Tuesday, November 11, 2014

మా స్వగ్రామంలో 09/11/14 తేదిన జరిగిన లక్షపత్రి పూజ విశేషాలు

మా స్వగ్రామంలో లక్షపత్రి పూజ విశేషాలు ...మా మేనమామ గారు బ్రహ్మశ్రీ బద్రిరాజు సూర్య నారాయణ మూర్తిగారు తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణం కాకినాడ కు దగ్గరలోని వేములవాడ గ్రామంలో (నేను పుట్టిన ఊరు కూడా అదేలెండి) 25 సంవత్సరాల నుంచి కార్తిక మాసంలో శివాలయంలో లక్షపత్రి పూజ చేస్తున్నారు...మేనమామ పోలిక అన్నట్లుగా మా పెద్ద తమ్ముడు తు.గో.జిల్లా ఆలమూరు మండలంలోని మా స్వగ్రామం పినపళ్ళ లో గత 5 సంవత్సరాలుగా శ్రీ పార్వతీ సమేత నీలకంఠెశ్వర స్వామివారి దేవాలయంలో, బ్రహ్మశ్రీ సత్తిబాబు గారి ఆధ్వరంలో పురహితులతో... పురహితం కోరి లక్షపత్రి పూజ చేస్తున్నాడు. బంధు మిత్రులతో మా అన్నదమ్ములం నలుగురూ... ఉదయం నుంచి కైలాసగౌరి నోము, ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమార్చన, సూర్యనమస్కారాలు, దీపాలంకరణ, అన్నసమారాధన బంధు మిత్రులతో శివానుగ్రహం వల్ల అతివైభవముగా మొన్న ఆదివారం 9 వ తేదిన జరిగింది .... సత్యసాయి విస్సా ఫౌండేషన్.

కొన్ని చిత్రాలు ఇవిగో మీ కోసం...



















కొన్ని వీడియోలు ఇవిగో ...మీకోసం 
























No comments:

Post a Comment

Total Pageviews