Tuesday, November 27, 2018

కథ

అనగా అనగా ఒక ఊళ్ళో అట్ల పండా అనే బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి వాళ్ల అమ్మ తప్ప 'నా' అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అట్లపండా భిక్షాటన చేసేవాడు; వాళ్ల అమ్మేమో కూలిపనికి వెళ్ళేది. దాంతోటే వాళ్ల జీవనం గడుస్తూండేది.
ఒకరోజున అట్లపండాకి ఎక్కడా ఒక్క పిడికెడు బియ్యంకూడా దొరకలేదు. అతనికి చాలా దిగులు వేసింది. "ఖాళీ చేతులతో ఇంటికి ఎట్లా వెళ్ళటం?" అని బాధ పడుతూ, రోజూ వెళ్ళే దారిలో కాకుండా మరో క్రొత్త దారిలో నడవటం మొదలు పెట్టాడు.

అతను అట్లా అడవి దారిన పోతూ ఉంటే అకస్మాత్తుగా నిర్మలమైన చెరువు ఒకటి కనిపించిందతనికి. దాన్ని చూడగానే వాడికి దాహం వేసింది. తను ఎంత అలిసిపోయాడో కూడా‌ గుర్తుకొచ్చింది. చటుక్కున ఆ చెరువు గట్టున కూర్చున్నాడు. చేతిలోకి ఒక్క దోసెడు నీళ్ళు తీసుకున్నాడు. పాట మొదలు పెట్టాడు- "ఇదిగో, బువ్వ తిన్నానూ.." అని ఆ నీళ్ళు త్రాగేశాడు. వెంటనే మరో దోసెడు నీళ్ళు తీసుకొని, "పాయసం త్రాగానూ.." అని వాటిని త్రాగేశాడు. అట్లాగే మళ్ళీ మళ్ళీ నీళ్ళు తీసుకుంటూ "బూరెలు ఇవిగో తింటున్నా..పప్పు నెయ్యీ తింటున్నా.."అని పాడుతూ నీళ్లతోటే కడుపు నింపుకున్నాడు.

ఆ కోనేరులో ఉన్న గంగమ్మ తల్లికి వాడిని చూస్తే జాలి వేసింది. "అయ్యో పాపం" అనుకొని, ఆ తల్లి ఒక కుండను తీసుకొని, దానిలో రుచికరమైన పదార్థాలన్నిటినీ అమర్చి, దాన్ని అట్ల పండా వైపుకు వదిలింది. దేవి మహిమతో ఆ కుండ నీళ్ళలోంచి పైకి తేలి తేలి పండా దగ్గరికి చేరింది!

అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఆ కుండను చూసి అట్లపండా‌ ఆశ్చర్యపోయాడు. ఆ కుండను పట్టుకొని ఒడ్డు చేరుకున్నాడు; మూత తీసి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న మిఠాయిలన్నిటినీ చూడగానే అతనికి నోట్లో నీరు ఊరింది. కోనేరు ప్రక్కనే ఉన్న అరటి చెట్టునుండి ఆకొకటి తెచ్చుకొని, కుండలో ఉన్న భక్ష్యాలన్నిటినీ కడుపునిండా తిన్నాడు. చూస్తే కుండలో ఇంకా చాలా పదార్థాలు మిగిలే ఉన్నాయి! "అమ్మకి పాపం, ఇవంటే ఎంత ఇష్టమో" అని, వాడు సంతోషంగా ఆ కుండను పట్టుకొని ఇంటికి పరుగుతీసాడు.

కుండ చలవ వల్ల తల్లీ కొడుకు లిద్దరికీ ఆరోజు కడుపునిండా తిండి దొరికింది. రోజూ తెలవారకనే పనికి వెళ్ళే తల్లి, మరునాడు పనికి పోనేలేదు!

అట్లపండాని పిలిచి అన్నది-"ఒరే, మన కష్టాలు ఇక తీరినట్లే, నేను ఇక పనికి పోను. నువ్వు వేరే ఎక్కడా అడుక్కోనవసరం లేదు. రోజూ కోనేరు దగ్గరికే వెళ్ళు నాయనా" అని. అట్ల పండాకు కూడా ఆ సలహా నచ్చింది. సరేనని వాడు ఊరంతా తిరిగి అడుక్కోవటం‌ మానేసి, రోజూ కులాసాగా నడచుకుంటూ కోనేరు దగ్గరికే వెళ్ళి రావటం మొదలు పెట్టాడు.

కోనేరు చేరుకోగానే తను అంతకు ముందు అన్న మాటల్నే మంత్రం లాగా చదివేసి పది దోసిళ్ల నీరు త్రాగేవాడు వాడు. గంగమ్మ తల్లి జాలిపడి, ఒక కుండనిండా తినే పదార్థాలను పంపించేది. ఇక తల్లీ కొడుకులకి పని చెయ్యవలసిన అవసరమే లేకుండా పోయింది. కుండలోని రుచికరమైన ఆహారం తినీ తినీ అట్లపండాకు బొజ్జ పెరగటం కూడా‌ మొదలైంది!

