కొండేపూడి వారి "మన ఊరు మన ఇల్లు" వీడియో చూడండి.
సీరియల్సు, బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలు కాస్త ఆపి
ఇలాంటి వీడియోలు కుటుంబ అంతా కలిసి చూస్తే
నేటి తరానికి మన బంధాలు, అనుబంధాలు,
పండుగలు, ఉత్సవాలు అర్ధమవుతాయి.
కుటుంబం అనగా భార్య, భర్త, పిల్లల సమూహం.
ఉమ్మడి కుటుంబం అనగా ఒకే గృహంలో
రెండు లేక అంతకంటే ఎక్కువ కుటుంబాల సమూహం.
పూర్వ కాలం నుండి భారత దేశ కుటుంబ వ్యవస్థ
ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, తాతయ్యలు,
నాయనమ్మ తాతయ్యలు, తల్లితండ్రులు, భార్యా భర్తలు,
పిల్లలు, వదిన, మరదలు, పిన్ని, అన్నయ్యలు, తమ్ముళ్ళు
ఇంకా ఆ కుటుంబ సభ్యుల వివాహాల ద్వారా మరిన్ని వంశాల
బంధుత్వం ఇలా అటువంటి ఉమ్మడి కుటుంబాల లో
మా విస్సా వారి కుటుంబం కూడా ఒకటి అలాగే
మా కొండేపూడి వారి కుటుంబ గురించి నేటి తరం వారికి
తెలియ చెప్పెందుకు ఈ లింక్ లో https://www.youtube.com/watch?v=E6yT-uWaVyE వీడియో చూడండి.
మన బంధాలు అనుబంధాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేద్దాం! మరో తరానికి పరిచయం చేద్దాం! విస్సా ఫౌండేషన్!
No comments:
Post a Comment