Wednesday, May 2, 2018

కోపం ద్వారా మనమేం సాధించలేమని, కమ్యూనికేషన్‌ ద్వారా మాత్రమే సాధించగమని తెలుసుకున్న మనిషి అనవసరమైన టెన్షన్‌కి లోనుకాడు.Yandamuri Five steps to success. Revising 50th edition. Correcting spelling mistakes.

మాజీ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికల కాన్వాసింగ్ కోసం పాదయాత్ర చేస్తూ, ఆ సాయంత్రం అటు వచ్చినప్పుడు ‘టీ’ కి ఒకరి ఇంట్లో ఆగుతానన్నాడు. తప్పక గెలిచే రూలింగ్ పార్టీ కాoడిడేట్. ఆ ఇంటి యజమాని సంభ్రమమంతో పొంగిపోయాడు. భార్యని టీ చేయమని పురమాయించాడు. కొడుకుని ఇల్లంతా నీట్‌గా సర్దమన్నాడు. నాయకుడు వచ్చే టైం దగ్గర పడింది. యజమాని కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. భార్య పాలు వేడి చేస్తోంది. సరీగ్గా ఆ సమయంలో కుర్రవాడు కిటికీ సర్దుతూ ఉంటే ఇంక్‌ సీసా కింద పడి భళ్లున బ్రద్దలైంది. యజమాని కోపంతో ఊగిపోతూ వాడి చెంప చెళ్ళుమనిపించి, నిముషంలో అది క్లీన్ చెయ్యకపోతే వళ్ళు చీరేస్తానన్నాడు. టీ రుచి చూసి పంచదార ఎక్కువైనందుకు భార్యని తిట్టాడు.
ఈ లోపులో అతిథి వచ్చాడు. ముఖం నిండా నవ్వు పులుముకుని అతడిని లోపలికి ఆహ్వానించి అరగంటసేపు అతడి ఎంటర్‌టెయిన్ చేసాడు. భార్యాపిల్లలని పరిచయం చేసాడు. అతడు కూడా టీ చాలా బావుందని మెచ్చుకున్నాడు. తర్వాత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
అతిథి ముందు అంత బాగా చిరునవ్వు ముసుగు వేసుకున్న యజమాని, తనేం కోల్పోయాడో గ్రహించలేకపోయాడు. అతడు కోల్పోయింది తన కొడుకు, భార్యలతో ఒక మంచి సంబంధాన్ని..! ముక్కూ మొహం తెలియని అయిదు సంవత్సరాల అతిథి కోసం అంత చిరునవ్వు ముసుగు వేసుకున్న యజమాని, జీవితాంతం కలిసి ఉండవలసిన భార్యా బిడ్డల ముందు ముసుగు తీసేసి ఎందుకు రాక్షసుడి లాగా ప్రవర్తించాడు?
ఈ విధంగా తార్కికంగా ఆలోచిస్తే మనిషికి కోపం రాదు. కోపం ద్వారా మనమేం సాధించలేమని, కమ్యూనికేషన్‌ ద్వారా మాత్రమే సాధించగమని తెలుసుకున్న మనిషి అనవసరమైన టెన్షన్‌కి లోనుకాడు.మరోలా చెప్పాలంటే కోపం అనేది మానవసహజమైన ప్రక్రియే. కాదనటం లేదు. కానీ మనకి కోపం వచ్చినట్టు అవతలివాళ్ళకి తెలియజేస్తే చాలు. హింసాత్మక పద్ధతుల ద్వారా ఎదుటివ్యక్తిని బాధ పెడితే వచ్చే లాభం ఏమిటి?
From: Five steps to success. Revising 50th edition. Correcting spelling mistakes.