కొన్ని రోజులు ఇట్లా గడిసాక, గంగమ్మ తల్లికి అర్థమైంది- తన దయ కారణంగా తల్లీ కొడుకులిద్దరూ సోంబేరులవుతున్నారు! "ఇట్లా అయితే ఎలాగ, గుణపాఠం నేర్పాల్సిందే" అనుకున్నది ఆ తల్లి. మరునాడే గంగమ్మ కుండనిండా రకరకాల దెబ్బల్ని నింపి పెట్టింది- ముష్టిఘాతాలు, లెంపకాయలు, గుద్దులు, తొడపాశాలు- ఇలాంటివన్నమాట. రోజూలాగానే ఆ కుండ తేలుకుంటూ అట్లపండా దగ్గరికి వచ్చింది. వాడు గబగబా దాన్ని అందుకొని ఒడ్డెక్కి, సిద్ధంగా ఉంచుకున్న అరటి ఆకును తన ముందు పరచుకొని, కుండకున్న మూతను తీసాడు- వెంటనే వాడిపైన దెబ్బల వర్షం కురిసింది. "ఓలెమ్మో, ఓరి నాయనో" అని కేకలు పెట్టుకుంటూ కోనేరు చుట్టూ పరుగులు పెట్టాడు వాడు. అయితే దెబ్బలు వాడిని వదిలితేగా..? వాడు ఎటు వెళ్తే అటు వెంబడించాయి అవి. చివరికి వాడి మెదడు పనిచెయ్యటం మొదలు పెట్టింది- పరుగు పరుగున కుండ దగ్గరికి చేరుకొని, వాడు దాని మూత మూసేయగానే ఒక్క క్షణంలో దెబ్బలన్నీ మాయమైపోయాయి!

అట్ల పండా నిశ్శబ్దంగా అక్కడే కూర్చొని ఆలోచించాడు- "ఇట్లా ఎందుకు జరిగింది?" అని. తను చేసిన తప్పేంటో అర్థమైంది వాడికి. వాడు లేచి గంగమ్మ తల్లికి నమస్కరించుకొని, "ఇకమీద నేను నీ దగ్గరికి రాను తల్లీ, బుద్ధి వచ్చింది. ఏదో ఒక పనిచేసుకొని బ్రతుకుతాను" అని, కుండను పట్టుకొని ఇల్లు చేరుకున్నాడు.

ఆసరికి ఖాళీగా ఊరంతా తిరిగి వచ్చింది వాళ్లమ్మ. అట్లపండా కుండను అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి, ఆమె దాని మూత తీసి "ఈరోజు ఏమున్నాయి?" అని చూడనే చూసింది. ఇంకేముంది, ఆమె మీదకూడా దెబ్బల వర్షం మొదలు! ఎవరో కొట్టినట్లు, గుద్దినట్లు, గిచ్చినట్లు, రక్కినట్లు- ఆమె కేకలు వేసుకుంటూ‌ ఇల్లంతా గుండ్రగా పరుగెత్తింది. ఆమె కేకలు విని అట్ల పండా లోపలికి పరుగెత్తుకు వచ్చి కుండమీద మూత పెట్టేసరికి ఆమె ఒళ్ళు హూనం అవ్వనే అయ్యింది!

"అబ్బా! అయ్యో! అమ్మా!" అనుకుంటూ ముసలమ్మ అక్కడే, చేరగిలపడింది, కుండకేసి భయం భయంగా చూస్తూ. "ఇకమీద మనం ఏదో ఒక పనిచేసుకొని మర్యాదగా బ్రతుకుదాం అమ్మా! ఈ అడుక్కు తినేది వద్దు. ఈ కుండని ఎక్కడైనా ఎవ్వరికీ అందని చోట పెట్టిరా" అన్నాడు అట్లపండా ఆమెతో. ఆమె భయం భయంగానే ఆ కుండని పట్టుకెళ్ళి, పెరట్లో ఉన్న దిబ్బలో దాన్ని పడేసి, చేతులు దులుపుకున్నది- "సరేలేరా, మన రాత అంతే!" అంటూ.

అయితే ఏమైందంటే, ఆరోజు రాత్రి దివాణంలో దొంగలు పడ్డారు. రాజుగారికి పన్ను చెల్లించేందుకుగాను గ్రామపెద్ద సేకరించిన డబ్బంతా దొంగల పాలైంది.

ఆ నలుగురు దొంగలూ ఒక పెద్ద పెట్టెనిండా బంగారు నగలు, ఆభరణాలు అన్నీ మోసుకొచ్చుకొని, అట్లపండా ఇంటి పెరడును చేరుకున్నారు.

"వీటిని వంతులు వేసుకుందాంరా" అన్నాడు వాళ్లలో ఒకడు. అందరూ సరేనని, అటూ ఇటూ చూస్తే, మొత్తం నిశ్శబ్దంగా ఉంది. "సరే, ఇక్కడే కూర్చుందాం, ఏమౌతుంది?" అని వాళ్ళు పెట్టెను అక్కడే దించి, బట్ట పరచుకొని కూర్చున్నారు. దిబ్బలో ఉన్న కొత్త కుండ వాళ్ల కంట పడనే పడింది: "ఒరే, ఈ కుండ బాగుంది, అందులో ఏముందో చూద్దాం" అని వాళ్ళు దాని మూత తెరిచేసరికి ఏముంది, గుద్దుల వర్షం మొదలైపోయింది.

దొంగలు నలుగురూ "ఆలో లక్ష్మణా" అంటూ కాళ్లకు బుద్ధి చెప్పారు.

