Monday, February 8, 2016

[  జీవితం లో కొన్ని అక్షర సత్యాలు ]

⛔ TEMPLE కు
 6 అక్షరాలు MASJID మరియు CHURCH కు
కూడా 6 అక్షరాలు.

⛔ GEETA కు 5 అక్షరాలు   QURANమరియు BIBLE కు కూడా 5అక్షరాలు.

⛔ LIFE మరియు DEAD కు 4అక్షరాలు.

⛔ HATE మరియు
 LOVE కు 4అక్షరాలు.


⛔NEGATIVE మరియు POSITIVE కు 8 అక్షరాలు.

⛔FAILURE మరియు SUCCESS కు 7అక్షరాలు.

⛔ BELOW మరియు  ABOVE కు 5అక్షరాలు.

⛔ CRY మరియు  JOY కు 3 అక్షరాలు.

⛔ ANGER మరియు HAPPY కు 5 అక్షరాలు.

⛔ RIGHT మరియు WRONG కు 5 అక్షరాలు.

⛔ RICH మరియు POOR కు 4 అక్షరాలు.

⛔. FAIL మరియు Pass కు 4 అక్షరాలు.

పైవన్ని  ఒకదానికొకటి వ్యతిరేక పదాలు. అయినప్పటికి అక్షరాల లో మాత్రం సమానమే అనే భావన కల్గజేశాయి కదా.
అలాగే మనం కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి వేరైనా మనుషులు గా మరియు భారతీయులుగా మనమంతా ఒకటే అని చాటి చెబుదాం
💪జై భారత్ 💪💪జై హింద్💪

మనిషి గొప్పదనం.


మాఘ మాస విశిష్టత.
"మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు
"దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!"
అని చేసిన తరువాత
"సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!"
అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి.
ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు.కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. "మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి అంటారు.ఈ పంచమి నాడే "సరస్వతీదేవి" జన్మించిందట. ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.
అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ:సూర్య: అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే.ఈ విధంగా మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే.
                                                               "జగ్గన్నతోట" ప్రభల తీర్థం 


కోనసిమ అంటేనే అందం.అది వేదసీమా అని పెద్దల ఉవాచ.శ్రీశైల పర్వతసానువుల తరువాత తొందరగా

 మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవ క్షేత్రాలు.అటువంటి కోనసీమలో పుట్టడం నిజంగా  అదృష్టం.


కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న "జగ్గన్నతోట" ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని 


చెప్పరానిది.మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్య కాలం లో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని 

"మొసలిపల్లి శివారు జగ్గన్నతోట" లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత 

ప్రాచీనమైన,చారిత్రాత్మకమైన,అతిపురాతనమైన,పవిత్రమైన సమాగమము.ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా ఈ 

తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి.ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం 

గానీ వుండవు.ఇది పూర్తిగా కొబ్బరి తోట.ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడం 

తో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇది ఏకాదశ రుద్రుల కొలువు.హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం 

మొత్తం మీదా,ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే.

లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి.సుమారు 

400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 

గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి.అప్పటి నుండీ క్రమం తప్పకుండా 

ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట 

చేర్చుతారు ఈ గ్రామస్తులు.సంస్థానదీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు కు చెందిన ఈ తోట జగ్గన్న 

తోట అనే పేరుతో స్థిరపడింది.

ఈ ఏకాదశ రుద్రులు కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుసగా

1-వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ)

2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి)


3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి


4-గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు


5-గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు


6-పెదపూడి-మేనకేశ్వరుడు

7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు


8-వక్కలంక-విశ్వేశ్వరుడు


9-నేదునూరు--చెన్న మల్లేశ్వరుడు


10-ముక్కామల-రాఘవేశ్వరుడు


11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు.


ఇవీ గ్రామాలు ఆ గ్రామాల రుద్రుల నామాలు.ఈ స్వామి వారలను "ప్రభలపై" అలంకరించి మేళ తాళాలతో,మంగళ 


వాయిద్యాలతో,భాజా బజంత్రీలతో "శరభా శరభా" హర హర మహాదేవ" అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని 

మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు. ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లి 

కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల 

కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ 

రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు

"శ్రీ వ్యాఘ్రేశ్వరుడు".ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా 

పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.

ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి 

రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" 

అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో 

మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి 

తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ 

ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ 

పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ 

రుద్రుల(11)దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.

నమస్తే అస్తు భగవన్


విశ్వేశ్వరాయ


మహాదేవాయ


త్ర్యంబకాయ 


త్రిపురాంతకాయ


త్రికాగ్నికాలాయ


కాలాగ్నిరుద్రాయ


నీలకంఠాయ


మృత్యుంజయాయ


సర్వేశ్వ’రాయ


సదాశివాయ


శ్రీమన్-మహాదేవాయ నమః’ అంటూ రుద్రం లో ఏకాదశ రుద్రుల గురించి ప్రస్తావన ఉంటుంది.


ఆ ఏకాదశ రుద్రులు ఏకకాలం లో సమాగం అయ్యే సన్నివేశం చూస్తే మనసు పులకిస్తుంది
ఈ తీర్థము ను దర్శించడానికి ప్రపంచవ్యాప్తం గా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక,దేశ విదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.


           ఈ సారి మీరూ దర్శించి తరించవలిసినది ప్రార్ధన.



Sunday, February 7, 2016

సిద్దార్ధ  ట్రైన్ లో  వస్తూ ఉంటే ఒక పాత నలిగిపోయిన పర్సు
కనిపించింది . దానిని పైకి తీశాడు . అందులో
కొద్దిపాటి చిల్లర నోట్లు , ఒక కృష్ణుడి ఫోటో తప్ప
ఏమీ లేవు . ఎవరిదో తెలిపే ఆనమాళ్ళు ఏమీ లేవు .
ఎలా తిరిగి ఇవ్వడం ?
.
" ఈ పర్స్ ఎవరిదండీ ? " అంటూ అడిగారు
.
అందరూ పర్స్ కేసీ చూశారు . తమ జేబులు
తడుముకున్నారు . ఒక  పక్క
కూర్చున్న ఒక వృద్ధుడు నెమ్మదిగా వచ్చి అది
తన పర్స్ అని చెప్పాడు .
.
" మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ?
ఆనమాలు ఏమిటీ ? "
.
" అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ "
అన్నాడాయన
.
" అదే ఆనమాలు చెబితే ఎలాగండీ ? ఇంకా ఏదైనా
చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా ! "
.
అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన సమాధానం మన
అందరికీ ఒక పాఠమే !
.
.
" బాబూ ! అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన
పర్సు . అప్పుడు నాకు మా అమ్మా నాన్న అంటే
చాలా ఇష్టం . అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో
పెట్టుకున్నాను . కాలం గడిచే కొద్దీ నేను చాలా
అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది
. అందుకని నేను అప్పుడు నా పర్సు లో నా ఫోటో
పెట్టుకున్నాను . "
.
నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది . నా భార్య
చాలా అందగత్తె . నాకు ఆమె అంటే చాలా ప్రేమ
అపుడు ఆమె ఫోటో నా పర్సులో పెట్టుకునే వాడిని .
.
ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు
పుట్టాడు . వాడంటే నాకు చాలా ఇష్టం . వాడి కోసం
ఆఫీసు వదల గానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం
అన్నట్టుగా గడిపేవాడిని . వాడిని భుజాల మీద మోస్తూ
రోజంతా గడిపేవాడిని . వాడిని నా పక్కనే
పడుకోబెట్టుకునే వాడిని . వాడే నా లోకం . అపుడు
నా పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని . వాడు
ఇపుడు అమెరికాలో ఉన్నాడు . నా భార్య మూడు
సంవత్సరాల క్రితం చనిపోయింది . ఇపుడు
నన్ను నేను చూసుకోడానికి భయం వేస్తోంది .
అందుకని నాకు తోడు గా కృష్ణుడిని
పెట్టుకున్నాను . ఆయనే నాకు ఇపుడు తోడు .
నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు . నా విచారానికి
ఓదారుస్తాడు . నాతో ఎప్పుడూ ఉండే ఆయనను
ఎప్పుడో నా పర్సులో పెట్టుకోవలసిన ఆయనను
నేను చాలా ఆలస్యంగా గుర్తించాను . ఇపుడు
నేను ఆయనతో గడుపుతున్నాను . "
.
.
సిద్దార్ధ మాట్లాడకుండా పర్సు ఆయనకు
ఇచ్చేశాడు .
.
.
పక్క స్టేషన్ లో రైలు ఆగింది . సిద్ధార్ధ రైలు దిగి
బుక్ స్టాల్ కి వెళ్ళాడు .
.
" దేవుడి ఫోటోలు ఏమి ఉన్నాయి పర్సు లో
పెట్టుకోడానికి " అని షాపు వాడిని అడిగాడు.