Tuesday, May 1, 2018

మనస్సు


మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే.
కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందు లగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.
"మననాత్ త్రాయతే ఇతి మంత్రః " పదే పదే పఠించడం ( మననం చేయడం ) వలన రక్షణ కలిగించునది మంత్రము అన్నారు. గాయత్రీ లేదా మరో దేవతా జపము అనేది మంత్ర ప్రథానమైనది. అందు మంత్రమును స్పష్ఠము గా ఉఛ్చరించుట ప్రధానము.( అనుదాత్త ఉదాత్త స్వరితములతో సరిగా ఉచ్ఛరించాలి. ) ప్రస్తుతానికి జపం చెయ్యడంలోని వివిధ స్థితుల గురించి తెలుపుతాను.
౧) పెదాలతో శబ్దం బయటకు వచ్చేటట్టు జపం చెయ్యడం ప్రాథమికం. ఇది మొదటి మెట్టు. ప్రాథమికం అన్నారు కదా అని దీనికి ఏ శక్తీ కలగదు, ఏకోరికా సిద్ధించదు అనుకుంటే పొరపాటు పడినట్లే. కేవలం వేదాన్ని చదివినంత మాత్రముచేతనే జన్మరాహిత్య స్థితిని పొందుతాడు అని ఆర్యోక్తి. ( ఇక కోరిన కోరికలు తీరడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఫలితాలను ఇవ్వడంలో ఒకదానికంటే మరొకటి ఉత్తమం అని తెలుసుకోవడానికే ఈ సూచన చేశారు పెద్దలు).
ప్రాధమికం అనే దృష్టితో ఒకేసారి ఉత్తమ జపం చెయ్యాడానికి ప్రయత్నించి బోర్లా పడిపోతారు చాలామంది సాధకులు. ప్రతీ సాధకుడూ సాధనలో పెట్టాలనుకునే ప్రతీ మంత్రమునూ కూడా ఈ మొదటి మెట్టుతో మొదలుపెట్టాలి. అప్పుడే సాధన సమర్థవంతంగా ఉంటుంది. ఒక మంత్రాన్ని తీసుకుని ముందు సద్గురువు దగ్గర కొన్ని సార్లు చెప్పుకుని ( ఎన్ని సార్లు అనేది మీ గ్రహణ శక్తిని బట్టి గురువు నిర్ణయిస్తారు. వారు మీకు వచ్చింది ఇక మీరు స్వయంగా చదువుకోవచ్చు అని చెప్పిన తరువాత) , కొన్ని రోజుల పాటు వల్లె వెయ్యాలి. ( శబ్దం బయటకి వచ్చేటట్లు ఉచ్ఛైశ్వరముతో మంత్రమును గురువు సన్నిధిలో పదేపదే చదవాలి. గురువు సన్నిధిలో స్వరముతో చదవడం బాగా అలవడిన తరువాత గరువులేనప్పుడు జపసమయంలో కూడా కొన్ని రోజులు సాధన ( ఓ పది పదిహేను రోజులు రోజూ కనీసం మూడువందలసార్లు చదివితే సరిపోతుంది ) చెయ్యాలి. తరువాత రెండవ మెట్టుకి వెళ్లాలి.
౨) పెదాలు కదుపుతూ శబ్దం బయటకు రాకుండా తనకు మాత్రమే వినపడేటట్లు మంత్రం చదవడం ద్వితీయ స్థితి . ఇది సాధనలో రెండవమెట్టు. ఈ స్థితిలో మంత్రం మీకు ( జపం చేసేవారికి ) మాత్రమే వినపడాలి. స్వరాలను పదేపదే గుర్తు చేసుకుంటూ సాధన చెయ్యాలి. అలా కొన్ని రోజుల సాధన ( మంత్రం బాగా నడుస్తున్నది అన్నది నమ్మకంగా అనిపించిన ) తరువాత మూడవమెట్టుకి వెళ్లాలి.
౩) మనసుతో పదే పదే స్ఫురణకు తెచ్చుకోవడం ( మననం చెయ్యడం ) మధ్యమం. పైరెండు స్థితులకంటే ఈ మూడవ స్థితి ( మెట్టు ) చాలా కష్టమైనది. దీనిని అధిగమించడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని జన్మలు పట్టవచ్చు. ఈ స్థితిలోనే మనసు వేరే విషయాలపైకి వెళ్లడం ఎక్కువగా ఇబ్బందిపెడుతూ ఉంటుంది. మనసులో జపం చేయడం అంటే స్ఫురణకు తెచ్చుకోవడం అనేవిషయం గుర్తుంచుకోవాలి.
ఆ మంత్రాన్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఎక్కడైనా తప్పులు పడుతోందేమో తెలుసుకుని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి. జపం చేస్తున్నప్పుడు మనసుకి చెప్పవలసిన అసలైన పని ఇదే. సాధారణంగా మంత్రం తప్పులు రాదు. కానీ రెండు కారణాల వలన తప్పులు దొర్లడం బాగా గమనిస్తే తెలుస్తుంది.
అ) మరో ఆలోచనలో పడడం: ఒకసారి స్మరించడం తేలిక. వందసార్లు గుర్తుకు తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ వేలసార్లు జపించాలి అని సంకల్పించినప్పుడు ఈ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకేసారి వేలసంఖ్యలో జపం చెయ్యాలని సంకల్పించినప్పుడు. సమయం ఎక్కువ పడుతుంది. అంత సమయం మనసు స్థిరంగా ఉండడానికి ఒకేసారి అంగీకరించదు. వ్యతిరేెకిస్తుంది. జాగ్రత్తగా ఉండక పోతే విపరీతాలు జరిగే ప్రమాదమూ ఉంది.
( కనుక ఈ స్థితిలో ఎప్పటికప్పుడు గురువులను, అనుభవఙ్ఞులను సంప్రదిస్తూ ఉండాలి ) ఎక్కువసేపు మనసు నిలిచి ఉండదు. కానీ మంత్రాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం అనే ప్రక్రియని దానికి సాధన ద్వారా అలవాటు చెయ్యాలి. మొదటిలో కష్టం గా ఉన్నా రానురాను సానుకూల పడుతుంది. అందువలన మొదట ఓ వందసార్లు జపం చెయ్యడంతో మొదలుపెట్టి క్రమక్రమంగా జపసంఖ్యను పెంచుకుంటూ పోవాలి.
