Wednesday, February 3, 2016

స్వామీ వివేకానంద ఛలోక్తులు!
.
స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను ఎగతాళి చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవాడు. అలాంటి సంఘటనలు కొన్ని…
.
ఓ సారి ఇంగ్లండ్ లో ఉపన్యసిస్తూ ఇలా చెబుతున్నాడు “కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుంచే అద్భుతమైన నాగరికతతో విలసిల్లిన భారతదేశం లా కాకుండా ఈ ప్రాంతం ఒకప్పుడు మొత్తం అడవులతో నిండి ఉండేది”. అసలే ఆంగ్లేయులకు తమకే అన్నీ తెలుసన్న అహంకారం ఎక్కువ. ఇక ఇలా చెబుతుండగా శ్రోతల్లో ఉన్న ఇంగర...్ సోల్ అనే రచయితకు చిర్రెత్తుకొచ్చింది. అతను వెంటనే ఒక కాగితం పై “I will kill you” అని రాసి స్వామి మీదకు విసిరేశాడు. స్వామి దాన్ని తీసి బిగ్గరగా చదివి అందరికీ వినిపించి “చూశారా! ఇప్పుడే మీ అనాగకరికత్వానికి ఇంకో ఋజువు దొరికింది” అన్నాడు.
.
మరో సమావేశంలో ఎవరో భగవద్గీత పుస్తకంపై మరేవో మత గ్రంథాలు పేర్చి స్వామి దగ్గరకు వచ్చి ” చూశారా ఇదీ భగవద్గీత స్థాయి” అన్నారు. స్వామి భగవద్గీత పుస్తకాన్ని ఒక్కసారిగా పక్కకు లాగడంతో మిగతా పుస్తకాలన్నీ కిందపడిపోయాయి. అప్పుడు స్వామి “చూశారా అన్నింటికీ ఇదే ఆధారం” అన్నాడు.
.
ఇంకో సమావేశంలో వివేకానంద మాట్లాడుతుండగా ఎవరో ఒక కాగితం పై “FOOL” అని రాసి ఆయన చేతికిచ్చారు. స్వామీజీ దాన్ని చూసి నెమ్మదిగా నవ్వుకుని అందరితో “మామూలుగా మనం ఏదైనా లేఖ రాసి చివర్న సంతకం పెట్టడం మరిచిపోతుంటాం. కానీ ఇక్కడ చూడండి. సంతకం పెట్టి లేఖ రాయడం మరిచిపోయాడు పాపం” అన్నాడు. 

పెద్దలమాట చద్దిమూట!!!


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి.../\...


