Saturday, May 29, 2021

కరోనానుంచి అందరినీ చల్లగా చూడమ్మా మా చల్లని గొల్లాలమ్మ తల్లీ!

 కరోనానుంచి అందరినీ చల్లగా చూడమ్మా మా చల్లని గొల్లాలమ్మ తల్లీ!  

పినపళ్ళ శ్రీ శ్రీ శ్రీ గొల్లాలమ్మ గ్రామ దేవత! ఈ లింక్‌ నొక్కి చూడండి. 

గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత గ్రామదేవత. ప్రతీ గ్రామదేవతకూ ఓ పేరు వుంటుంది. అలాగే మా పినపళ్ళ గ్రామదేవత పేరు శ్రీ శ్రీ శ్రీ గొల్లాలమ్మ  

తూర్పు గోదావరి జిల్లా లోని ఆలమూరు మండలంలోని ఈ గ్రామంలో పినపళ్ళ గ్రామదేవతగా కొలువున్నగొల్లాలమ్మ వారు ఇంటింటికి ఊరేగుతూ పూజలందుకుంటూ చల్లని దీవేనలందించే చల్లని తల్లి. ప్రతి ఏట ఆవిడకి జాతర సంబరాలు, తీర్థం, జరిపి నైవేద్యాలు కానుకలు మొక్కులు తీర్చుకోవడం కృతజ్ఞతా పూర్వకం మైన ఆచారం. పినపళ్ళ దేవత గోల్లాలమ్మ ఏటా జాతర మహోత్సవాలు జరుగుతాయి.

మన దేశంలో గ్రామదేవతల ఆరాధన అన్నది అనాదిగా వస్తూన్న ఆచారం, ఊరు పొలిమేరలో ఉండి దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని గ్రామప్రజలను కాపాడతారు. అందుకు గ్రామప్రజలు కృతజ్ఞతగా ఏటేటా వారికి కొలుపులు, పూజలు చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. మరి అటువంటి గ్రామ దేవతలు ఎలా ఉద్భవించారు ఇలా అనేక విషయాలు ఆసక్తి కరంగా వుంటాయి. ఒకసారి గతంలోకి తొంగి చూద్దాం! ప్రపంచంలో మనిషి జంతువు నుంచి పరిణామం చెంది మానవునిగా మారే క్రమంలో కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైంది మానవాతీత శక్తి ఉందనే నమ్మకం. ఈ అతీత శక్తినే దేవత, లేక దేవుడు అని నమ్మేవారు. ముఖ్యంగా అగ్ని, నీరు, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి శక్తులను ఇలా భావించేవారు. తమకు ప్రమోదం కలిగినా, ప్రమాదం కలిగినా కారణం ప్రకృతిలోని ఏదో ఒక శక్తే అని మనిషి నమ్మాడు. అందుకే ప్రకృతిలోనూ, ఆకాశంలోనూ కనిపించే అనేక సహజమైన శక్తులను దైవశక్తులుగా భావించి పూజించడం ప్రారంభించాడు. అలా ప్రారంభమైన ఆరాధన ఇప్పటి ఆటవిక జాతుల్లో పెద్దగా మార్పులేమీ లేకుండానే వేల ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. ఇలాగే ప్రకృతి ఆరాధన విషయంలో ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఎక్కువ ఆధారాలు కనిపిస్తాయి. ఇప్పటికీ మనవారు ప్రకృతిలోని చెట్టు, పుట్ట, కొండ, గుట్ట, నదీనదాలు, కుక్క, పాము వంటి చరాచర జీవులన్నింటినీ పూజిస్తున్నారు.

మన దేశంలో అతి పెద్ద మతంగా ఉన్న హిందూ మతం నిజానికి మతమే కాదు. అది ప్రకృతిలోని ఒక ప్రాంతం పేరు (సింధ్ అనే ప్రాంతం) కాల క్రమంగా హింద్ గా మారటం వల్ల ప్రచారంలోకి వచ్చిన పేరు. హిందూ మతంగా చెప్పుకుంటున్న జీవన విధానంలో ఉన్నదంతా ప్రకృతి శక్తుల ఆరాధనే. ప్రకృతే సృష్టికి మూలంగా భావించి ఒక శక్తిగా కొలవడం మొదట ప్రారంభం అయింది. భూమిపై పెరిగే మొక్కలే మిగిలిన జీవరాసులందరికీ జీవనాధారం కాబట్టి భూమిని భూమాత అన్నారు. సూర్యుడు లేకపోతే జీవ ప్రపంచం మనుగడ కష్టమని అర్థమయిన తరువాత సూర్యభగవానుడన్నారు. బతకడానికి గాలి, నీరు అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వాటిని వాయు దేవుడు, వరుణ దేవుడు (వర్షాన్నిచ్చే దేవుడు) అన్నారు. సకల నదులు, ఏరులు గంగాదేవిగా పూజలందుకోవడం ప్రారంభమయింది. ఇక అమ్మవార్ల విషయానికి వస్తే ప్రపంచంలో ఎందరో అమ్మదేవతలు ఉన్నారు. వారిలో మన దేశానికి వచ్చేటప్పటికి అదితి, లజ్జాగౌరి, రేణుక అనేవారు ముఖ్యులు.

చిన్నతనం నుంచి చుట్టుపక్కల గ్రామాలయిన చింతలూరు నూకాలమ్మవారి, పెదపళ్ల, సంధిపూడి గ్రామాల్లో కొలువైన అమ్మవారి జాతరలు తీర్థాలు, మా స్వగ్రామం పినపళ్ళలో కొలువున్నగొల్లాలమ్మ వారి జాతర సంబరాలలో భాగంగా చిన్న జాగారం, పెద్దజాగరం, తీర్థం, ఇలా నెల రోజులనుండి    ఇంటింటికి ఊరేగుతూ పూజలందుకుంటూ చల్లిని దీవేనలందించే చల్లని చక్కని తల్లి. ప్రతి ఏట ఆవిడకి జాతర సంబరాలు, తీర్ధం, జరిపి నైవేద్యాలు కానుకలు మొక్కులు తీర్చుకోవడం కృతజ్ఞతా పూర్వక మైన ఆచారం. ఈ లింక్‌ నొక్కి చూడండి https://www.youtube.com/watch?v=nB3jiz8nr_I&list=PLkR7dgb_wqAAOy-Vi1w88r6CMErP-yTM-&index=25

No comments:

Post a Comment

Total Pageviews