ఒక వందసార్లు జపం సరిగానే చేస్తున్నాము కదా అని సంఖ్య ఒకేసారి పెంచి రోజూ ఓ వెయ్యిసార్లు జపం చేస్తాను అని దీక్షపూనినప్పుడు మరో సమస్యవలన మంత్రం తప్పులు దొర్లడం కనిపిస్తుంది.
ఆ) మనసు తొందర పడడం : నేను రోజుకు వెయ్యిసార్లు నలభైఒక్క రోజులు చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. కానీ ఆ సంఖ్య మీ మనసుకు భారీగా ఉండి ఉండవచ్చు, లేదా ఏదో ఒక రోజు ఆఫీసుకు లేటవుతుండవచ్చు. అందువలన మనసు తొందర పెడుతుంది. త్వరగా పూర్తి చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆ తొందరలో మంత్రాన్ని ఏదో ఒకలా పలకడం, పరధ్యానంగా చెయ్యడం మొదలవుతుంది. మనసు పెట్టే తొందరను బట్టి అక్షరాలు, పదాలు లేదా వాక్యాలే దాటవేయడం జరుగుతుంది. అలా జపిస్తే మంత్రం ఫలితానివ్వడం అటుంచి అపకారం కలిగే ప్రమాదముంది. కనుక మనసు సిద్దపడక పోయినా, సమయం లేక పోయినా నేను వెయ్యిచెయ్యాలని సంకల్పించాను అది పూర్తిచెయ్యవలసినదే అని మంకు పట్టు పట్టి కూర్చోకూడదు. చెయ్యగలిగిన జప సంఖ్యమాత్రమే పూర్తి చెయ్యాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే "మనసు ఎక్కువ సమయం జపంలో ఉండడానికి సిద్ధపడాలంటే కూడా మన మొండి పట్టుదలే కారణం". అది ఎలాగ అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. అన్ని విషయాలు మాటలతో చెప్పలేము.
పైరెండు స్థితులలో మంత్రం తప్పులు పోవడానికి త్వరగా లక్షల జపాన్ని పూర్తిచెయ్యాలి అన్న సంకల్పమే కారణం. కనుక ఒకే సారి పెద్దపెద్ద అడుగులు వెయ్యడం కాక చిన్న చిన్న అడుగులతో లక్ష్యాలతో ముందుకు వెళ్లాలి. ఎప్పుడు ఎంత ఎక్కువ చెయ్యగలము అన్నది ఎవరికి వారే తెలుసుకోవాలి. గురువులకి శిష్యుని సామర్థ్యమెంతో తెలుస్తుంది. అందుకనే అప్పుడప్పుడు గురువుగారితో పాటు కూర్చుని జపం చేసే అలవాటు చేసుకోవాలి. వచ్చే సందేహాలను నివృత్తి చెసుకుంటూ ముందుకు సాగాలి.
౪) ఇక మంత్రము ఒక దేవత లేదా గురువు ఉపదేశిస్తున్నట్లుగా కర్ణములకు ( చెవులకు ) వినపడడం ఉత్తమం జపం. ఈ స్థితి కలగడానికి చాలా సాధన కావాలి. కొంతమందికి కలలో కొన్ని మంత్రాలు ఉపదేశం ఇవ్వబడతాయి. వాటిని సాధన చెయ్యడం ద్వారా జన్మరాహిత్యాన్ని పొందగలరు. ఇక నిత్య జీవనంలో కూడా ఏపని చేస్తున్నా ఒక స్వరం చెవిలో మంత్రాన్ని వినిపిస్తూ ఉండడం జపం పూర్ణత్వం పొందడాన్ని సూచిస్తుంది. రామకృష్ణ పరమ హంస, రమణ మహర్షి వంటి వారికి ఇది సాధ్యమైనది. ఈ స్థితిలో అనేక శక్తులు సాధకుని వశమౌతాయి.
అణిమాద్యష్ఠసిద్ధులు సాధకుని లొంగతీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అనేక విధాల ప్రలోభపెడతాయి. వాటికి లొంగితే తరువాతి స్థితి ఏమిటన్నది తెలియదు. సాధన అక్కడితో ఆగిపోయి సాధకుడు లౌకిక వ్యామోహాలలో పడతాడు. అనేక విధాల భ్రష్ఠుడౌతాడు.
వాటికి లొంగక ఉపాస్యదేవతనే ఆశ్రయించినవారు జీవైక్యస్థితిని పొందుతున్నారు.
మంత్రము - ఉపాస్య దేవత - ఉపాసకుడు వేరువేరు అనేస్థితిలో మొదలైన ఈ ప్రయాణం ఆమూడూ ఐక్యమై ఒకటే శక్తి గా రూపొందడంతో పరిపూర్ణమౌతుంది.
పైవిషయాలన్నీ గమనించిన మీదట కొన్ని విషయాలు తెలుస్తాయి.
౧) మొదట గురువు వద్ద మంత్ర దీక్షను పూని వారి సమక్షములో కొంత సాధన చెసిన తరువాత స్వయముగా ప్రయత్నించాలి.
౨) మూడవస్థితి ప్రారంభకులకు మొదట సంఖ్యానిర్ణయముతో గాక మానసిక నిశ్చలమును బట్టి సమయ నిర్ణయము ఉత్తమము. అంటే "మనసు నిలచినంత సమయము జపం చెయ్యాలి" అనే సంకల్పముతో మానసిక జపమును ( పునశ్చరణ) చెయ్యాలి. క్రమముగా నూటఎనిమిదిసార్లు, మూడువందలు, ఐదువందలు వెయ్యి అని సంఖ్యా నిర్ణయముతో సాధన చెయ్యాలి.
౩) సాధనమాత్రమే ఆసాధ్యాలను సుసాధ్యం చెయ్యగలదు. మనసు పదేపదే వేరే విషయాలమీదకి వెళుతున్నది కదా అని నీరుగారిపోక మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అలా జపం చేస్తున్నప్పుడు వేరే విషంమీదకి మనసు మళ్లింది అని ఎన్ని సార్లు గుర్తుపట్టగలిగితే మీకు అంత స్థిరమైన సంకల్పం ఉన్నట్లు. మళ్ళిన మనసుని తీసుకువచ్చి మళ్లీ మంత్రం గుర్తుకు తెచ్చుకోవడం మీద పెట్టాలి. ఆ మంత్రము యొక్క అర్థము మీద దృష్టి నిలపాలి. ఆ మంత్ర అధిష్ఠాన దేవతను దర్శించే ప్రయత్నం చెయ్యాలి. కనుక పట్టువదలని సాధన మాత్రమే మీ జీవితాన్ని తరింపచెయ్యగలదు.
శ్రీగురుభ్యోనమః