../I\..

"వంకాయ కూర" మూలాలు..
!!ఈ వంటకం హరప్పన్ కాలం నాటిదట!!
------------------------------------------
వంకాయ వంటి కూరయు... పంకజముఖి సీత వంటి భామామణియున్... శంకరుని వంటి దైవము... లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే’’ వంకాయ వంటి కూర, పద్మం వంటి ముఖం కలిగిన సీత వంటి స్త్రీ, శివుడి లాంటి దేవుడు, లంకాధిపతి రావణుడికి శత్రువైన రాముడి వంటి రాజు లేరన్నది ఈ చాటువు అర్థం. ఇంతకీ ఈ కూర మొట్టమొదట ఎవరు చేశారంటారు? అమ్మమ్మలు, నానమ్మలు వండిపెడితే సుష్టుగా లొట్టలేసుకు తిన్నాం గానీ... ఈ సందేహం మాత్రం ఎప్పుడూ రాలేదు కదా? అరుణిమా కశ్యప్... స్టీవ్ వెబర్, సోయితీ బెనర్జీలకు వచ్చింది. వాళ్ల శోధన... పాకశాస్త్ర ప్రయోగాల పుణ్యమా అని ఇప్పుడు వంకాయ కూర మూలాలు తెలిశాయి.
ఆశ్చర్యంగా అనిపించినా... ఈ వంటకం హరప్పన్ కాలం నాటిదట! హరప్పన్లు వంకాయ కూర తినేవారా? మీకెలా తెలుసు? వాళ్లేమైనా ‘కుక్ బుక్’ రాసిపెట్టారా? పోనీ వేదాల్లో ఈ వంటకం ప్రస్తావనేమైనా ఉందా? ఇవేనా మీ బుర్రల్లో మెదులుతున్న ప్రశ్నలు. హరప్పన్లు వంటల పుస్తకాలు రాయలేదుగానీ... వంట వండుకున్న పాత్రలు వదిలారుగా? అవిచాలు... అప్పుడెప్పుడో వాళ్లు ఏం వండుకున్నారో తెలుసుకునేందుకు అంటున్నారు అరుణిమా కశ్యప్, స్టీవ్ వెబర్‌లు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఈ ఇద్దరు పరిశోధకులు కొన్నేళ్ల క్రితం ఈ ప్రయోగాలు చేపట్టారు.
హరప్ప మట్టిపాత్రల అడుగుభాగాలను మైక్రోస్కోపుల సాయంతో నిశితంగా పరిశీలించినప్పుడు... అక్కడి రసాయన అవశేషాలను విశ్లేషించినప్పుడు ఆ కాలంలో వాడిన మసాలాలు, దినుసుల గురించి తెలిసిందట. హరప్ప నాగరికత తవ్వకాలు జరుగుతున్న ఫర్మానా (ప్రస్తుత హర్యానా) ప్రాంతానికి చెందిన సంప్రదాయ వంటకాలను పరిశీలించి, పరిశోధన వ్యాసాలను క్షుణ్ణంగా పరిశోధించిన తరువాత వీరిద్దరూ ఆనాటి వంటకం వంకాయదని తేల్చారు.
మరి సొయితీ బెనర్జీ ఏం చేశారు? అరుణిమ, స్టీవ్‌ల మాదిరిగానే ఢిల్లీకి చెందిన ఈ రచయిత్రి కూడా ఆ కాలం నాటి వంటకాన్ని మళ్లీ వండే ప్రయత్నం చేశారు. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా. అరుణిమా, స్టీవ్‌లు పింగాణీ పాత్రలో వండితే... సోయితీ దేశీ స్టైయిల్లో మట్టి కుండలు, కట్టెలపొయ్యి వాడి వంకాయ కూర వండారు. చిత్రమైన విషయమేమిటంటే... హర్యానా ప్రాంతంలో ఇప్పుడు వంకాయ కూర చాలా అరుదుగా మాత్రమే వండుతారట. హరప్పన్ వంకాయ కూర మీ ఇంట్లో వండాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం వండేయండి.
