Tuesday, December 30, 2014

ఈ కూచిపూడి బృంద నాట్య విన్యాసానికి ఆ క్రీడాప్రాంగణం ఆనంద బృందావని అయ్యింది, అయోధ్యపురి, కైలాసగిరి అయ్యింది, ఇది కేవలం గిన్నీసు పుస్తకంలో ఒక కాగితం ముక్కమీద రాయడంకోసం సంకల్పించినది కాదు కాదు కాదు. ఆ శివానందుని... ఆ దశరధనందనుని...ఆ నందనందనుని... మన మహాభాగ్య వశమున భాగ్యనగరము శివరామకృష్ణ లీల క్రీడల నృత్యకేళీ విలాసమయ్యింది ఈ మూడు రోజుల పండుగ కూచిపూడి ని మరువనివ్వమని మూడునాళ్ళ ముచ్చటగా మారనివ్వమని రుజువుపరచింది. ఈ చిరు చిరు మువ్వల సిరి సవ్వడులు... భావి మరుసవ్వడులుగా మారేలా...ఈ తెలుగు నాట్యరీతి భువిలో శాశ్వతమయ్యేలా ఒక తెలుగు వాని గట్టి సంకల్పాన్ని విశ్వానికి చాటిచెప్పింది. ఇదిగో మీ కోసం ఈ యు ట్యూబ్ లంకె నొక్కండి. https://www.youtube.com/watch?v=2wFH1GymPeg తనివితీరా తిలకించండి!పులకించండి!! మా ఆనందుని మహా సంకల్పాన్ని అభినందించండి! సత్య సాయి - విస్సాఫౌండేషన్.
















No comments:

Post a Comment

Total Pageviews