ఎటునుంచి చదివినా అదే పద్యం

పద్యం మొదటి నుండి చదివినా, వెనుకనుండి చదివినా, యతి ప్రాసలతో సహా, అదే 
పద్యం వస్తుంది , ఇది , అనులోమ విలోమ కందం.
నారదుడు సత్యభామ చేత పుణ్యక వ్రతము చేయించి కృష్ణుని దానముగా గైకొని 
ఆయనను స్తుతించిన పద్యము
“నాయశరగసారవిరయ
తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరధగభసుర
సాయజనయతాయరవిరసాగరశయనా!”
ఇది నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లోనిది.
మంచి శరీరము గలవాడా!సాగరశయానా!అచలమైన బుద్ధి,కట్టుబాట్లు గలవాడా!
లక్ష్మీదేవి శుభములకు స్థాన భూతుడైన వాడా! లక్ష్మీ వాసుండును,కళ్యాణరూపుండైన
శరీరము గల సుందరుడా!సర్వదేవాత్మకుడవైన వాడా!నీ నీతియను,వేగమైన
బాణములచే దుర్జనులను శిక్షించి సుజనులను రక్షించి ధర్మము నెలకొల్పి అందరి
మెప్పును పొందిన వాడవు. వామనావతారంలో ఆకాశము నంటి సూర్యుని తేజమును
మించి పోయినావు.అని నారదుడు స్తుతించెను..

ఒక్కసారి చదవండి


భార్యకన్నా మంచి గాళ్ ఫ్రెండ్ ఏ భర్తకు వుండదేమో !
భర్త ఏంచేస్తే సంతోషంగా వుంటాడా అని నిరంతరం ఆలోచిస్తూ,తనకిష్టమైనవి సరిగా సమయానికి వండిపెట్టి ,అతను తింటుంటే శ్రమంతా మరిచి సంతోషపడుతూ,, ఏవోయ్ చాలా బాగచేసావు అన్న చిన్న పొగడ్తకు కోహినూర్ వజ్రాన్ని ఇచ్చినంత ఆనందం పొందుతుంది.
అతని బయట కోపాలన్నిటిని చిరునవ్వుతో భరిస్తూ, అలసిపోయారా బాగా ఈరోజు అంటూ చల్లనీళ్ళతో అతనికోపాన్ని తగ్గించి వేడి కాఫీ ని ముసిముసి నవ్వులతో అందించగలిగేది భార్య మాత్రమేనేమో !
తన భర్త నిండునూరేళ్ళు క్షేమంగా వుండటానికీ ఎన్నో పూజలు , వ్రతాలు చేస్తూ... ఏంటే చాదస్తం అని విసుక్కున్న, కసురుకున్న సంతోషంగ గుడుల చుట్టు ఓపికగా తిరిగేది భార్య ఒక్కటే..
కష్టం లో భర్త వుంటే విలవిలలాడిపోతూ తన నగలు ,, దాచుకున్న డబ్బులు ఇచ్చి ఏవండీ ఏంకాదు అన్నీ నెమ్మదిగ సర్దుకుంటాయి అని ఓదార్పు , ధైర్యం చెప్పేది భార్యమాత్రమేనేమో....తాను ఎంత తిట్టుకున్నా తన భర్తని వేరెవరన్న చిన్నమాట అన్నా చర్రున కోపగించుకునేది భార్యే సుమీ ! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా సరిపోవు కదా!
భర్త ని మించిన బాయ్ ఫ్రెండ్ ఏ ఆడపిల్లకు వుండడేమో !
తన జీవితం పంచుకోటానికి వచ్చిన భార్య అంటే అపురూపం,,,
తను కష్టపడకుండా సుఖంగ వుండటానికీ ఎంతఎక్కువ కష్టమైన ఆనందంగ భరించేవాడు భర్త మాత్రమే....
భార్యకు ఇష్టమైనవి కొనిచ్చి ఆమె కళ్ళలో ఆనందం చూసి గర్వపడేది భర్తే....
తన ప్రాణం వున్నంత వరకు భార్యను ఏంచేసైనా కాపాడుకుంటానికి ప్రయత్నించేది భర్త తప్ప ఇంకెవరు వుండరు.....
ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ప్రతిరోజు ఒకరిపైఒకరు ప్రేమలో పడితే ఇంక ఆ భార్యభర్తలకన్నా ఎవరు సంతోషంగా వుండరేమో!!!!!
ఇంత మంచి బంధాన్ని నిర్ల్యక్షం చేస్తూ ఫేస్ బుక్ లోనో లేక ఇంకోవిధంగ పరిచయం అయినవారికోసం తమ జీవితభాగస్వామిని పట్టించుకోకుండా ఉండే భార్య,భర్తలు... తయారయ్యారు ఈ మధ్యకాలంలో.....ఉదయం కళ్ళు తెరవగానే తనతో జీవితాన్ని పంచుకుంటూ తనకోసం ఏదైనా చేసే తనవారిని పట్టించుకోకుండా ,,,,కన్నా , బంగారం,అని ఏనాడు తమ జీవిత భాగస్వామిని పిలవడానికీ మనసురాని వాళ్ళు... ముఖం కూడా తెలియని వారిని చంకలు గుద్దుకుంటూ పిలవడం,,,
గుడ్డుమాణింగు అంటూ మెసేజ్ లు పెట్టుకోవటం,వారి నుంచి రిప్లైరాకుంటే ఏదో పెద్ద కష్టం వచ్చినట్టు నిరాశపడటం,,,ఒకవేళ రిప్లైవస్తే నవ్వుకుంటూ వుండటం ,,,,,
ఏకష్టం వచ్చిన నీ వాళ్ళు మాత్రమే నీతోడుంటారనేది మరచి, ఎవరోకోసం నీవాళ్ళను నిర్లక్షం చేసే బుద్దినుంచి మారండి.....
నువ్వు రోగం వచ్చి పడుంటే నిన్ను చూసుకునేది నీవాళ్ళు
ఎవరో హాయ్ బంగారం అని నువ్వు పిలుచుకునే సోషల్ మీడియా ఫ్రెండ్ కాదు....
మీసోషల్ మీడియా ఫ్రెండ్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్సిని ఇంట్లో వాళ్ళకీచ్చి చూడండి,,,
ఎందుకంటే వారు మాత్రమే దానికి అర్హులు కాబట్టి.... మీ ఈ మార్పు ఇంట్లో ఎంత మార్పు తెస్తుందో గమనించండి,,,,
స్నేహం చేయండి,,,,,
కాని మీవారిని వదిలేసి మాత్రం కాదు సుమా!!
note ... ఇది ఎవరినీ ఉద్దేశించి కాదు.... చిన్న మార్పు కోసం

