Tuesday, June 22, 2021

# పండగ పూట పాత మడుగేనా..

 పండగపూటపాతమొగుడేనా.._ 

అనే ఈ సామెత ఇచ్చే అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారా?


మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం కదా..అంటే పండగ పూట కొత్త మొగుడు కావాలి అన్న అర్థం వచ్చింది.ఇది తప్పు అని, దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను.. అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత.నిజమైన తెలుగు సంప్రదాయ సామెత....


# పండగ పూట పాత మడుగేనా..


మడుగు అంటే వస్త్రం అని అర్థం.పండుగరోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ.ఆ అర్థంతో పుట్టిందే ఈ సామెత.

పండగ పూట పాత బట్టలు కాదు, కొత్త బట్టలు కట్టుకోవాలి అని అర్ధం..


ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం జరగకుండా చూసుకుందాం.సరైన రీతిలోనే పలుకుదాం, పలికిద్దాం...

పండగ పూట పాత మడుగేనా..


సనాతనం సదా నిత్య నూతనం!

No comments:

Post a Comment

Total Pageviews