Sunday, April 5, 2015

తులసి మొక్క

తులసి మొక్క గాలి తగిలినచాలు 
అంటువ్యాధులు, క్రిములన్నీ అణగిపోవు
సర్వవ్యాధి నివారణాశక్తి  ఉన్న తులసి 
ఇంటింటా శుభములు కలుగజేయు.


Friday, April 3, 2015

చంద్రగ్రహణం.





ఈరోజు  స్వస్తి శ్రీ మన్మథ నామ సంవత్సరం -- చైత్ర మాసము...వసంత ఋతువు...పౌర్ణమి... శనివారం రాహుగ్రస్త చంద్రగ్రహణం.
స్పర్శకాలం 3.45 నిముషాలకు ... గ్రహణం ముగింపుసమయం..సాయంత్రం 7.15 నిముషాలకు. గ్రహణం పౌర్ణమి తిధి లో ప్రారంభమై పాడ్యమి తిధిలో పూర్తి అవుతుంది.హస్త, రోహిణి, ఉత్తర,చిత్త, శ్రవణం నక్షత్రాలలో జన్మించినవారు మరియు శనివారం జన్మించినవారు గ్రహణాన్ని చూడరాదు మరియు పరిహారములు చేసుకోవలెను.
చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా! అలా తిరిగే క్రమంలో భూమి, సూర్య చంద్రుల మధ్యలోకి వస్తుంది. అలా చంద్రునిపై భూమి నీడ పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే, సూర్యుడు, చంద్రుడు, భూమి సరళరేఖలా ఏర్పడినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహణం పౌర్ణమి రోజున వస్తుంది.

చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుని కప్పివేస్తుంది. దాంతో చంద్రునిలో కొంతభాగం దట్టమైన నీడలా, నల్లగా కనిపిస్తుంది. సూర్యునికి, చంద్రునికి మధ్యలో వచ్చిన భూమి ఎడమవైపు సగభాగంలో నివసించేవారికి చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం అన్ని ప్రాంతాలవారికీ కనిపించదు. గ్రహణం కనిపించినా, కనపడకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కనుక గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

 చంద్రగ్రహణం సమయంలో పాటించాల్సిన నియమాలు...

 గ్రహణ సమయంలో దైవ ప్రార్ధన చేసుకోవాలి. 

 గురు మంత్రాన్ని స్మరించుకోవడం మంచిది.

ఆ సమయంలో యాదృచ్చికంగా సాధుసన్యాసులు ఎవరైనా తారసపడితే వారికి భక్తిగా నమస్కరించుకోవాలి.

 గ్రహణ సమయంలో ఏమీ తినకపోవడం మంచిది.

 గ్రహణం విడిచేవరకూ నిద్రించకూడదు.

గ్రహణ సమయంలో స్త్రీపురుష సమాగమం తగదు.

 ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకుని మాత్రమే గ్రహణాన్ని చూడాలి. తిన్నగా గ్రహణాన్ని చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది.

 గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎక్కడికీ వెళ్ళకూడదు. ఇంట్లో కూడా కదలకుండా పడుకోవాలి.

 గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి.

గ్రహణానంతరం నది లేదా కాలువలో స్నానం చేయగలిగితే శ్రేష్టం.

రుద్రాక్ష ధరించడానికి చంద్రగ్రహణ సమయం మంచిది.

గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకున్నట్టయితే ఆర్ధికాభివృద్ధి ఉంటుంది. అనారోగ్యాలు నశిస్తాయి. ఎలాంటి కలతలూ, కల్లోలాలూ దరిచేరవు.
సర్వేజనా సుఖినోభవంతు!!



ఈరోజు ప్రారంభించే ముందు ఒకటి గట్టిగా నమ్ము నువ్వు ఆనందంగా...సంతోషంగా ఉండబోతున్నావని!!!

ఈరోజు  ప్రారంభించే ముందు   ఒకటి గట్టిగా నమ్ము 
నువ్వు ఆనందంగా...సంతోషంగా ఉండబోతున్నావని!!!


సరస్వతీ దేవి ఏ పటంలో నైనా రాతిమీద వీణ పట్టుకునే కూర్చుని వుంటుంది.

సరస్వతీ దేవి ఏ పటంలో నైనా రాతిమీద వీణ పట్టుకునే కూర్చుని వుంటుంది. లక్ష్మిదేవిలా నిలకడలేని తామరపువ్వులో తన స్థానముండదని చెప్పటమే ప్రధాన ఉద్దేశ్యము.
సిరిసంపదలు హరించుకుపోవచ్చు నేర్చుకున్న విద్య, విజ్ఞానం ఎక్కడకీ పోలేవని ఈ భంగిమకు అర్ధం-పమార్ధం. సరస్వతీ దేవి వాహనము హంస. హంస చాలా జ్ఞానము కలది. పాలు,నీళ్ళు కలిపి దానిముందు ఉంచితే పాలనిమాత్రమే స్వీకరిస్తుంది. అలాగే విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చని మనం నేర్చుకోవచ్చు.


Thursday, April 2, 2015

Wednesday, April 1, 2015

పెద్దలమాట చద్దిమూట!!!

పెద్దలమాట చద్దిమూట!!!


" జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ "

                                         " జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ "

మొట్టమొదటి సరిగా " జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ " అన్నదెవరు ?శ్రీరామచంద్రుడు మానవ అవతారమెత్తి , పరిపూర్ణమైన మానవునిగా జీవించి, ధర్మ,అర్ధ, కామ, మొక్షాలను స్వయంగా అనుభవించిన తర్వాత తానే ఇలా చెప్పాడు - తల్లీ, జన్మించిన ప్రదేశమూ స్వర్గముకన్నా ఉత్తమమయినవి అని, లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన తర్వాత లంకలోని ఐశ్వర్యమూ, వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి, " ఆహా అయోధ్యకన్నా ఐశ్వర్యవంతమైనది....ఇక్కడే ఉండిపోవచ్చు గదా..." అని శ్రీరామునితో అంటే, ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా " జననీ, జన్మభూమిశ్చ, స్వర్గాదపి గరీయసీ " అని చెప్పాడని పెద్దలు చెపుతారు

Total Pageviews