కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Saturday, January 29, 2022
కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.
Thursday, January 27, 2022
ఇది మేఘ సందేశమూ అనురాగ సంకేతమూ
ఇది మేఘ సందేశమూ అనురాగ సంకేతమూ
లేత మనసుల తొలి ప్రేమలో
అనురాగ సందేశాన్ని ఇంత అందంగా
ఆ మేఘ సందేశాన్ని అమోఘంగా మోసుకొచ్చి
మనసులకు హత్తుకునేలా
అక్షరసుమాల భావ గీతం,
అందుకు అనువైన సంగీతం
అహ హా హా హాయి అనిపించే ఆ ఆలాపన, ఆ యుగళ గానం
అద్భుతాలు అన్నీ కలగలిసిన సమ్మేళనా సంకేతం
అహహహ ఆ ఆ ఆ హా
చిరుజల్లు కురిసేది విను వీధిలో కాదు అది విన్న మదిలో
ఆ ఆ ఆ హా వెల్లువలా పొంగే ఆ పాల వయసుల
మూగ మనసుల ప్రణయ గీతానికి
ఈ పాట బాటలో మరిన్ని పాటలు
అక్షారాల వంతెన వేసి
పల్లవి చరణాలుగా
ఆచరణ లోకి వచ్చేది ఎప్పుడో
ఆ వాగ్ధానం చేసేవారు ఎవరో
ఆప్పుడే కదా
కలిసిన హృదయాలకది దీవెన
Wednesday, January 19, 2022
2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ ఓవర్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం - సత్యసాయి విస్సా నిలయం
2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ ఓవర్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం - సత్యసాయి విస్సా నిలయం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన 2019 క్రికెట్ ప్రపంచ కప్ లో టై మరియు సూపర్ ఓవర్ లలో /ఛాంపియన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి మనసులు గెలుచుకున్నది మాత్రం న్యూజీలాండ్ అందులో ముఖ్యంగా జట్టు కెప్టెన్ స్థిత ప్రజ్ఞత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవ్వు ఆఖరి ఓవర్ ప్రపంచ కప్ ఈ ఉత్కంఠను శిఖరాగ్రానికి చేరుస్తూ ఫైనల్ ఓవర్లో ఇంగ్లండ్ లక్ష్యం 4 బంతుల్లో 15 పరుగులు. ఫైనల్ అనే త్రాసు కివీస్ వైపు మొగ్గింది. మూడో బంతిని స్టోక్స్ లాగిపెట్టి సిక్స్ కొట్టాడు. అప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రాయల్ స్మైల్ నవ్వు ఇంగ్లండ్ లక్ష్యం 3 బంతుల్లో 9 పరుగులుగా మారింది. అప్పటికీ కివీ్‌సదే ఆధిపత్యం. నాలుగో బంతికి స్టోక్స్ 2 పరుగులు తీయడం.. ఫీల్డర్ గప్టిల్ వేసిన త్రో స్టోక్స్‌కు తగిలి బౌండరీ లైన్ దాటడంతో మొత్తంగా 6 పరుగులొచ్చాయి. ఫైనల్ మ్యాచ్‌కు ఇదే టర్నింగ్ పాయింట్. చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన దశలో ఇంగ్లండ్ విజయానికి చేరువైంది. పక్కాగా ఇంగ్లండే గెలుస్తుందని అందరూ ఫిక్సయ్యారు కూడా! ఐదో బంతికి రెండో పరుగు తీసే యత్నంలో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న రషీద్ రనౌట్ అయ్యాడు. చివరి బంతికి 2 పరుగులు కావాలి. బౌల్ట్ వేసిన ఫుల్ టాస్‌ను లాంగ్ ఆన్ దిశగా ఆడాడు స్టోక్స్. వెంటనే ఈ వైపు నుంచి స్టోక్స్.. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ నుంచి వూడ్ పరుగులు పెట్టారు. ఒక పరుగే పూర్తయింది. రెండో పరుగు పూర్తయ్యేంతలో వూడ్ రనౌట్ అయ్యాడు!! 241 పరుగులతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మ్యాచ్ టై!!
Wednesday, January 12, 2022
ఆముక్తమాల్యద కావ్యం గురించి సులభంగా వివరించగల శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఈ వీడియో ఈ లింక్ లో https://www.youtube.com/watch?v=ioTwaML5syU
ధనుర్మాస శుభవేళ! ముక్కోటి ఏకాదశి పర్వదినాన పెద్దలు, పిల్లలతో కలిసి వీలున్నసమయంలో https://www.youtube.com/watch?v=ioTwaML5syU
ఈ వీడియో చూస్తే మనకున్న అనేక సందేహాలు తీరిపోతాయి
1. ధనుర్మాసం అంటే ఏమిటి?
2. శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కథ ఏమిటి?
3. ఆముక్తమాల్యద అంటే ఏమిటి?
4. ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధం చేసి సాయంత్రం కవుల సాహిత్యంతో పోటీపడి యుద్దంలోనూ, కవిత్వంలోనూ గెలిచి సాహితీ, సమరాంగణ సార్వభౌముడు అని పేరు తెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఈ ఆముక్తమాల్యద కావ్యం గురించి సులభంగా వివరించగల శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఈ వీడియో ఈ లింక్ లో https://www.youtube.com/watch?v=ioTwaML5syU చూడండి. మన ఘన చరిత్ర తెలుసుకుందాం తెలియజేద్దాం - విస్సా పౌండేషన్!