విశాఖపట్నం జిల్లా చరిత్ర.

విశాఖపట్నం జిల్లా చరిత్ర.
VISAKHAPATNAM
స్వతంత్ర్యం రాక ముందు భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా విశాఖపట్నం
260 బి.సి- అశోక చక్రవర్తీ కళింగ యుద్ధంలో కళింగ దేశాన్ని జయించాడు. *విశాఖపట్టణం అప్పుడు, కళింగ దేశంలో ఒక భాగంగా ఉండేది.*
13 ఎ.డి - సింహాచలం దేవస్థానం నిర్మాణం జరిగింది.
208 ఎ.డి - చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖప్రాంతాన్ని పాలింఛిన రాజు.
1515ఎ.డి - ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు విశాల సామ్రాజ్యంలో, విశాఖప్రాంతం ఒక భాగం. ఆయన పాలనా కాలంలో, *సింహాచలాన్ని* పలు మార్లు దర్శించి, పచ్చల పతకాన్ని, మరికొన్ని నగలను బహూకరించినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ పచ్చల పతకాన్ని గజ్జెల ప్రసాద్ అనే స్టూవర్టుపురం గజదొంగ, దొంగతనం చేసాడు. దొంగ దొరికాడు. కానీ, పచ్చల పతకంలోని పచ్చలు కొంచెం విరిగాయి.
1515లో రాయలు కొండవీడును ముట్టడించాడు. కొండవీడు 1454 నుండి గజపతుల ఆధీనంలో ఉంది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేశాడు. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6న స్వాధీనం చేసుకున్నాడు.
కొండవీడు నుండి కటకం వరకు
తరువాత *శ్రీకృష్ణదేవరాయల దిగ్విజయ యాత్ర ఇలా సాగింది.
అద్దంకి, కేతవరం, అమ్మనబ్రోలు, నాగార్జున కొండ, బెల్లంకొండ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు.
విజయవాడ సమీపాన ఉన్న కొండపల్లి దుర్గమును రెండునెలలు పోరాడి స్వాధీనం చేసుకున్నాడు.
అనంతగిరి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, అరసవిల్లి, చిట్యాల, నల్లగొండ మొదలైన దుర్గాలను జయించాడు.
కోనసీమ, జమ్మిలోయ, కోరాము, రాజమహేంద్రవరములను జయించాడు.
మాడుగుల, వడ్డాది, సింహాచలములను స్వాధీనం చేసుకొని సింహాచల నరసింహ స్వామిని పూజించి అనేక దాన ధర్మాలు చేసాడు.
కటకం పైకి దండెత్తి ప్రతాపరుద్ర గజపతిని ఓడించి అతని కుమార్తె తుక్కా దేవిని వివాహమాడాడు.
ఈ విజయ పరంపరలకు గుర్తుగా, పొట్నూరు దగ్గర, శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభాన్ని నిర్మించాడు.
ఈ దిగ్విజయ యాత్ర తరువాత రాయలు 1516లో రాజధానికి తిరిగి వచ్చాడు.
17వ శతాబ్దం మధ్య కాలంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి దగ్గరలో ఉన్న విజయనగరంలో ఒక కర్మాగారం నిర్మించారు.
1689 - ఈ కర్మాగారాన్ని మొఘల్ చక్రవర్తి జౌరంగజీబు సైన్యం ఆక్రమించింది.
1735 - డచ్ దేశీయుల నివాసాలు ఏర్పడ్డాయి. వీరి సమాధులు భీమునిపట్నంలో ఉన్నాయి.
1765 - మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత, ఉత్తర సర్కారు ప్రాంతాన్ని (విశాఖపట్టణం అందులో ఒక భాగం) ఈస్ట్ ఇండియా కంపెనీ కి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచే ఈ ప్రాంతాన్ని సర్కారు అని సర్కారు జిల్లాలు అని పిలవటం మొదలైంది. ఆ సమయంలో, ఇంగ్లీషువారు నివసించటం (కాలనీ) మొదలైంది. ఆ ప్రాంతాన్ని, వన్ టౌన్ ఏరియాలో ఉన్న 'సోల్జియర్ పేట'గా పిలుస్తారు.
ఇప్పటికీ, అక్కడ 'ఆంగ్లో ఇండియన్లు ' ఎక్కువగా నివసిస్తున్నారు.
10 జూలై 1831- ఏనుగుల వీరాస్వామయ్య తన పర్యటనలో భాగంగా కాశీ నుంచి తిరుగుప్రయాణంలో విశాఖపట్టణం పరిసర గ్రామాలలో తిరిగాడు. ఆ పరిసర గ్రామాలు విజయనగరం, ఆలమంద, సబ్బవరం, సింహాచలము, కశింకోట, అనకాపల్లి, యలమంచిలి, దివ్యల, నక్కపల్లి, ఉపమాక, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, ఇంజరము, మాదయ పాళెము, ఉప్పాడ.
1804 సెప్టెంబర్ విశాఖపట్టణం జిల్లా మొట్టమొదటగా ఏర్పడింది. (1803 అని కూడా అంటారు). *1947లో* స్వాతంత్ర్యం వచ్చేనాటికి, భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద జిల్లా విశాఖపట్టణం జిల్లా.
అందుకే ఈ పెద్ద జిల్లా శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాలుగా విడదీసారు.
1847 సెయింట్ అలోసియస్ అంగ్లో ఇండియన్ ఉన్నత పాఠశాల, విశాఖపట్టణం జిల్లాలోనే, అత్యంత ప్రాచీనమైన పాఠశాల. అంతేకాదు, దేశంలోని అత్యంత ప్రాచీనమైన పాఠశాల.