కొద్ది సేపటికి లేచి వచ్చిన అట్లపండా, వాళ్ల అమ్మ తమ దిబ్బమీద పెట్టిఉన్న పెట్టెను చూసి నిర్ఘాంతపోయారు. దాని మూత తీసి చూసాక తల్లీ కొడుకులిద్దరికీ నోట మాటరాలేదు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టెని ఇంట్లోకి మోసుకెళ్ళారు. అయితే, వాళ్ళిద్దరికీ ఆసరికే జ్ఞానోదయం అయి ఉన్నది కదా, అందుకని వాళ్ళు ఆ నగల పెట్టెని సొంతం చేసుకునే సాహసం చెయ్యలేదు. తెల్లవారగానే ఆ నగల పెట్టెను గ్రామపెద్దకు అప్పగించారు.
"దొంగలు ఉమ్మడి ఆస్తినే ఎత్తుకెళ్ళారే, ఎలాగ?" అని తలపట్టుకొని కూర్చున్న గ్రామపెద్దకి అట్లపండా దేవుడల్లే కనిపించాడు.
ఆయన వాడిని పొగిడి, వాడి నిజాయితీని మెచ్చుకొని, వాడికి ఓ చిన్నపాటి సన్మానం చెయ్యటమే కాక, గ్రామ పంచాయితీలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు! దాంతో తల్లీ కొడుకుల పేదరికమూ పోయింది; వాళ్లకు మంచిరోజులొచ్చాయి!

హంస - వేటగాడు. (కథ)

హంస - వేటగాడు

నీచబుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేని వాళ్ళు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంసకథ తెలుసుకుందాం. మహేంద్రపురంని ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమినాటి చంద్రునిలా తెల్లగా నిండుగా ఉండేది. దానికి చేతనయినంతవరకు ఇతర పక్షులకు సాయంచేస్తూ ఆనందంగా జీవించేది. పావురం మాత్రం పక్షుల జాతిలో ఉత్తమజాతికి చెందిన హంస తనకి స్నేహితుడని, తను మంచివాడు కావటం వల్లనే ఆ హంస తనతో స్నేహం చేసిందని తన జాతి పక్షుల ముందు గర్వంగా గొప్పలు చెప్పుకునేది.

మహేంద్రపురంలో ఉండే వల్లభుడు అనే వేటగాడు ఒక రోజు వేటకోసం అడవికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వరకు వెతికినా వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇవ్వాళ్ళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో గానీ అడవంతా బోసిపోయినట్లుగా ఉంది అనుకుంటూ ఎండవేడికి తట్టుకోలేక దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకు చేరి తన దురదృష్టానికి చింతించసాగాడు. ఆ చెట్టు మీద నిద్రపోతున్న హంస క్రింద అలికిడికి నిద్రలేచి చూసింది. చెమట నిండిన శరిరంతో ఉస్సూరుమంటూ చెట్టు క్రింద కూర్చన్న వేటగాడు కనిపించాడు దానికి. వాడిని చూడగానే ఆ హంసకు జాలి కలిగింది. అలసటతో ఉన్న వేటగాడికి కాసేపు సేద తీర్చుదాం అనుకుంటూ తన పొడవైన రెక్కను విసనకర్రలా మార్చి వాడికి గాలి విసరసాగింది. ఆ చల్లని గాలికి అలసటతో ఉన్న వేటగాడికి నిద్ర వచ్చి ఆ చెట్టు క్రిందే పడుకుండిపోయాడు.

అదే సమయంలో అక్కడకి వచ్చిన పావురం హంస చేస్తున్న పని చూసి, నీది ఎంత జాలి మనసు, మనల్ని చంపటానికి వచ్చిన వేటగాడికి కష్టపడి గాలి విసురుతున్నావు. ఇలాంటి పాపాత్ముడికి సేవలు చేయటానికి నీకు సిగ్గుగా లేదు అంది. దానికి హంస మిత్రమా! పరోపకారం మిదం శరీరం అన్నారు పెద్దలు. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా మనకు చేతనయినంత సాయం చెయ్యాలి అంది. చెయ్యి! చెయ్యి బాగా సాయం చెయ్యి! అంటూ పావురం ఎగతాళిగా నవ్వూతూ సరిగ్గా ఆ వేటగాడి మొహం మీద పడేలా రెట్ట వేసి తుర్రుమంటూ ఎగిరిపోయింది. ఆ రెట్ట సూటిగాపోయి వేటగాడి ముక్కు మీద పడటంతో వాడు కోపంగా కళ్ళుతెరచి తల పైకెత్తి చెట్టు మీదకు చూసాడు. వాడికి రెక్కలను చాపి ఉన్న హంస కనిపించింది. వెంటనే బాణం అందుకుని గురిచూసి హంసను కొట్టాడు. అది సూటిగా పోయి హంస డొక్కల్లొ గుచ్చుకుని దాని ప్రాణాలను తీసీంది.

నీచబుద్ధి కల పావురం చేసిన పనికి పరోపకార బుద్ది కల హంస తన ప్రాణాలను పోగొట్టుకుంది కనుక నీచబుద్ధి కలవారితో స్నేహం చెయ్యటం ప్రమాదం అన్న సంగతి తెలుసుకోవాలి.

వైస్యులపై కంచె కవిత డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్



Tuesday, November 20, 2018

కూరగాయల మనోభావాలు..



గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...
పొట్లకాయకి పొగరు ఎక్కువ..
ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....
చిక్కుడుకు చికాకు ఎక్కువ..
ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....
కందకి..వెటకారం ఎక్కువ..
ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....
వంకాయకి గర్వమెక్కువ ..
కూరగాయలన్నింటికీ తనే రారాజునని....
బెండకాయకి ఆనందమెక్కువ..
తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....
దొండకాయకి ఆందోళనెక్కువ..
కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....
కాకరకాయకి శాంతమెక్కువ..
ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....
బంగాళాదుంపకి సహనమెక్కువ..
కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....
గుమ్మడికాయకి గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....
ఉల్లిపాయకి టెక్కు ఎక్కున..
తానులేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....
మిర్చికి కోపమెక్కువ..
ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....
కరివేపాకుకి మిడిసిపాటు ఎక్కువ..
తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....
బీరకాయకి దిగులెక్కువ..
తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....
కారెట్ కి బీట్ రూట్ కి హంగామా ఎక్కువ..
తమంతటి రంగు ఎవరికీ లేదని....!!
😊😊😁😁😆😆😜😜

లింగాష్టకం అర్ధం

బ్రహ్మ మురారి సురార్చిత లింగం బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం
నిర్మల భాషిత శోభిత లింగం నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం ఓ సదా శివ లింగం నీకు నమస్కారం !

