Monday, June 7, 2021

శ్రీ లలితకు చిరు పదకవిత


 https://www.youtube.com/watch?v=yWqK1e-m8EY&list=PLhFZrcu-dWgmK6PhegZka23cJuxHbtiN6&index=4 

శ్రీ లలితకు చిరు పదకవిత  

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే

కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే

ఏ పాట నే పాడను అంటూ ఎంత లలితంగా పాడావు తల్లీ 

ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు

నీ లాంటి చిట్టి తల్లి పాడుతూ వుంటే ఆ దేవుడు అసలు నిద్రేపోడు

ఇంక మేలుకొలుపులెందుకు చిట్టితల్లీ 

బ్రతుకే పాటైన పసివాడను అంటూ పాడావు 

లలితంగా పాడే సలలిత రాగ సుధా రససారం 

నీ పాట వినని బ్రతుకు బ్రతుకే కాదని నేనంటాను 

తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాలకన్నా తీపి పాపాయి కే కాదు తల్లీ 

మనసున్న మనిషికి 

చేరువై హృదయాలు దూరమైతే పాట

జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట

కలలు చెదిరినా పాటే …. కలత చెందినా పాటే

మంజుల సౌరభ సుమకుంజముల లాలిత్యం 

రంజిలు మధుకర మృదు ఝంకారం నీ పాండిత్యం 

వెయ్యేళ్ళు వర్ధిల్లు తల్లీ - సత్యసాయి విస్సా ఫౌండేషన్‌ 

https://www.youtube.com/watch?v=yWqK1e-m8EY&list=PLhFZrcu-dWgmK6PhegZka23cJuxHbtiN6&index=4

No comments:

Post a Comment

Total Pageviews