విశాఖపట్టణంలోని పాత నగరం (ఒన్ టౌన్ ప్రాంతం) లో ఉంది. ఇండియన్ కౌన్సిల్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐ.సి.ఎస్.ఇ) కి అనుబంధమైన పాఠశాల.
1902 - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్థులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు
1904 - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
1907 - బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త, అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిథిలాలను, విశాఖపట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించాడు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.
7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయపడని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.
1947 - నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా, 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుధాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక 'బేస్' ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్).
నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్) గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే 'తూర్పు నౌకా దళం' అనే వట వృక్షంగా ఎదిగింది.
1957 - డాల్ఫిన్స్ నోస్ పైన ఉన్న లైట్ హౌస్ (దీపస్తంభం) ని తిరిగి నిర్మిచారు.
1957 - కాల్ట్రెక్స్ (అమెరికాలోని 'కాలిఫోర్నియా'లోని మొదటి కాల్, 'టెక్సాస్' రాష్ట్రంలో 'టెక్స్' కల్లిప్ 'కాల్టెక్స్'గా పేరు పెట్టారు.*
ఈ కాల్టెక్స్‌ని నిర్మీంచటానికి, అక్కడ ఉండే మల్కాపురం అనే గ్రామాన్ని ఖాళీ చేయించి, నేటి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎదురుగా, రోడ్డు దాటిన తరువాత ప్రాంతంలో పునరావాసం కల్పించింది.
🛩🚁*4 డిశంబరు 1971 - భారత నౌకాదళం కరాచీ నౌకాశ్రయం మీద బాంబుల దాడి జరిపి తుత్తునియలుగా చేసింది. ఈ సంఘటనకు ఆపరేషన్ ట్రైడెంట్ అని పేరు పెట్టారు. అప్పటినుంచి, డిశంబరు 4న నేవీ డే (నౌకాదళ దినోత్సవం) గా జరుపుకుంటున్నారు.
1976 - కాల్టెక్స్‌ని భారత ప్రభుత్వం జాతీయ కరణ చేసింది.
1976 - ఇంటర్నేషనల్ విజ్ఞాన శాస్త్రం కాంగ్రెస్ (ఐ.ఎస్.సి) కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆతిధ్యం 1976లో ఒకసారి, 2008లో ఒకసారి ఇచ్చింది.
*1978 - కాల్టెక్స్‌ని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కలిపి వేసారు.
1979 - విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషనుగా ఎదిగింది.
1981 - విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం తన ఉత్పత్తిని ప్రారంభించింది.
1985 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మొదటిసారి విస్తరణ.
14 సెప్టెంబరు 1997 హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పేలుడు జరిగి భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఒక విచారకరమైన సంఘటన.
1999 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రెండవసారి విస్తరణ.
2008 - ఇంటర్నేషనల్ విజ్ఞాన శాస్త్రం కాంగ్రెస్ (ఐ.ఎస్.సి) కి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆతిధ్యం 1976లో ఒకసారి, 2008లో ఒకసారి ఇచ్చింది.
2010 - హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మూడవసారి విస్తరణ.
26 డిశంబర్ 2004 డిసెంబరు నాటి సునామీ దుర్ఘటన సందర్భంగా తీరప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎండబెట్టిన చేపలు కొట్టుకొని పోవడం తప్పించి, విశాఖపట్నం ఏమంత దెబ్బ తినలేదు.
2014 లో హుద్ హుద్ తుపాన్ వచ్చి విశాఖ నగరం బాగా దెబ్బ తిన్నప్పటికి మరలా త్వరగా కోలుకుంది.
అంతే తప్ప...విశాఖపట్నం చాలా ప్రశాంత నగరం, సుందర నగరం...ఈ లాంటి నగరం మనకు జిల్లా కావడం,మన అదృష్టం...మరొక్క సారి మన నగరానికి జై జై లు పలకండి.
ఈ సమాచారాన్ని వివిధ మార్గాలనుండి సేకరించడం జరిగింది.
(సామాజిక మాధ్యాములు ద్వారా,బుక్స్ ద్వారా...)
ఏమైనా తప్పులు ఉంటే సరి దిద్ద గలరు.
Received message forwarded.

