స్వచ్ఛ భారత్ అభియాన్ వెబ్ సైట్ ద్వారా విస్సా ఫౌండేషన్ కు చేంజ్ మేకర్ బేడ్జ్ స్థాయి ఓ గర్వ కారణం 1 వ స్థాయి 480 పాయింట్సు నుంచి 16 స్థాయిలు దాటి 1 లక్ష పాయింట్సుకి చేరువై ఇప్పుడు 3 లక్షల 1970 పాయింట్సు చేరిన ప్రస్థానం . ఇది నిజంగా మా చిన్నారుల విజయం. మా విస్సా ఫౌండేషన్! బాలమిత్ర, చందమామలకు వారి తల్లితండ్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఈ విజయం మా చిన్నారులందరిదీ మరీ ముఖ్యంగా వారిని ఉత్సాహంగా పంపుతున్న వారి తల్లితండ్రులదీ అని సవినయంగా మనవి చేస్తున్నాను. స్వచ్చ భారత్ కార్యక్రమాలు 2014 సంవత్సరం నుంచి మా విస్సా ఫౌండేషన్ అధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఆదివారం పిల్లలకు వివిధ తరగతులు, కార్యశాలలు నిర్వహించి వివిధ అంశాల పట్ల అవగాహన కలిగేలా ఉదా: మొక్కలు నాటడం, నీళ్ళు పోయడం, కలుపు తీయడం వంటి సంరక్షణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాల పునర్వినియోగం వంటి కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలను ఇటీవల స్వచ్ఛ భారత్ అభియాన్ వెబ్ సైట్ లో ఉంచడం జరిగింది. ఆ విజయ ప్రస్థానం అనంతంగా కొనసాగుగాక!
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
Friday, December 24, 2021
స్వచ్ఛ భారత్ అభియాన్ వెబ్ సైట్ ద్వారా విస్సా ఫౌండేషన్ కు చేంజ్ మేకర్ బేడ్జ్ స్థాయి ఓ గర్వ కారణం!
Thursday, December 23, 2021
వ్యక్తిత్వంలో వజ్రం - మన జాతికి దొరికిన #రత్నం రతన_టాటా. ''
Saturday, December 11, 2021
64లక్షల #జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక #పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా #దేహం పెరుగుతుంది. దేహం మీద #మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనె అంటాం. కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకొ..
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.
రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఒ అద్భుత వరం.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్....👏👏
Sunday, December 5, 2021
దొరకునా ఇటువంటి సేవ! స్వామియే శరణం అయ్యప్ప!!
దొరకునా ఇటువంటి సేవ! స్వామియే శరణం అయ్యప్ప!!
శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతిచోటా పడిపూజలు నిర్వహించి అహారపదార్ధాల ప్రసాదం అందించడం సాధారణం
అలా కాక కొత్తగా అలొచించి శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్త యాత్రీకులకు మార్గ మధ్యంలో భోజన సదుపాయం కల్పించాలన్న నా సంకల్పానికి మిత్రులు రిటైర్డ్ జడ్జ్ శ్రీ మాల్యాద్రి గారు స్పందించి వారి విశ్వవ్యాప్త సేవా సంఘం నెట్వర్క్ ద్వారా నెల్లూరు రైల్ స్టేషన్ లలో 04.12.2021 తేదీన మధ్యాహ్నం 1 గంటకు 60 మంది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు నెల్లూరు శ్రీ గొనుగుంట సుధాకర్ రావు గారు శ్రీ సత్యనారాయణ గారి సహాయంతో మరియు 05.12.2021 తేదీన ఒంగొలు రైల్ స్టేషన్ లలో 6 మంది భక్తులకు శ్రీ నేరెళ్ళ శ్రీనివాస్ గారి ద్వారా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు. చేసింది చెప్పకూడదు అంటారు కానీ కొత్తగా అలోచించి ఇలా, కాశీ, తిరుపతి మొదలైన వివిధ తీర్ధయాత్రలు చేసే భక్త యాత్రీకులకు మనం ఇలా కల్పిస్తే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. కావున నా విన్నపం ఏమనగా? వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ దగ్గరలో వున్న సేవా భావం కలిగిన ఔత్సాహిక మిత్రులు వారి ఫోన్ నంబర్ల వివరాలు నా మెసేజ్ బాక్స్‌లొ ఇవ్వ మని మనవి. భవిష్యత్ కార్యాచరణకు వారి సహాయ, సహకారాలు అవసరం అయినప్పుడు వినియోగించ వచ్చు.

నేనేమీ చెయ్యలేదు చేసినదంతయు ఆ సర్వేశ్వరుడే అని
మా పెద్ద తాతగారు కీ.శే. బ్రహ్మశ్రీ విస్సా వేంకట రావు గారు రాసిన ఈ పద్యం నాకు ఎప్పుడూ గుర్తు వస్తుంది.
చేసితి దానధర్మములు చేసితి నెన్నియొ తీర్థయాత్రలన్
చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్
చేసితి నన్ని చేతినొక చిల్లియు గవ్వయు లేకపోయినన్
చేసితినంటి గాని యవి చేసినదంతయు నీవెగా ప్రభూ!
అంతా మనం చేసాం అనుకుంటాము కానీ చేసేదంతా ఆ జగన్నాటక సూత్రధారి. మనమంతా పాత్రధారులమే, అందుకే ఏ పుణ్యకార్యం అయినా చివరలో శ్రీ కృష్ణార్పణం అనిపిస్తారు. కర్తా కారయితా చైవ ప్రేరక శ్చానుమోదకః సుకృతం దుష్కృతం చైవ చత్వారస్సమ భాగినః వారందరికీ కృతజ్నతాపూర్వక వందనాలు.
భవదీయుడు
సత్యసాయి విస్సా ఫౌండేషన్!
Wednesday, December 1, 2021
తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేకతలు
తూర్పు గోదావరి జిల్లా లోని కొన్ని ఆలయాలు: