Wednesday, July 6, 2016

అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని...
తప్పు...
ధర్మం దానంతట అదే గెలవదు,,
నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..
అర్థం కాలేదా...?
అయితే రా.. ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడూ..                                       కృత యుగం లో తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి  ధర్మ సంస్థాపన కి భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు అని చెప్పడం కోసం సత్యాన్ని స్థాపించడం కోసం అణువు అణువు లో భగవంతుడు నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రం లో ఒక స్తంభం నుండీ వచ్చాడు .హిరణ్య కశ్యపుడిని సంహరించాడు.ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు, కష్టాలు పడుతూ ఉంటాడు.
'త్రేతాయుగంలో'
రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకొని
గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు... రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు,, ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి తన భుజాలను, తొడ బాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి నరాలు తెగి రక్తం చిందుతున్న సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు,
యద్ధంలో గెలిచాడు...
ధర్మం గెలిచింది..!
'ద్వాపరయగంలో'
కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని General Audience లా యుద్దాన్ని Enjoy చేయలేదు..
ధర్మం చూసుకున్నాడు పాండవుల పక్షాన నిలుచున్నాడు అర్జునుడికి
రధ సారధిగా మారాడు,
గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు,
దాని పేడ ఎత్తేసాడు,
స్నానాలు చేయించాడు,,
ఆ యుద్ధంలో రధాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటాలు వినపడవు గనుకా అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రధాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు...
అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు...
అబద్ధం ఆడాడు,
చివరకు మోసం కూడా చేసాడు...
అవన్ని ధర్మం కోసమే చేసాడు,
ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు.
అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది,
ధర్మం గెలిచింది...!
'కలియుగం'
ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే వున్నాం..
ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే వుంది..
నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది..
అదే నువ్వు నా, ని, తన, మన బేదాలను పక్కన పెట్టి న్యాయం అలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది,
తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనకాలా ప్రపంచమే నడుస్తుంది. . !         ధర్మో రక్షతి రక్షితః.   శ్రీ అహోబిల మఠం భద్రాచలం.
మంత్రికి తెలివుండాలి!!
బంతుకి భక్తీఉండాలి!!
గుర్రానికి వేగముండాలి!!
ఏనుగుకి బలముండాలి!!
సేనాధిపతికి వ్యూహముండాలి!!
సైనికుడికి తెగింపు ఉండాలి!!

యుద్ధం నెగ్గాలి అంటే వీళ్ళందరి వెనుక 'కసి' వున్నా ఒక రాజుండాలి!!
మనందరిలోనూ ఒక రాజుంటాడు!!
కాని మనమే ఒక రాజులా ఆలోచించటం ఎప్పుడో ఆపేశాం!!  

"మన కసి" - అడవులని చీల్చి అయినా సరే,
సముద్రాల్ని కోసి అయినా సరే,
కొత్త దారులను కనుక్కోగలదు అని మనకి తెలుసు!

అయినా భయానికి బానిసయ్యాం
ఓటమికి తలోంచేసాం!!

చరిత్రలో......చాల మంది రాజులు
..ఓడిపోయారు
..పారిపోయారు
..దాక్కున్నారు
..దాసోహంయ్యారు

కాని కొందరే
అన్ని పోగొట్టుకున్నా
కసితో మళ్ళీ తిరిగివచ్చి యుద్ధం చేసారు

రాజంటే స్థానం కాదు
రాజంటే 'స్థాయి' అని నిరూపించారు

డబ్బోచ్చినా పోయినా వ్యక్తిత్వం కోల్పోకు
రాజ్యాలున్నా చేజారినా రాజసం కోల్పోకు
రాజంటే కిరీటం, కోట, పరివారం కాదు

రాజంటే...ధైర్యం..
రాజంటే .ధర్మం..
రాజంటే ..యుద్ధం..

ఒక రోజు విందుభోజనం చేస్తావు..
ఇంకోరోజు అడుక్కుతిన్తావు - పాండవుల్లా

ఒక రాత్రి .....బంగారు దుప్పటి కప్పుకుంటావు
మరో రాత్రి చలికి వణికిపోతావు ...శ్రీరముడిలా!

ఎత్తు నుండీ నేర్చుకో! లోతు నుండీ నేర్చుకో!
రెండిటి నుండి ఎంతో కొంత తీసుకో !!

రాజంటే స్థానం కాదు ..రాజంటే స్థాయి...
స్థానం బౌతికం ...కళ్లకు కనపడుతుంది
స్థాయి మానసికం, మనసుకు తెలుస్తుంది!

