భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Tuesday, November 10, 2015
Monday, November 9, 2015
ఓం శాంతి శాంతి శాంతి:
ఓం శాంతి శాంతి శాంతి:
అనగా
మొదటిసారి శాంతి అనగానే ...మనకి మనవారికి, దుఖః బాధలు
తొలగాలని, రెండవసారి శాంతి అనగానే మన చుట్టూ ఉన్న సమస్త ప్రాణి కోటి
సుఖంగా ఉండాలని, మూడవసారి శాంతి: అనగానే ప్రకృతిపరంగా, గ్రహాల
పరంగా ఏ ఉపద్రవాలూ భూమండలాన్ని తాకవద్దని కోరుకోవటము.
ఏ ప్రార్ధన చివరిలోనయినా మనం ఓం శాంతి శాంతి
శాంతి: అని 3 సార్లు ఉచ్చరిస్తూవుంటాము. ఆ విధంగా 3 సార్లు
ఆనడంద్వార 3రకాలయిన తాపాలు (భాధలు)తొలగాలని భగవంతుని
ప్రార్ధించడమన్నమాట.
ఓం శాంతి (ఆధ్యాత్మిక తాపం చల్లారుగాక)
ఓం శాంతి (ఆది బౌతిక తాపం చల్లారుగాక)
ఓం శాంతి: (అది దైవిక తాపం చల్లారుగాక)
1. ఆధ్యాత్మిక తాపం అంటే, శరీరానికి సంబంధించిన వివిధరకాలైన రుగ్మతలు (రోగాలు మొదలైనవి)తొలగాలని.
2. అది బౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే భాధలు, ప్రమాదాలు తొలగాలని.
3. అది దైవిక తాపం అంటే, దైవవశంవల్ల కలిగే భాధలు యక్షులు, రాక్షసులు మొదలైన వారివల్ల కలిగే ఊహకు కూడా అందని భాధలు, ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్ధించడం.
ఓం శాంతి, శ్శాంతి శ్శాంతి: అని 3 సార్లు చెప్పడంలో
ఇంత అర్ధం దాగివుంది అని పెద్దలు చెపుతారు.

Sunday, November 8, 2015
" పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం. "
" పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం. "
పృధ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు.
శివుడు ఈ పంచభూతాల స్వరుపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై వున్నాడు.
1. పృధ్వీలింగం --- --- కంచి ( తమిళనాడు )
2. జలలింగం --- --- జంబుకేశ్వరం ( తమిళనాడు )
3. తేజోలింగం --- --- తిరువణ్నామలై ( తమిళనాడు )
4. వాయులింగం --- --- శ్రీ కాళహస్తి ( తిరుపతికి సమీపం )
5. ఆకాశ లింగం --- --- చిదంబరం ( తమిళనాడు )
కంచిలోని ఏకామ్రేశ్వరుడు ప్రుధ్వీలింగమై వున్నాడు. ఇక్కడి మామిడిచెట్టు కారణంగా ఈ దేవుడికి ఏకామ్రేశ్వరుడు అని పేరువచ్చింది. కంచి ఏడు ముక్తి దాయక క్షేత్రాలలో ఒకటి. రామేశ్వరం లోని సైకతలింగం కూడా ప్రుధ్వీ లింగమే.
జంబుకేశ్వరం లోని జలలింగం జలమయమై వుంటుంది.
శివునకు జలం చాలా ఇష్టం. శివుడు అభిషేకప్రియుడు. దక్ష హింసవల్ల కల్గిన పాపాన్ని తొలగించుకోవడానికి శివుడు జంబుకేశ్వరం లో తపస్సు చేసాడని పురాణాలు చెపుతున్నాయి.ఈ క్షేత్రం తమిళనాడు లోని తిరుచినాపల్లి వద్ద వున్నది.
అరుణాచలం తేజోలింగనిలయం.అరుణాచలం చుట్టూ చేసే ప్రదక్షిణం మహాపుణ్య ప్రదానమని పెద్దలు చెపుతారు. ఈ క్షేత్రంలోనే రమణ మహర్షి తపోనిష్టుడై వుండి జ్గ్యాన మార్గోపదేశం పొంది ప్రసిద్ధి పొందారు.
శ్రీకాళహస్తి ని దక్షిణ కైలాసం అంటారు. ఇక్కడ వాయులింగ ప్రతిష్టిత మైనది. సాలెపురుగు, పాము, ఏనుగు అనే తిర్యగ్జంతువులు ఇక్కడ శివలింగాన్ని సేవించి ముక్తి పొందాయని శివపురాణం చెపుతోంది. అందువల్లనే శ్రీకాళహస్తిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి కెక్కింది.
ఆకాశలింగం చిదంబరంలో వున్నది. ఇక్కడ విశేషం ఏవిధమైన లింగాకారమూ కనిపించక నిరాకారమైన అంతరాలమే కనిపిస్తుంది. ఇది రూప రహితలింగం. అందువల్లనే ఆకాశ లింగంగా ప్రసిద్ధి చెందినది.ఆకాశంలాగా శివుడు ఆత్మ సర్వవ్యాపి అని దీని వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రం నిర్వికల్ప సమాధికి దోహదకారి.
ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకలైన ఈ లింగాలు పాంచ భౌతికమైన జగమంతా దైవస్వరూపమే అని చాటి చెపుతున్నాయి.
__/i\__ఓం నమః శివాయః __/i\__
Saturday, November 7, 2015
అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదా ?
అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదా ?
సాధారణంగా అన్నిదానాలలోకి అన్నదానము గొప్పది అంటారు. కానీ మనువు అన్నీ దానాలలోకి విద్యాదానము మహోన్నతమైన ఫలమని తెలియ చెప్పాడు. నీరు, అన్నము, గోవులు, భూమి, వస్త్రములు, బంగారము, దినసరి భత్యములు .... వీటి అన్నింటికన్నా విద్యాదానము గొప్పది. ఎందుకంటె వస్తువులు, ధనము లాంటివి దానంగా ఇస్తే వారికే ఉపయోగపడతాయి. అదే విద్యాదానం చేస్తే వారికీ, వారి కుటుంబ మంతటికి ఉపయోగ పడుతుంది అని మనువు తెలియచేసాడు.

Subscribe to:
Posts (Atom)