Image result for శివ లింగం


దేవముని ప్రవరార్చిత లింగం దేవమునులు , మహా ఋషులు పూజింప లింగం
కామదహన కరుణాకర లింగం మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం
రావణ దర్ప వినాశక లింగం రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం
తత్ ప్రణమామి సద శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!


Image result for శివ లింగం

సర్వ సుగంధ సులేపిత లింగం అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం .
సిద్ధ సురాసుర వందిత లింగం సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!


Image result for శివ లింగం

కనక మహామణి భూషిత లింగం బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం
దక్ష సుయజ్ఞ వినాశక లింగం దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!


Image result for శివ లింగం

కుంకుమ చందన లేపిత లింగం కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం
పంకజ హార సుశోభిత లింగం కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం
సంచిత పాప వినాశక లింగం సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!


Image result for శివ లింగం

దేవగణార్చిత సేవిత లింగం దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం
భావైర్ భక్తీ భిరేవచ లింగం చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!


Image result for శివ లింగం

అష్ట దలోపరి వేష్టిత లింగం ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం
సర్వ సముద్భవ కారణ లింగం అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం
అష్ట దరిద్ర వినాశక లింగం ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!

Related image

సురగురు సురవర పూజిత లింగం దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం
పరమపదం పరమాత్మక లింగం ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము
తత్ ప్రణమామి సదా శివ లింగం నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!


Image result for శివ లింగం

లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది
శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే శివ లోకం లభిస్తుంది (శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది).🙏🙏

Monday, November 19, 2018

కార్తీక ద్వాదశి / శ్రీ తులసి కళ్యాణం!!

కార్తీక శుక్ల ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు. ఈ ఉత్థాన ద్వాదశినాడు తులసి మొక్కకి కల్యాణం చేస్తారు. ఈ పుణ్యదినానికి సంబంధించిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
ఉత్థాన ద్వాదశినాడు తులసి, విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణుస్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కల్యాణం జరిపిస్తారు. కొందరు కార్తిక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద, ఉసిరి మొక్కలను నాటుతారు. పురాణ కథనాన్ని అనుసరించి, తులసి కల్యాణం కథ ఇలా సాగుతుంది.

దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మధించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్ళి చేసుకోవాలని కలలు కంది. అయితే, అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుండటాన సహజంగానే ఆమెకి తులసిమీద మహా కోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకుపడి, తులసిని ''నువ్వు మొక్కగా మారిపో'' అని శపించింది.

అయితే, తనపట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి, ఒక మొక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో ''తులసీ! బాధపడకు...భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.. నేను సాలిగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరౌతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్ళలో, దేవాలయాల్లో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్ళలో తులసిమొక్కను నాటుకుని పూజిస్తారు. నీకు నీళ్ళు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశినాడు నీతో నాకు కల్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు'' అంటూ ఓదార్చి, దీవించాడు.
Related imageఆ విధంగా తులసిమొక్క కు ఎనలేని పవిత్రత చేకూరింది. తులసిమొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని మనకు తెలుసు. ఏ రకంగా చూసినా తులసిమొక్క మనకు ఆరాధ్యం.
యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా: |
యథాగ్రే సర్వ వేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||
అనే శ్లోకాన్ని పఠిస్తూ తులసికోటకు పసుపు కుంకుమలు పెట్టి, తులసివనాన్ని భక్తిగా పూజిస్తాం.కార్తీక శుక్ల ద్వాదశి లేదా ఉత్థాన ద్వాదశి నాడు విష్ణుమూర్తితో తులసిమొక్కకు కల్యాణం జరిపించి తీర్ధ ప్రసాదాలు తీసుకోవడం ఆచారంగా కొనసాగుతోంది.హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానాన్ని పొందింది. తులసి మొక్క హిందువులకు పూజనీయమైంది. అందుకే హిందువులు ప్రతి ఇంటా తులసి మొక్క ను కోటలో పెంచి పూజించటాన్ని చూస్తూ ఉంటాం. ఇక పట్టణవాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్న చిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.
సర్వేజనాస్సుఖినోభవంతు!!!