అష్టావక్ర మహర్షి


బాహ్య సౌందర్యం కన్న అంతః సౌందర్యం గొప్పదని తన నడవడికతో చెప్పకయే చెప్పిన మహిమాన్విత మూర్తి అష్టావక్రుడు. అష్టావక్రుడు అనే గొప్ప విద్యాశక్తిసంపన్నుడైన మహర్షి ఉండేవాడు. ఈతని తండ్రి ఏకపాదుడు అనే భ్రాహ్మణుడు.ఈయనకు "కహోలుడు" అని కూడా ఇంకొక పేరు.అతను నిరంతర తపోనిరతుడు.వేదవేత్త.ఉద్దాలకుడి చెల్లెలు సుజాత ను పెళ్ళిచేసుకున్నాడు.ఏకపాదుని దగ్గరకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనం చేస్తూ ఉండేవారు.శిష్యకోటితో కాలక్షేపం చేస్తూ భార్య సుజాత తో కలసి జీవించసాగాడు ఏకపాదుడు.సుజాత గర్భవతి అయ్యింది.అష్టావక్రుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే తన తండ్రి ఏకపాదుడు తన శిష్యులచే నిరంతరము వేదాధ్యయనము చేయించటం విని తండ్రితో ఇలా పలికాడు. "తండ్రీ!నిరంతర వేదాధ్యయనముచే శిష్యులను మిగుల బాధించుచున్నారు.అందువలన వారి ఆరోగ్యము పాడగును!" - ఆమాటలకు ఏకపాదునికి కోపంవచ్చి " నా అధ్యాపనమును గురించి వక్రభాష్యం చేసావు (వక్రముగా పలుకటం) కావున నీవు అష్టవక్రములతో (ఎనిమిది వంకరలతో) పుట్టుము" - అని తల్లి గర్భమున ఉన్న శిశువును(తన కుమారుని) శపించాడు.
కొంత కాలానికి అష్టావక్రుడు పుట్టకముందే భార్య కోరిక మేరకు ధనార్జనకోసం జనక మహారాజు సభకు వెళ్ళాడు.ఆ సభలో వరుణుని కుమారుడైన "వంది" చేతిలో వాదనలో ఓడిపోయాడు.పందెం ప్రకారము ఓడినవారు జలమజ్జితులై ఉండాలి.నియమం ప్రకారం ఆ ఏకపాదుడు జలములందు ముంచివేయబడ్డాడు.
ఎనిమిది వంకరలతో పుట్టిన అష్టావక్రుడూ తన మేనమామ ఉద్దాలకుడి ఇంటిలో అతని కుమారుడైన శ్వేతకేతువుతో కలసి వేదాభ్యాసము చేసాడు.ఒక సందర్భములో శ్వేతకేతు మాటలకు కుపితుడై అష్టావక్రుడు వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళి "నా తండ్రి ఎవరు? ఎక్కడ ఉన్నారు? " అని అడుగుతాడు. దానికి సుజాత "నీ తండ్రి ఏకపాదుడు.ధనార్జన కోసం జనకుని రాజ్యమునకు వెళ్ళారు" అని చెపుతుంది. తత్వజ్ఞాని ఐన అష్టావక్రుడు విషయం గ్రహించి శ్వేతకేతుతో కలిసి జనకుని రాజ్యమునకు వెళ్తాడు.తిన్నగా ఆస్థానము లోపలికి వెళ్ళబోతుంటే ద్వారపాలకులు అడ్డుపడి పిల్లలకు ప్రవేశార్హత లేదని చెపుతారు.వారితో అనేక శాస్త్ర విషయాలు చెప్పేసరికి మారు మాట్లాడకుండా అష్టావక్రునికి లోపలికి వెళ్ళటానికి దారినిస్తారు.
అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు దగ్గరకు వెళ్ళి "వంది"తో వాదిస్తానని చెపుతాడు.ఇంత చిన్న బాలుడవు వంది తో వాదకు కుదరదు అన్న జనక మహారాజుతో వాదించి తన శక్తి సామర్ధ్యాలు తెలియచేసాడు.అష్టావక్రుడు జనక మహారాజుతో చేసిన వేదాంత చర్చయే "అష్టావక్ర సమ్హిత".ఆత్మజ్ఞానాన్ని అందించే సంకీర్తనము,శాంతి,నిర్వేదము,జీవన్ముక్తి మొదలైన విషయాలపైన ఎన్నో వేదాంత విషయ వివరణలు ఈ గ్రంధములో ఉన్నాయి.జనకుడు వంది తో వాదనకు అంగీకరించాడు.వాద ప్రతివాదనలలో చివరకు వంది ని బాలుడైన అష్టావక్రుడు ఓడించాడు.జలమజ్జితుడైన తన తండ్రి ఏకపాదుని విడిపించాడు.జనకుడు అష్టావక్రుని చేత అద్వైత వేదాంత సిద్ధాంత రహస్యములను తెలుసుకున్నాడు.తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతో సంతోషించి నదిలో స్నానం చేయించి తన కుమారుని అష్టవంకరలు పోయేటట్లుచేశాడు.
సుందరాకారము పొందిన అష్టావక్రుడు వదాన్య మహర్షి కుమార్తె ఐన సుప్రభ ను వివాహమాడి పుత్రులను పొందాడు.ఆదర్శప్రాయమైన గృహస్థాశ్రమాన్ని సాగించాక అష్టావక్రుడు పుష్కర తీర్థములో తపస్సు చేసి మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీ కృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి మరణించి గోలోకమునకు పోయి మోక్షమును పొందాడు.
అష్టావక్రుని గురించి అనేక గాధలున్నాయి.ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా, ఈతని కురూపమును చూసి రంభాది అప్సరసలు నవ్వినందున, వారు దొంగలచే పట్టుబడునట్లు శపించాడు.అనంతరము వారు క్షమించమని వేడి నృత్యగీతములను అష్టావక్రుడికి వినిపించారు.అందుకు సంతోషించిన మహర్షి ఏమి కావాలి అని అడుగగా వారందరూ విష్ణుమూర్తితో పొందును కోరారు.వారి కోరిక విన్న అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జన్మించి ఆతని పొందగలరు అని పలుకుతాడు. ఆయన అనుగ్రహం కారణంగా గోపికారూపులైన కృష్ణుని భార్యలు గాను,శాప కారణంగా కృష్ణ నిర్యాణానంతరము సముద్రము ద్వారకను ముంచేస్తుంది కాబట్టి, కృష్ణుని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు కృషుని భార్యలైన వారిని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతున్నప్పుడు వారు దొంగలచేత పట్టుబడి నగలు తదితర వస్తువులను సర్వము కోల్పోతారు.అంత ధీరుడైన అర్జునుడు దొంగల చేతిలో ఓడిపోయి ఏమీ చేయలేని స్థితికి చేరుతాడు.
పూర్వజన్మలో అష్టావక్రుడు దేవలుడు.ఇతడు మాలావతి ని వివాహము చేసుకొని సంతానము పొంది విరాగై తపస్సు చేస్తూ ఉండగా అతని తపస్సు కు వేడిపుట్టి ముల్లోకములను బాధించసాగింది.ఇంద్రుడు దేవలుని తపస్సు భగ్నం చేయాలని రంభను పంపితే ఆతను చలించలేదు.అందుకు రంభ కోపముతో మరుజన్మలో నీవు అష్టావక్రుడవై జన్మించమని శపించింది.తర్వాత వెంటనే పశ్చాత్తాపంతో శాపవిమోచనం కూడా తెలియచేసి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది.ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు.
తండ్రిని జలబంధము నుండి తరింపచేసిన తనయుడు.దివ్య మహిమోపేతుడు.అతి తేజస్వి.లోకపూజితుడు అష్టావక్రుడు.

దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.


దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కున యమధర్మరాజు గారు ఉంటారు. ఎవరైనా మనకి నమస్కరిస్తే దానిని ఊరికే పుచ్చుకోకూడదు. వారిని ఆశీర్వదించి వారిని మనం ఏ రకంగా అనుగ్రహించగలమో ఆ విధంగా కాపాడాలి.
ఇప్పుడు యమధర్మరాజు గారికి నమస్కరిస్తే? ఆయన శక్తి అనుసారంగా ఆయన ఎలా అనుగ్రహించగలరో అలా అనుగ్రహిస్తారు. తప్ప నమస్కారాన్ని ఊరికే పుచ్చుకోరు ఎవరు. తప్పనిసరిగా ఆశీర్వదించి తీరాలి ఎంత మేరకు వీలైతే అంత వరకు. ఒహో వీడికి పాపం ఈ శరీరం బాధాకరంగా ఉన్నట్టుంది అందుకని నన్ను శరణు వేడుతున్నాడు అని శరీరంతో ఉన్న బంధనాన్ని తీసి వేస్తారు. లేదా, రోగాలు ప్రబలడానికి కారణం యమధర్మ రాజు గారి ఆగ్రహం అంటారు. ఒహో నాకు నమస్కరించావు కదా, సరేరా అబ్బాయి(అమ్మాయి), నువ్వు చేస్కున్న పాపాలన్ని ఈ రోగం రూపంలో అనుభవించేయి, అప్పుడు ఇక నీకు వాటితో ఒక గొడవ వదిలిపోతుంది అని ఒక రోగాన్ని ప్రసాదిస్తారు చేస్కున్న పాపాలు అన్ని పోయేలాగ. ఆయన చేతుల్లో పనులేంటో అవి కటాక్షించగలరు. కానీ ఈ రెండూ కూడా సహజంగా ఎవరూ కోరుకునే కోరికలు కాదు కాబట్టి దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కరించకూడదు.
ఒక్క సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని దిక్కులకి పెట్టే నమస్కారం తప్ప, ఇక వేరే ఎప్పుడూ దక్షిణ దిక్కుకి నమస్కారం పెట్టకూడదు. ఒకవేళ ఎవరైన పెద్దవారు దక్షిణ దిక్కున నిలబడినప్పుడు వారికి నమస్కరించాలి అనుకుంటే అయ్యా కాస్త ఇటుగా తిరగండి మీకు నమస్కరించుకుంటాను అని చెప్పి దిక్కు మరల్చి అప్పుడు నమస్కరించాలి. అది గురువుకైనా సరే తల్లిదండ్రులకైనా సరే.

Total Pageviews