Monday, February 1, 2016

కాల గణనానికి సంబంధించి శక సంవత్సరం అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. అటు చరిత్ర, ఇటు పురాణ ప్రశస్తి అన్నీ కలిసి అల్లుకొన్న ఓ చక్కటి సత్యబద్ధ కథగా శాలివాహన శకానికి సంబంధించిన ఈ కథ బహుళ ప్రచారంలో ఉంది. శాలివాహన శకం, విక్రమార్క శకం అనేవి ఎప్పటి నుంచి వచ్చాయన్నది ఇక్కడ వివరంగా కనిపిస్తుంది. దీంతో పాటు మన జాతిలో దైవాంశ సంభూతులుగా ఉన్న మహానీయుల శక్తియుక్తులు ఎంత గొప్పవో కూడా ఈ కథ ద్వారానే అవగతమవుతూ ఉంటుంది.
భారతావనిలో వింధ్య పర్వతాలకు ఓ ప్రముఖ స్థానముంది. ఈ పర్వతాలకు ఉత్తరాన ఉన్నదంతా ఉత్తర భారతమని, దక్షిణాన ఉన్న దంతా దక్షిణ భారతమని అంటూ ఉంటారు. అలాగే వింధ్యకు దక్షిణాన శాలివాహన శకం అని, ఉత్తరాన విక్రమార్క శకమని కాలాన్ని లెక్కలోకి తీసుకోవడం ఉంది.
దీనికి సంబంధించిన కథను పరిశీలిస్తే... పూర్వం పురంధర పురంలో ఓ వర్తకుడు ఉండేవాడు. ఆ రోజుల్లో విక్రమార్కుడు రాజ్యపాలన చేస్తుండే వాడు. ఆ వర్తకుడు బాగానే ధనాన్ని సంపాదించాడు. తనకు కాలం సమీపించిందని తెలుసుకొన్న ఆ వ్యాపారి నాలుగు పాత్రలను సేకరించి వాటిలో ఏవేవో ఉంచి గట్టి మూతలు బిగించాడు. తన నలుగురు కుమారులను పిలిచి తాను చనిపోయిన తర్వాత మాత్రమే ఎవరెవరు ఏఏ పాత్రలను తీసుకోవాలో చెప్పి మరణించాడు. ఈ తర్వాత ఆ వర్తకుడి కుమారులు నలుగురూ తమ కిచ్చిన పాత్రల మూతలను తీశారు. వాటిలో వరుసగా ఒక దానిలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు ఉన్నాయి. నలుగురు కుమారులకు తమ తండ్రి ఆంతర్యమేమిటో, తమ ఆస్తిని ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు. చాలా మందిని దాని గురించి అడిగారు. ఆ పాత్రలలో ఉన్న దాన్ని బట్టి ఆస్తిని పంచుకోవాలన్నది తమ తండ్రి కోరికని, మట్టి, బొగ్గులు, ఎముకలు, తవుడు పాత్రలలో ఉన్నాయని, ఈ చిక్కు ముడేమిటో తమకు అర్థం కావటం లేదని వర్తకుడి కుమారులు  ఎంతమంది దగ్గరకు వెళ్ళినా తగిన సమాధానమే దొరకలేదు. చివరకు ప్రతిష్టాన పురంలో ఉంటున్న నాటి రాజు విక్రమార్కుడి దగ్గరకు కూడా వెళ్ళినా సమస్యకు సమాధానం దొరకలేదు. విక్రమార్కుడి రాజ్యంలోని మేధావులంతా దాన్ని గురించే ఆలోచిస్తున్నారు. అదే రోజుల్లో నాగరాజు తక్షకుడి అంశతో జన్మించిన ఓ బాలుడు ఉండేవాడు. అతను పుట్టక ముందే అతడి తల్లి విధవరాలైంది. ఆమెకు ఒక కుమ్మరి ఆశ్రయమిచ్చాడు. ఆ ఇంట్లోనే ఆ బాలుడు జన్మించాడు. అతడే శాలివాహనుడు అనే పేరున పెరిగి పెద్దవాడయ్యాడు. వర్తకుల కుమారుల సమస్య శాలివాహనుడి దాకా వచ్చింది. అతడు వెంటనే దీనికోసం ఇంతగా ఆలోచించాలా? మట్టితో నిండిన పాత్ర భూమికి సంకేతం. ఆ పాత్ర దక్కిన వాడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలి. బొగ్గులతో నిండిన పాత్ర దక్కిన వాడు ఆస్తిలోని కలపను తీసుకోవాలి. ఎముకలు నిండిన పాత్ర వచ్చిన వాడు ఏనుగులు, గుర్రాలు తదితర పశు సంపదను తీసుకోవాలి. తవుడు నిండిన పాత్ర వచ్చిన వాడు ధాన్యాలను పంచుకోవాలన్నదే ఆ మరణించిన వర్తకుడి ఆంతర్యమని శాలివాహనుడు విడమరిచి చెప్పాడు. ఆ చిక్కుముడి సమస్యను అంత తేలికగా శాలివాహనుడు తీర్చిన విషయం ఆ నోటా ఈ నోటా పడి విక్రమార్క మహారాజు దాకా వెళ్ళింది. తన రాజ్యంలో ఉన్న అంత తెలివైన వాడిని చూడాలని విక్రమార్కుడు అనుకుని శాలివాహనుడిని తన దగ్గరకు రమ్మనమని కబురు పెట్టాడు. అయితే శాలివాహనుడు అంతగా తనను చూడాలంటే విక్రమార్కుడినే తన దగ్గరకు రమ్మనమన్నాడు. ఆ మాటకు రాజుకు కోపం ముంచుకొచ్చింది. వెంటనే శాలివాహనుడిని సంహరించమని సైన్యాన్ని పంపాడు. ఆ విషయం తెలిసిన శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు, గుర్రాల బొమ్మలు లాంటివి చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్క సేనల మీదకు పంపాడు. అలాగే సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి రాజు సేనలన్నీ నిద్ర పోయేలా చేశాడు. విక్రమార్కుడికి తొలుత ఏం చేయాలో అర్థం కాక ఆ తర్వాత నాగరాజును ప్రార్థించి ఆయన అనుగ్రహంతో తనే సైనికులందరి నిద్రను పొగొట్టాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల మధ్యన భీకర యుద్ధం జరుగుతండటంతో మధ్యలో ఆకాశవాణి కల్పించుకుని యుద్ధం ఆపమని రాజీ మార్గంగా ఉత్తర దిక్కున ఉన్న భూమినంతా విక్రమార్రుడు, దక్షిణాన ఉన్న రాజ్యాన్నంతటినీ శాలివాహనుడు పాలించుకోమని చెప్పింది. అలా శాలివాహనుడు ఒక శకాన్ని స్థాపించాడు. అది ప్రారంభమైంది చైత్ర శుక్ల పాడ్యమి నాడు. చైత్ర శుక్ల పాడ్యమే ఉగాదిగా అలా అయిందని పెద్దలు చెబుతుంటారు. కాలం ఒక సంవత్సరం కొలమానంగా అమలులోకి రావటం, శక సంవత్సరం లాంటివి వ్యాప్తిలోకి రావటం అనే విషయాలను ఈ కథ ప్రస్తావించింది.

శుభోదయం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఈశ్లోకం అన్నిరకాల భాధలను తప్పించి, దుఃఖాన్ని పోగొట్టి అన్నివిధాల శాంతిని ధైర్యాన్ని కలిగిస్తుంది.


ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు.  వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?"  అని అడిగారు.  అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు.

"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన.  "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి.  వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.

"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి.  "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?"  అన్నాడొక మిత్రుడు.

"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో  ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం." అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.

"పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను." అనుకుని

ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు ఎంత నిజమో కదా"  అనుకున్నాడు చివరి క్షణాల్లో.

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్యం వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, ఇవరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని  పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత…

Total Pageviews