Monday, December 15, 2014

ఈ దిగువ లంకె నొక్కండి.... మంజుల శ్రీ గారిచే తిరుప్పావై వ్రతం గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.

గోపెమ్మలు ఆచరించిన మార్గశీర్ష వ్రతాన్ని తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులో జన్మించిన గోదాదేవి ' తిరుప్పావై' - శ్రీకరమైన పద్యాల సమాహారం - పాశురాలుగా రచించి అలరించింది. శ్రీ మహాలక్ష్మీదేవి అవతారమైన గోదాదేవి విష్ణు చిత్తుడు అనే మహనీయుని కుమార్తెగా జన్మించి విష్ణుదేవుని రూపమైన శ్రీరంగనాథుని వివాహమాడింది.
ఈ వివాహం సిద్ధించడం కోసం గోదాదేవి తన సఖీ బృందంతో కలిసి ధనుర్మాసంలో రోజుకొక పాశురాన్ని పాడింది. ద్వాపరయుగం నాటి గొబ్బెమ్మలు లేదా గోపెమ్మలు కలియుగంలో గోదాదేవి బృందం.
గోపెమ్మలు తెల్లవారు జామున నిద్రలేచి ఒకరినొకరు నిద్రలేపుకుంటూ వెళ్ళి నందుని ఇంత నిదురించి ఉన్న శ్రీకృష్ణుని నిద్రలేపి పూజించడం 'తిరుప్పావై'లోని ఇతివృత్తం.
ఇంటిముందు గొబ్బెమ్మలను నిలిపి కన్యలు - శ్రీకృష్ణుని గురించి పాడడం - మంచి భర్తను పొందడం కోసం.
ఈ వ్రతంలో భాగంగా ఇరవై ఏడు రోజుల పాటు నెయ్యి, పాలు వంటి భోగవస్తువులను కన్య పిల్లలు పరిహరించాలన్నది సనాతన సంప్రదాయం. ఇరవై ఎనిమిదవ రోజున పువ్వులు ధరించి, నెయ్యితో, పాలతో మధుర మధురమైన పొంగలిని యితర వంటలను చేసి కృష్ణునికి అర్పించి ఆరగించాలి.
కానీ వ్యవహారంలో మాత్రం మొదటి రోజు నుండీ చక్క్రే పొంగలి, ఉప్పొంగలి చేసి నైవేద్యం పెట్టడం ధనుర్మాస సంప్రదాయమైంది. సూర్యుడు ఉదయించకముందే పూజలు చేసి ఈ పొంగలి నైవేద్యం పెట్టడం ఇళ్ళలోనూ, గుళ్ళలోను కూడా కొనసాగుతున్న శుభసాంప్రదాయం.



ఈ దిగువ లంకె నొక్కండి... మంజుల శ్రీ గారిచే తిరుప్పావై వ్రతం గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!!


https://www.youtube.com/watch?v=B1yJlqk07ms

ఈ దిగువ లంకెలు  నొక్కండి... చినజియ్యరు స్వామి వారి తిరుప్పావై  గురించి వివరాలు... ఆ మధుర పాశురాలు వీక్షించండి! తరించండి!!

https://www.youtube.com/watch?v=tej59_nhSJQ


http://www.chinnajeeyar.org
/Learn/Thiruppavai.aspx





No comments:

Post a Comment

Total Pageviews