Sunday, November 18, 2018

నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు


కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. అటువంటి నిషిద్ధకర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే నిషిద్ధ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు దిక్కున సకలదేవతలు ఉంటా.రు. దక్షిణమున పితృదేవతలు ఉంటారు పశ్చిమమున సమస్త ఋషులు ఉందురు. కనుక ఎప్పుడైనా సరే ఉత్తరం వైపునకే తుమ్మటం, ఉమ్మి వేయాలి. ఇక సుర్యాభిముఖంగా మూత్రవిసర్జన, మలవిసర్జన, ఉమ్మటం, పళ్ళు తోవటం చేయరాదు. ఇవి పంచ మహాపాతకాలలోకి వస్తాయి.
స్నానం నగ్నంగా చేయరాదు. ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. దిగంబరంగ స్నానం చేస్తే అది వరుణిడి(జలాది దేవత) పట్ల అపచారం, శరీరం పిశాచగ్రస్తం అవుతుంది. ఈ పాపకర్మకి(దిగంబరంగ స్నానం చేస్తే) ప్రాయశ్చిత్తం ఏంటంటే.. ప్రతి రోజు సువర్ణం(బంగారం) దానం చేయాలి అలా 12 ఏళ్లు చేయాలి.
సూర్య చంద్ర గ్రహణకాలంలో భోజనంచేసేవారు. నిశ్చయతాంబూలాలిచ్చక ఇతరులకు కన్యాదానం చేసేవారు. పార్ధివలింగాన్ని భక్తితో అర్చించనివాడు,
*******విప్రుని భయపెట్టి ధనం అపహరించేవాడు. ********
దేవతర్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడు. న్యాయాధీశుని లేదా నగరరక్షకుని దిక్కరించినవాడు. తులసీదళం చేబూనికూడా మాటతప్పినవాడు, దైవప్రతిమ ఎదుటప్రమాణంచేసి తప్పినవాడు.. నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
మిత్రులను మోసంచేసినా, చేసిన మేలు మరచినా, తప్పుడు సాక్ష్యాలు సమర్పించినా, దేవబ్రాహ్మణ పరిహాసకులు, దైవజ్ఞుడు, వైద్యుడు అయినవారు తమకు విహితమైన ధర్మాలను ఆచరించక లోహ-రసాది విక్రయాలు చేపట్టి ప్రజలను వంచిస్తే నరకప్రాప్తి.
బ్రాహ్మణ, దేవతార్చన, శంఖద్వని, తులసి, శివారాధన లేని చోట, విష్ణు భక్తులని నిందించిన చోట, సంధ్యావందన విహీనుడు ఉన్నచోట, ఆచార వర్జితుడి ఇంట, వాచాలుడైన వాడి ఇంట, తడికాళ్ళతో, నగ్నంగా నిదురించేవాడి ఇంట, తోడపై దరువువేసే వాడిఇంట, బ్రాహ్మణ ద్వేషి, జీవ హింస చేసేవాడి ఇంట, దయాశున్యుడి ఇంట, విప్రులని నిందించే వాడి ఇంట, లక్ష్మిదేవీ క్షణకాలం కూడా నిలువదని శాస్త్రాలు చెబుతున్నాయి.
రుద్రాక్షధరించి లేదా ఏదైనా పవిత్ర వస్తువుని స్పృశించి అసత్యం చెప్పరాదు. శుభ కార్యాలకి బయలుదేరేటప్పుడు భర్త ముందు భార్య వెనుక నడవాలి. అశుభకార్యాలకి బయలుదేరేటప్పుడు భార్య ముందు భర్త వెనుక నడవాలి.
నుదురు మీద బొట్టు, ఎడం భుజం మీద వస్త్రం లేకుండా ఇతరులకు బట్టలు పెట్టకూడదు. ఎవరికైతే వస్త్రం ఉండదో వారికీ ఆయుక్షీణం. నురుగు ఉన్న నీరు పూజకి పనికిరాదు, అలానే వెంట్రుక ఉన్న నీరు కూడా. పరస్త్రీలను కామించేవారు, పరద్రవ్యాలని ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టాలి అనుకునేవారు మానసిక పాపులు.
పాడ్యమి, షష్టి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణలయందు, వ్రత, శ్రాద్ధ దినముల యందు శరీరమునకు తైలమును పట్టించుకూడదని విష్ణు పురాణం చెబుతోంది.
భోజనం చేసేటపుడు నిషిద్ధ కర్మలు
ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయరాదు. శ్రాద్ధకర్మ చేసే రోజు మాత్రమే ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయాలి. బొట్టు లేకుండా భోజనం చేయరాదు. భోజనంలోవెంట్రుక వస్తే ఆ భోజనం త్యజించవలెను. కనీసం నేతితో(ఆవు నెయ్యి శ్రేష్టం) అభికరించిన(శుద్ధి) తరువాత తినాలి.
నిదురించేటపుడు.. ఉత్తరం వైపు తలవుంచి నిద్రపోకూడదు. తడికాళ్ళతోకానీ, నగ్నంగా కానీ నిద్రపోకూడదు.
దేవాలయ దర్శనంలో నిషిద్ధకర్మలు
దేవాలయ ముఖ ద్వారం పాదరక్షలు వేసుకుని దాట కూడదు. దేవాలయం గడపని తొక్కరాదు. ఈ రెండు చేసిన వారికి రాబోవు జన్మలో వికలాంగులుగా జీవించే అవకాశం ఉంది. ఈశ్వరుడికి కాళ్ళుపెట్టరాదు, గుడిలో సాష్టాంగనమస్కారం చేసేటపుడు అన్ని వైపులా గమనించుకుని ఈశ్వరుడి వైపు కాళ్ళు రాకుండా చూసుకుని సాష్టాంగనమస్కారం చేయవలెను. ఒకవేళ అలా కుదరకపోతే నుంచుని నమస్కారం చేస్తే సరి పోతుంది.
పెళ్లి విషయంలో నిషిద్ధకర్మలు
ఇంటిలో ఆరోగ్యంగా ఉన్న పెద్ద కుమారుడుకి పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకి చేయరాదు, అలాచేస్తే పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, పెళ్లి జరిపించిన పురోహితుడు అందరూ నరకానికి వెళతారు. ఇది ఆడపిల్లలకి కూడా వర్తిస్తుంది. పెళ్లికాని అన్నగారిని పరివిత్తి అంటారు. పరివిత్తితో కూడిన యజ్ఞాదులు కూడా పాపాలే అవుతాయి. పరివిత్తికి కన్యాదానంచేయడం అపాత్రదానం అవుతుంది.

