Wednesday, December 2, 2015

శుభోదయం../\..

శుభోదయం../\..
జగదుద్దారనార్థం యో నరరూప ధరో విభు:
యోగినాంచ మహాత్మానం సాయినాథం నమామి తం!!
సాక్షాత్ కారంచ యో లేభే స్మాత్మారామో గురోర్ముఖాత్
నిర్మమం మామ గాత్రం చ సాయినాథం నమామ్యహం !!




శుభరాత్రి !!! మనకి సంతోషాన్ని ఇచ్చేవి సంపద లేదా వైభవం కాదు ప్రశాంతమైన మనస్సు మాత్రమే సంతోషాన్నిస్తుంది.!!!!


Tuesday, December 1, 2015

దేవునికి ఎటువంటి పుష్పాన్ని అర్పించటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుంది !

దేవునికి ఎటువంటి పుష్పాన్ని అర్పించటం ద్వారా 

ఎలాంటి ఫలితం లభిస్తుంది !

1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.

2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.

3. పారిజాత పూవును అర్పిస్తే - కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.

4. రుద్రాక్షపూవును అర్పిస్తే - ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.

5. మొగలిపూలను అర్పిస్తే - అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.


6. లక్కి పూవుతో పూజిస్తే - భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.


7. పద్మం లేదా కమలంతో పూజిస్తే - సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.

8. మల్లెపూవుతో పూజిస్తే - అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.


9. కల్హర పుష్పంతో పూజ చేస్తే - అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.


10. గన్నేరు పూలతో పూజిస్తే - కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.

11. కలువ పూవుతో పూజ చేస్తే - స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.


12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే - వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.


13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.


14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే - అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.


15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే - జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.


16. మాధవీ పుష్పంతో - సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.


17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే - దేవునిపై భక్తి అధికమవుతుంది.


18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే - జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.


19. కణగలె పుష్పం - దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి.
గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.


20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే - పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి

ప్రతి వ్యక్తి అద్భత సృష్టే !!!


మంచిమాట!!


శుభోదయం__/i\__


శుభరాత్రి !!


శుభరాత్రి !!

ఒక వ్యక్తి విద్యావంతుడైతే అతనొక్కడే విద్యావంతుడు అవుతాడు 
ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం విద్యావంతులవుతారు. 


Total Pageviews