రం( *ఒక గంట కి

కుదించిన ) సినిమాని వింటే ఎంత ఆనందం...     

' రారండోయ్... రారండోయ్...'       హైదరబాదు బాలలమూ జైహిందంటూ పిలిచామూ . _రఁయ్ రఁయ్ మంటూ రారండోయ్ .. రేడియో ప్రోగ్రామ్ వినరండోయ్...అని 

 ఆంధ్ర బాలనంద సంఘం రేడియో కార్యక్రమం ప్రారంభంలో వినిపించే 'పిలుపు పాట '.  ప్రోగ్రామ్ అయిపోయిం తర్వాత ..

" బాలవినోదం విన్నాము... బాలల్లారా ఈపూట...     చాలిక కథలు చాలిక మాటలు .చాలిక పాటలు... నాటికలు ...

 చెంగున రారండి.... చెంగు చెంగున పోదాము  అని ఉండేది.

  1950లనుండి కొనసాగిన బాలానందం ప్రోగ్రాం రేడియోలో వినని వారుండరు. న్యాయపతి రాఘవ రావు (రేడియో అన్నయ్య) గారు, న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) రూపొందించిన ఆ ప్రోగ్రాం లో పి.సుశీల గారు కూడా పాడేవారు. 

 క్రికెట్ కామెంటరీ వింటూ... మురిసిపోయేవాళ్ళం. రేడియో సిలోన్ లో ప్రతీ బుధవారం, రాత్రి 8గంటలకు క్రమం తప్పకుండా "బినాకా గీత్ మాలావినేవారం* 

 వాతావరణ విశేషాలు వరకు విని, 'అబ్బో... ఇంకో రెండు రోజులు వర్షాలు' అని గొణుక్కుంటూ ......ఇలా 

 ఇంకా అనేకానేక ఆనందాలనందించిన రేడియోకి ధన్యవాదాలు!🙏🙏🙏

Tuesday, November 2, 2021

“ దిబ్బూ దిబ్బూ దీపావళి! … మళ్ళీ వచ్చే నాగుల చవితి!

 ఆ విశేషాలు వివరంగా శ్రీ నండూరి శ్రీనివాస్‌ గారి మాటల్లో వినండి. ఈ లింక్‌ ల్లో చూడండి       https://www.youtube.com/watch?v=Y4rZgf-o8vc

మహనీయులు చెప్పిన బాటలో మా చేతలు చూడండి.  


దిబ్బు దిబ్బు దీపావళీ! మళ్ళీ వచ్చే నాగులచవితీ! దక్షిణ దిక్కుగా పితృదేవతలకు గోంగూర కాడలతో దివిటీలు చూపిస్తూ, వారిని తలుచు కుంటూ ప్రార్ధిస్తారు.  దీపావళి రోజు సాయంత్రం టపాసులు కాల్చడానికి తెల్లని వత్తులు చేసి నూనెలోముంచి గోగు కర్రలకు కట్టి వాటిని వెలిగించి “దివ్వీ దివ్వీ దీపావళి మళ్ళీ వచ్చే నాగులచవితీ ఎప్పుడు తిందాము చలిమిడి ముద్ద” అని అంటూ పిల్లలతో కొట్టిస్తారు. కొన్ని ప్రాంతాలలో దివిటీలు కొట్టేటప్పుడు ఇలా కూడా పాట పాడుతారు.                 “ దిబ్బూ దిబ్బూ దీపావళి …మళ్ళీ వచ్చే నాగుల చవితి…. పుట్ట మీద పొట్ట కర్ర “"దిబ్బు దిబ్బు దీపావళీ!   బలుసు చెట్టు మీద పెద్దలారా దిగిరండి“     తరువాత వారికి కాళ్ళు, చేతులు కడిగి వారికి తీపిని తినిపిస్తారు. 

తరువాత లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించి, టపాసులతో ఆనం దంగా పండుగను జరుపుకుంటారు.




Total Pageviews