మారేడు దళాల గొప్పతనాన్ని తెలుసుకుందాం.


Image result for త్రిదళంఈ కార్తీక మాసం శుభ సందర్భంలో లక్షబిల్వపత్రి పూజ, మారేడు దళాల గొప్పతనాన్ని తెలుసుకుందాం.
త్రిదళం త్రిగుణాకారం
మారేడు నీవని ఏరేరి తేనా?! మారేడు దళములు నీ పూజకు...అన్నాడు మహా కవీశ్వరుడు వేటూరి. ఎంత అద్భుతమైన శ్లేష?! శ్లేషలో అపురూపమైన భావం, మారేడులో ప్రభువుని ఇమిడ్చి చమత్కరించాడు. మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ''శివేష్ట'' అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలము. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు. ఇది కేవలం ఆచారం కాదు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడంవల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలు అశుద్ధం కాకుండా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది. దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.
బిల్వ పత్ర మహిమImage result for త్రిదళం
శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించినాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. నన్ను పట్టుకోలేకపోయావే? అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.
శారీరక రుగ్మతలను పోగొట్టే మారేడుImage result for త్రిదళం
లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు. మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు. మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రము. మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది. బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి. మారేడు అరుచిని పోగొడుతుంది. జఠరాగ్నిని వౄఎద్ది చేస్తుంది. వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. మలినాలను పోగొడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది.
మారేడు ఉపయోగాలు: బిల్వ పత్రాలను నూరి రసం తీసి, శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు.మారేడు వేళ్ళ కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది. మారేడు వేళ్ళతోతో చిక్కటి కషాయంచేసి మూలాలను తడిపినట్లయితే, వ్యాధి నయమౌతుంది. ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది. మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలూ కలగవు.
బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి. ఇలా మారేడు ఆకులు, కాయలు, వేళ్ళు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ చెట్టు దైవంతో సమానం. మారేడు చెట్టు ... మామిడి చెట్టులా కళకళలాడుతూ కాకుండా అనేక ముళ్లతో కనిపిస్తుంది. మారేడు కాయాలు మామిడికాయల్లా నోరు ఊరించలేవు. ఇక మారేడు దళాలను మామిడాకుల్లా శుభకార్యాలలో ఉపయోగించరు. అలాంటి మారేడు చెట్టు ఎలా విశిష్టమైనది అవుతుందనే సందేహం కొంతమందిలో కలుగుతూ వుంటుంది. మారేడు దళాలు బ్రహ్మ .. విష్ణు .. మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. తులసీ దళాలు లేకుండా శ్రీమహావిష్ణువుకి చేసే పూజ వ్యర్థమైనట్టే, మారేడు దళాలు లేకుండా సదాశివుడికి జరిపే పూజ కూడా వ్యర్థమని చెప్పబడుతోంది. కాలకూట విషాన్ని మింగడం వలన పరమశివుడు తీవ్రమైన వేడికి లోనవుతుంటాడు. మారేడు దళాలు ఎంతో చల్లదనాన్ని కలిగిస్తూ వుంటాయి గనుక, వీటితో శివుడిని అర్చిస్తుంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడుచెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయడం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు.
పుణ్య ఫలాలను ఆర్జించడం కోసం కొందరు పెద్ద సంఖ్యలో అన్నదానాలు చేయాలని అనుకుంటారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా చేయలేకపోతుంటారు. అన్నదానం వలన పొందవలసిన పుణ్య ఫలాలను పొందలేక పోతున్నందుకు బాధపడుతుంటారు. అలాంటి వారు మారేడుచెట్టు నీడలో అన్నదానం చేయవచ్చు. మారేడు చెట్టునీడలో కొందరికి అన్నదానం చేసినా కోటిరెట్ల ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది. ఇక మారేడు చెట్టు మూలంలో శివలింగాన్ని వుంచి పూజించడం వలన సకల శుభాలు చేకూరతాయి. శివ సాయుధ్యం సైతం లభిస్తుంది.
Image result for త్రిదళం
_/I\_
శుభం భూయాత్!!!

రాధా మనోహరాలు





రాధా మనోహరాలు
ఈ సుమాలు రాధా మనోహరాలు! 
నయన మనోహరాలు!
సుమ సుగంధాలు వెదజల్లే 
సువాసనా సమ్మోహనాలు!!
ఆ రాధ ఆరాధనా ప్రతిరూపాలో?
మాధవానంద ప్రతిబింబాలో?
ఈ కార్తీక మాస ఏకాదశి శుభవేళ; విస్సా ఫౌండేషన్ నేటి తరాలకి సమాచారం కోసం సమర్పిస్తున్న ఓ కుసుమం! రాధా మనోహరం! 
క్విస్క్కుఅలైస్ (Quisqualis) జాతిలో కాంబ్రిటేసి కుటుంబానికి చెందిన
రాధా మనోహరం లేదా రంగూన్ మల్లి అని పిలవబడే ఈ పువ్వులు (Quisqualis indica also known as the Chinese honeysuckle, Rangoon Creeper, and Combretum indicum) ఆసియా ఖండంలో కనిపించే పొదలుగా పెరిగే ఎర్రని పువ్వుల మొక్క. It is found in many other parts of the world either as a cultivated ornamental or run wild. Other names for the plant include Quiscual (in Spanish), Niyog-niyogan (in Filipino), Madhu Malti or Madhumalti (in Hindi) and Radha Manoharam (in Telugu). The genus translates into Latin 