మనందరిలో ఒక రాజు ఉంటాడు ....చంపెసుకున్తావో ...బతికిస్తావో 'నీ ఇష్టం'
💖మౌనం వహించు💖


మౌనం వహించు - కోపం వచ్చినపుడు


మౌనం వహించు - నీకు వాస్తవాలు తెలియనప్పుడు


మౌనం వహించు - నీకు రూడీ గా తెలియనప్పుడు


మౌనం వహించు - నీ మాటలు బలహీనుడిని గాయ పరుస్తున్నపుడు


మౌనం వహించు - నువ్వు వింటున్న సందర్భంలో


మౌనం వహించు - నీ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటె


మౌనం వహించు - నీ తప్పును జోక్ గా చెప్పవలసి వస్తే


మౌనం వహించు - నీ మాటలకు తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది అనుకుంటే


మౌనం వహించు - నీకు సంబంధం లేని విషయం లో మాట్లాదవలసివస్తే


మౌనం వహించు - అబద్ధం చెప్పవలసిన సందర్భంలో


మౌనం వహించు - ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాదవలసివస్తే


మౌనం వహించు - స్నేహానికి భంగం కలుగుతోంది అనుకుంటే


మౌనం వహించు - క్లిష్టమైన సందర్భాలలో


మౌనం వహించు - నీవు అరచి చెప్పవలసిన సందర్భాలలో


మౌనం వహించు - భగవంతుని విషయంలో ,


మౌనం వహించు - స్నేహితుల విషయం లో , కుటుంబం విషయం లో


మౌనం వహించు - తర్వాత సమాధానం చెప్పలేని సందర్భం లో


మౌనం వహించు - ఒకసారి ఇంతకు ముందే చెప్పి ఉంటే


మౌనం వహించు - ఒక చెడ్డవాడిని పొగడవలసిన సందర్భం లో


మౌనం వహించు - పని చేసుకోవలసిన సందర్భంలో

(ఎవరు తన నోటినీ , నాలుకనూ అదుపులో ఉంచుకుంటారో , జీవితంలో సమస్యలను దూరంగా ఉంచుకోగల్గుతారు )                                                      
🙏
అష్టలక్ష్మీ మూర్తులు అందించే శక్తులు.
1. శ్రీ ఆదిలక్ష్మిదేవి - ప్రాణశక్తికి, దైహిక మానసిక ఆరోగ్యానికి అధిష్టాన దేవత.
2. శ్రీ ధాన్యలక్ష్మీ మాత - సకల సస్యసంపదలకి, పాడిపంటలకి అధిష్టాన దేవత.
శారీరక ధారుడ్యాన్ని ప్రసాదించే తల్లి.
3. శ్రీ దైర్యలక్ష్మీ మాత - దైర్య సాహసాలు,మనోబలం ప్రసాదించే తల్లి.
4. శ్రీ గజలక్ష్మీ మాత - సమస్త శుభాలకీ అధిష్టాన దేవత.
5. శ్రీ సంతాన లక్ష్మీ మాత - సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.
6. శ్రీ విజయలక్ష్మీ మాత - సకల కార్య సిద్ధికి, సర్వత్రా వాజయసాధనకి అధిష్టాన
దేవత.
7. శ్రీ విద్యాలక్ష్మీ మాత - విద్యావివేకాలకి,మన అర్హతలకి తగిన గుర్తింపు, రాణింపు
కలిగేలా చూసే చల్లని తల్లి.
8. శ్రీ ధనలక్ష్మీ మాత - సకలైశ్వర్య ప్రదాయిని, అన్ని సంపదలకి అధిష్టాన దేవత.
ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం వల్ల అందరూ సుఖ సంతోషాలతో వుండాలని మా ఆకాంక్ష.

Tuesday, July 5, 2016



పుస్తకం 

ఒంటరైన వాళ్లకు మంచి నేస్తం 
తెలియనివి తెలిపే ఓ మంచి సాధనం 
తెలివిని కలిగించే ఓ కావ్యం 
నడవడికను నేర్పే ఓ బంధం ..!
బ్రతుకుని నేర్పే ఓ గ్రంథం ..! 



కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
ముందుగా అసలు కలశము అంటే ఏమిటి?
నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. ఆ పాత్ర చిత్రములతో కూడా అలంకరించబడి ఉండవచ్చు. అటువంటి పాత్ర 'కలశం' అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు "పూర్ణకుంభము" అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తి తో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది.
సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో 'కలశము' ఏర్పాటు చేయబడుతుంది. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది. ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.
మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహా విష్ణువు పాల సముద్రములో తన నాగశయ్య పై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు . కలశములొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రధమ జాతమైన నీటికి ప్రతీక గా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్దముల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త. ఈ ప్రపంచములో ఉన్నదంతా సృష్టికి ముందుగా నున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది.
ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ' ను సూచిస్తుంది. అందువల్లనే 'కలశం' శుభసూచకముగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.
అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించ బడిన తరువాత అందులోని నీరు "అభిషేకము" తో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింప బడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకములతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు.
పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశముతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కనుక 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.
పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీక గా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభము తో హృదయ పూర్వకముగా స్వాగతమిస్తాము. అని పెద్దలు చెపుతారు!!!

Sunday, July 3, 2016

పిల్లలు నేర్వగ రాని విద్య కలదే ముద్దారనేర్పించినన్ - నేను, నా బాలమిత్రులు


పిల్లలు నేర్వగ రాని విద్య కలదే ముద్దారనేర్పించినన్
నేను, నా బాలమిత్రులు 
ప్రతి ఉదయం రావి చెట్టు నీడలో యోగాతో 
సాయంకాలం పూట మా ఇంట 
తెలుగు మాట, ఆట, పాట, 
ప్రతి ఆదివారం పూట 



















తోటలో స్వచ్ఛ భారత్ వేట 
మా బాల మిత్రుల తో సందడే సందడి 
ఇదిగో చూడండి.

Total Pageviews