ఇదిగో రెసిపీ..!
కావాల్సిన పదార్థాలు.. లేత వంకాయలు 15, అల్లం... 2 అంగుళాల సైజు, పసుపు కొమ్ము ఒకటి (లేదంటే పావు టేబుల్‌స్పూన్ పసుపు పొడి), జీలకర్ర... అర టేబుల్ స్పూన్, మామిడికాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, చక్కెర రసం పొడి (చెరకు రసాన్ని ఆరబెట్టాక మిగిలే పొడి) లేదా చక్కెర, పబ్రి (హర్యానా ప్రాంతంలో లభిస్తుంది. మనం దీన్ని కొత్తిమీరతో సరిపెట్టుకోవచ్చు), రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, రుచికి తగినంత ఉప్పు.
వండే విధానం...: లేత వంకాయలను తొడిమల వరకూ నిలువుగా చీల్చి.. వాటిని ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టుకోవాలి. అల్లం + పసుపు కొమ్ము + జీలకర్రలను మరీ మెత్తగా కాకుండా రుబ్బిపెట్టుకోవాలి. ఈ మసాలాను మట్టికుండలో నువ్వుల నూనె వేసి అది వేడెక్కిన తరువాత కలుపుకోవాలి. రెండు నిమిషాల తరువాత వంకాయలు వేయాలి. దాదాపు పది నిమిషాలపాటు వేగనిచ్చి... పచ్చిమామిడికాయల ముక్కలు కలుపుకోవాలి. ఒక కప్పు నీళ్లు, చక్కెర రసం పొడి, ఉప్పు కలిపి వంకాయలు మెత్తబడే వరకూ ఉడకనివ్వాలి. చివరల్లో పబ్రి (మనమైతే కొత్తిమీర) వేసేస్తే హరప్పన్ వంకాయ కూర రెడీ. వేడివేడి సజ్జరొట్టెలతో ఈ కూర మరింత రుచికరంగా ఉంటుందట!..సాక్షితెలుగు...
'' అమ్మకు ప్రాణాభివందనం''
------------------------------
అమ్మ స్పర్శలో.. బ్రహ్మ..
బ్రహ్మ సృష్టిలో.. అమ్మ..
నవమాసాలు భారాన్ని భరిస్తూ -
పునర్జన్మకి వాకిళ్ళు తెరుస్తూ..
గాయపడి - బాధపడి
పచ్చిపయితో తన ప్రతిరూపాన్ని(ఓ పసిపాపను)
ప్రపంచానికి పరిచయం చేసిన..
అమ్మకు ప్రాణాభివందనం
అమ్మ ఒడిలో - తొలి బడిలో
చనుపాలతో పెంచి - మురిపాలనే పంచి..
పసిపాపల ప్రపంచ భాషలో....
పలకించి - పులకించి,
ఉగ్గుపోసి ఊసునేర్పిన..
నడకతో నడతను నేర్పిన..
అమ్మకు ప్రాణాభివందనం..
అమ్మ హృదయం - నా నివాస స్థలంలో
మొలకేసిన మానవత్వం - నా మానసిక సాహిత్యం....
మనసుతో మనిషిలా - ప్రజాహిత పౌరుడిలా
అక్షరాల్లో తలకట్టులా - ఆహార్యానికి పంచకట్టి
తెలుగుజాతి వారసులుగా ....
భారతీయత/జాతీయత నేర్పిన..
తెలుగమ్మకు ప్రాణాభివందనం..
అమ్మ పేరులో - అమ్మ ఊరులో..
గుండె పిలుపులో - తెలుగు పలుకులో
వేదాలలో శ్లోకాల్లా - త్యాగాల బాటలో
సమైక్యతా పథంలో - మమైక్యతా రథంలో
వందేమాతరం వారసులుగా....
దేశభక్తితో తీర్చిదిద్దిన ..
భారతమ్మకు ప్రాణాభివందనం..

Total Pageviews