కార్తీక పురాణం -12వ అధ్యాయం

Image result for అంబరీష ఉపాఖ్యాన"వశిష్ఠమహాముని తిరిగి ఇట్లు చెప్పెను. ఓరాజా! కార్తీకమాసమందు సోమవారమహాత్మ్యమును వినుము. సోమవారముకంటే శనిత్రయోదశి నూరురెట్లు ఫలముగలది. శనిత్రయోదశికంటె కార్తీక పూర్ణిమ వెయ్యిరెట్లు ఫలముగలది. పూర్ణిమకంటే శుద్ధ పాడ్యమి లక్షరెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమికంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదము. అంతిమైకాదశికంటే కార్తీకద్వాదశి అనంతగుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమైకాదశియనగా కార్తీకబహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారముగా చూచిన యెడల కార్తీకశుద్ధ ఏకాదశియేయగును. వింధ్యోత్తరదేశమందు అంతిమైకాదశియనగా కార్తీకశుద్ధైకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. ఇదిగాక ముందు కార్తీకశుద్ధైకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందును శుద్ధైకాదశియే గ్రహించబడినది. మోహముచేతనైనా అంతిమైకాదశినాడు ఉపవాసముచేసి గీతవాద్య పురాణములచేత జాగరణమాచరించువాడు సమస్త పాపవిముక్తుడై విష్ణులోకమందు నివసించును. ఏకాదశినాడు ఉపవాసమాచరించి క్ద్వాదశినాడు బ్రాహ్మణులతో గూడా పారణచేయువాడు సాయుజ్యముక్తిపొందును. ద్వాదశినాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధిబొందును. సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును. వేయి గ్రహణములును, పదివేల వ్యతీపాతయోగములును, లక్ష అమావాస్యలును కలిపి ద్వాదశీ వ్రతఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు. పుణ్యములనిచ్చెడు తిథులనేకములున్నవి గాని ద్వాదశి హరిప్రియముగాన వాటికన్నిటికంటె అధికఫలప్రదము. క్షీరాబ్దిద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు అనగా ఏకాదశినాడు రాత్రి యామముండగా హరి పాల సముద్రమునుండి నిద్ర లేచును గాన ఆద్వాదశి హరిబోధినియనబడును. ఆద్వాదశినాడు ఒక బ్రాహ్మణునకయినను అన్నదాన మాచరించువాడు యిచ్చట భోగములనుబొంది అంతకాలమందు హరిసన్నిధి పొందును. కార్తీకమాసమందు ద్వాదశినాడు పెరుగు అన్నమును దానముచేసిన యెడల సమస్త ధర్మములకంటే అధిక ఫలమునుబొందును. స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీక శుక్ల ద్వాదశినాడు పాలిచ్చెడియావునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతోగూడ గోదానమాచరించిన యెడల ఆగోవుకు యెన్నివేల వెంట్రుకలుండునో అన్నివేల యేండ్లు స్వర్గనివాసు కలుగును. కార్తీకమాసమందు ద్వాదశినాడు భక్తితో వస్త్రదానమాచరించు వాడు పూర్వజన్మార్జిత పాపములను నశింపజేసికొని వైకుంఠలోకమునకుబోవును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ద్వాదశియందుగాని, పూర్ణిమయందుగాని, పాడ్యమియందుగాని, కంచుపాత్రలో ఆవునెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశినాడు ఫలమును, యజ్ఞోపవీతమును, తాంబూలమును, దక్షిణను, యిచ్చువాడు ఈలోకమందు అనేక భోగములను బొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో గూడా చికాలము సుఖించును. కార్తీక ద్వాదశినాడు బంగారపు తులసీవృక్షును, సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును జెప్పెదను వినుము. కార్తీకద్వాదశినాడు పూర్వోక్తానమును జేసినవాడు ాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయి దానమిచ్చువాడు పొందిన ఫలమును బొందును. ఈవిషయమందు ఒక కథగలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతములు నశించును. గోదవరి తీరమందు దురాచారవంతుడైన యొక కోమటిగలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు. ానైనను అనుభవించుటయును లేదు. వాడు ఎవ్వనికిని ఉపకారమాచరించలేదు. నిత్యము పరనిందచేయు వాడు, పరద్రవ్యములందాసక్తి గలిగియుండువాడు. ఆకోమటియొక బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ ఋణమును తిరిగి పుచ్చుకొనుటకొరకు ఆయన యూరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలిసికొని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా! Image result for అంబరీష ఉపాఖ్యాన"
నాసొమ్ము నాకిమ్ము అనియడిగెను. బ్రాహ్మణుడా మాటవిని ఓయీ! యీనెలాఖరుకు నీ సొమ్మును నీకు యేదోయొక విధముగా యిచ్చెద్దను. కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసికొని పొమ్మనెను. ఋణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనలనొంది తిరిగి ఋణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును యివ్వవలసియుండును. బ్రాహ్మణుడిట్లు చెప్పినమాటను విని వైశ్యుడు కోపముచేత కళ్ళెర్రజేసి ఓరీ మూఢా! బ్రాహ్మణాధమా! నాధనము నాకిప్పుడేయిమ్ము లేనియెడల యీకత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆవేదాంతవేత్తయైన బ్రాహ్మణుని జుట్టుపట్టుకొని లాగి క్రిందపడద్రోసి పాపబుద్ధిగలవాడగుటచేత తన కాలితో వానిని తన్ని కత్తితో కొట్టెను. ఆకత్తిదెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహముదెబ్బచేత లేడివలె మృతినొందెను. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చటనుండి పరిగెత్తి యింటికిపోయి క్బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినొందెను. అంత కరాళముఖులును, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును, భయంకరులును, నగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆవైశ్యుని యమపాశములచేత బంధించి యమలోకమునకు గొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమను నరకమందు యమాజ్ఞచొప్పున బాధించుచుండిరి. రౌరవము రురువనగా మృగవిశేషము. దాని సంబంధమైనది రౌరవము. అనగా రురు మృగములచేత వాటి కొమ్ములతో బాధింపించెడి నరము రౌరవనరకమనబడును. ఆవైశ్యుని పుత్రుడు ధర్మవీరుడనువాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనముచేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను జేయింుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్నిజాతుల వారికి ఆకలిగలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను జేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆధర్మవీరుడు హరిని బూజించుసమయమున నారద మహాముని సమస్తలోకములందు తిరుగుచు ఆనాడు యమలోకమునుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వనిచేయుచు రోమాంచితుడై "గోవింద, నారాయణ, కృష్ణ, విష్ణో, అనంత. వైకుంఠ, శ్రీనివాస, శ్రీ వత్స భూష విశ్వంభర, సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే" ఇట్లని కీర్తనము చేయుచు వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరు జూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రములవెంట ఆనంద భాష్పములను వదలుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించెను. నారదుు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను.
తరువాత ఆవైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలినిబట్టినవాడై అర్ఘ్యాదులచేత పూజించి హేనారదా మీరు మాగృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు యేమిపుణ్యు చేసితినో మీరు దర్శనమిచ్చినారు. కాబట్టి నా పూర్వ పుణ్యమిప్పుడు ఫలించినది. మునీంద్ా! మీకు దాసుడను ఏమిసేవచేయవలెనో చెప్పుము చేసెదను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖముగలవాడై ధర్మవీరునితో నిట్లనియె. నారదుడిట్లు పల్కెను. ధర్మవీరా! నామాటను జాగ్రత్తగా వినుము. కార్తీకద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గను ఆరోజున చేసిన స్నానదానాదికము అనంతఫలప్రదమగును. సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసమందు ద్వాదశినాడు ధనికుడుగాని, దరిద్రుడుగాని, యతిగాని, వానప్రస్థుడుగాని, బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడు గాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, స్త్రీగాని, సాలగ్రామదానమాచరించువారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును. ధర్మవీరా! వినుము. నీతండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలనొందుచున్నాడు. అతని పాపవిశుద్ధికొరకు కార్తీకద్వాదశినాడు శీఘ్రముగా సాలగ్రామ శిలదానమును జేయుము. నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనియె. మునీంద్రా! గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలయిన మహాదానములచేత కాని ముక్తి శిలాదానము చేత యెట్లు గలుగును? శిలాదానము వృధాగా చేయుట యెందుకు? అది భోజ్యముగాదు. భక్షణముగాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారదమహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడ మూఢుడై సాలగ్రామ దానమును జేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్థానమయ్యెను. తరువాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతినొంది మహాత్ములమాట వినని దోషముచేతను, సాలగ్రామ దానము చేయని దోషముచేతను నరకమందు బాధలనొంది తరువాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరుాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము అయిదు మారులు వృషభమై యుండి తరువాత పదిమార్లు స్త్రీగా జన్మించి గతభర్తయై వైధవ్యమును బొందియుండెను. ఇట్లు పదిజన్మలు గడచిన తరువాత పదకొండవ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యౌవనమురాగానే తండ్రి తగినవరునికిచ్చి వివాహము చేసెను. కానీ పూర్వకర్మవలన ఆవరుడపుడే మృతుడయ్యెను. దానిని, మృతినొందిన ఆఅల్లుని బందువులందరు వచ్చి చూచి అట్టి బాల్యవైధవ్యమును చాలా దుఃఖించిరి. యాచకుడు దివ్యదృష్టితో జూచినవాడై ఆచిన్నదాని బాల్యవైధవ్యమునకు కారణమును దెలిసికొని బంధువులందరికిని కుమార్తెయొక్క పూర్వపుణ్యమును, పూర్వపాపమును జెప్పెను. ఇట్లు చెప్పి కూతురుయొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీకసోమవారమందు వేదాంతవేత్తయైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆసాలగ్రామ శిలా దానమహిమ చేత కూతురభర్త తిరిగి జీవించెను. తరువాత దంపతులిద్దరు సుఖముగా చిరకాలమునుండి స్వర్గమునకు బోయి అందు బహుకాలమానందముతో యుండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యముచేత వానికి జ్ఞానోదయమయ్యెను. ప్రతి సంవత్సరమందు కార్తీకసోమవారమున సాలగ్రామశిలాదానమాచరించి ఆపుణ్యముతో మోక్షసామ్రాజ్యపదవిని పొందెను. రౌరవనరకమందున్ వాని తండ్రియు ఆసాలగ్రామ దాన మహిమ చేతముక్తుడాయెను. కాబట్టి జనకమహారాజా! కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందియములేదు. పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశ్యుపవాస ద్వాదశీ సాలగ్రామదానాదులచేత పోగొట్టుకొన గల్గుదురు. కార్తీకమాసమందు సాలగ్రామదానమువలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తములేదు. ఇందుకు సందియము లేదు.
ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వాదశోధ్యాయః

Total Pageviews