భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Friday, October 16, 2015
Thursday, October 15, 2015
సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మభ్యాం కుష్మాండ శుభదాస్తుమే!!
అన్నపూర్ణా దేవి
సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్త పద్మభ్యాం కుష్మాండ శుభదాస్తుమే!!
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
బిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్నపూర్నేశ్వరీ !!
సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని పెద్దలు చెపుతారు. అన్నపూర్ణా దేవికి తెల్లని పువ్వులతో పూజ చేయాలి. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి.
రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!
రోజుకొక పద్యం తెలుగు భాగవతం నుంచి మనం
నేర్చుకుంటూ....మన పిల్లలకి నేర్పిద్దాం!!
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఝేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఝేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
టీకా:
ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని; చేసెదన్ = చేసెదను; సమస్త = సమస్తమైన; చర = చరములు; అచర = అచరములుయైన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించే; విజ్ఞాత = నేర్పరి; కున్ = కి; భారతీ = భారతీ దేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాత = కలిగించేవాడు; కున్ = కి; వేద = వేదాల; రాశి = సమూహాలను; నిర్ణేత = ఏర్పరిచిన వాడు; కున్ = కి; దేవతా = దేవతల; నికర = సమూహము యొక్క; నేత = నాయకుడు; కున్ = కి; కల్మష = పాపములను; ఛేత్త = ఛేధించే వాడు; కున్ = కి; నత = నమస్కరించే వారిని; త్రాత = రక్షించే వాడు; కున్ = కి; ధాత = బ్రహ్మ; కున్ = కి;నిఖిల = మొత్తం; తాపస = తాపసులు; లోక = అందరికి; శుభ = శుభాలను; ప్రదాత = ఇచ్చేవాడు; కున్ = కి.

భావము:
చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చు వాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధను లందరికీ శుభాలు ఒనగూర్చువాడూ ఐనట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను.

Wednesday, October 14, 2015
నవరాత్రులలో ఈరోజు అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట.
ముక్తా విద్రుమ హేమ నీల
ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్
తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదా భయాంకుశకశాశ్శుభ్రమ్
కపాలం గదామ్
శంఖం చక్రమధార విందం యుగళమ్
హసైర్వహం తీం భజే !!
అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది. అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.అమ్మవారికి ఇష్టమైన రంగు పసుపురంగు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర.
Subscribe to:
Comments (Atom)