Saturday, June 11, 2016

Kshetra School: అబ్రహం లింకన్ వ్రాసిన లేఖ

Kshetra School: అబ్రహం లింకన్ వ్రాసిన లేఖ: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన కుమారుడిని స్కూల్‌లో చేరుస్తున్నప్పుడు రాసిన ఉత్తరం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. తన కుమారుడు స్కూ...

Thursday, June 9, 2016

ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.
తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన ఎడ్లబండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.
అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి
బండి లో కూర్చో బెట్టి   బయల్దేరాడు . త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో  .

పోరుగూరినుంచి  వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.
 దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ
మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?అన్నాడు నవ్వుతూ
 షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండి
అనే అర్థము వస్తుంది
 కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది.(బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?)
ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి.
 (అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు.
యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు..
 ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు.

ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.

ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.
శిష్యుడు అతడి భార్య
ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.
అప్పుడు గురువు
ఒక శార్దూల వృత్తము(పద్యము) లోమధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు శిష్యుడు నవ్వుతూ
 గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి
వెళ్ళుట మీకు న్యాయమేనా?
అన్నాడు.
 గురువు గారు నవ్వుతూ ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే
నీకు యేమీ అపకారము చెయ్యదు.
పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు.
పంచమీ తత్పురుషము
లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..అన్నారు.

పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము'
షష్టీ తత్పురుషము నకు
ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా'
ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు.

ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు.
గురువుగారిని బండీలో ఎక్కించి మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి అన్నాడు శిష్యుడు.
 అందుకు గురువు గారు నవ్వుతూ
నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.
ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ
'భార్యా భర్తలు' 'తల్లిదండ్రులు'యిస్తారు మామూలుగా.
ద్వంద్వా తీతుడంటే మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.


పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.


క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం॥
జలజాక్షి మోమునకు జక్కువ కుచంబులకు
నెలకొన్నకప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువమాణిక్యముల నీరాజనం॥
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం॥
పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం॥





మంచిమాట



శుభోదయం../\..
దేవుడు ఎక్కడో లేడు నిన్ను కన్న అమ్మ రూపం లోనే అనుక్షణం నిన్ను కాపాడుకుంటూ వుంటాడు.దేవుళ్ళు తాగిన అమృతం కంటే గొప్పది అమ్మ ప్రేమ. ప్రపంచం కూడా చిన్నబోతుంది అమ్మ ప్రేమ ముందు.అలాంటి అమ్మను మనం ఎన్ని జన్మలెత్తినా ఋణం తీర్చుకోలేము. మరో జన్మ వుందో లేదో తెలీదు, కనీసం ఈజన్మలోనైన అమ్మను మనస్పూర్తిగా ప్రేమిద్దాం.... గౌరవిద్దాం. మన ముందు తరానికి ఆదర్శంగా నిలుద్దాం. ఏమంటారు మిత్రులారా ?




Thursday, June 2, 2016

జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం....తెలంగాణా ఆవిర్భావ శుభదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలుతెలంగాణా ఆవిర్భావ శుభాదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు




తెలంగాణా ఆవిర్భావ శుభదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలుగు రాష్రాలు రెండూ అభివృద్ది పదంలో పయనించి భారతావనికి ఆదర్శం కావాలని ఈ శుభవేళ ఆశిస్తూ మా ఆత్మీయ కవిమిత్రుడు  శ్రీ అందెశ్రీ గారు ఎంతో ఆర్తితో రాసిన...అదే ఆర్తితో ...తన దైన సహజ గళ మాధుర్యంతో ప్రసిద్ధ నేపధ్యగాయకుడు శ్రీ రామకృష్ణ గారు ఎంతో హృద్యంగా ఆలపించిన ఈ మహాద్భుత గీతం..."మిలేసురు మేరా తుమ్హారా" గీతం మన దేశాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో...అలా తెలంగాణా రాష్ట్ర గీతం ప్రతిబింబిస్తోంది...ఈ గీతం వింటున్నప్పుడల్లా మనసు ఒకసారి ఒక అలౌకిక ఆనందానుభూతి...కలుగుతుంది.  అమ్మని ఆర్తితో ఆలింగనం చేసుకున్న అనుభూతిని అందిస్తుంది...ఆస్వాదించండి...ఎప్పుడైనా ఈ లంకె నొక్కి ఆ పారవశ్యాన్ని...తనివి తీరా అనుభూతించండి...సత్యసాయి విస్సా ఫౌండేషన్.        
http://www.youtube.com/watch?v=VlQ81OFwPi0

జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదిజిల్లల నీపిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమరం భీముడే నీబిడ్డ
కాకతీయ కళాప్రభాల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
అనునిత్యం నీ గానం... అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణియె కద నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే
పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలె
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలే
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

Wednesday, June 1, 2016

అల్లరి చేద్దాం రండి!

అల్లరి చేద్దాం రండి! 
నేను నా బలమిత్రులు, ప్రతిరోజూ ఉదయం గం. 6.30 ని.లకు పార్క్ లో అశ్వత్థ వృక్ష (రావి చెట్టు) క్రింద ఆ రావి ఆకుల గలగలలు వింటూ కోయిల ఇతర పక్షుల కూజితాలు వింటూ చరవాణిలొ సంగీతం వింటూ యోగా, తెలుగు తరగతి, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ మరియు సాయంత్రం తెలుగు తరగతి, చిత్రలేఖనం, నృత్యాలు, శనివారం టోరీ రేడియో కార్యక్రమం, ఆదివారం ఉదయం పార్క్ లో స్వచ్చ భారత్, మొక్కలకు నీళ్ళు పెట్టడం, తెలుగు ఆటలు, పాటలు, మాటలు ఓహ్ ఒకటేమిటి అల్లరే అల్లరి, ఇదిగో ఆ చిత్రాలు చూడండి, తెలుగు మీద ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రావచ్చు మా విస్సా ఫౌండేషన్ బాలమిత్రుల్లో చేరవచ్చు. ఇదే మా ఆహ్వానం!





























 సత్య సాయి విస్సా ఫౌండేషన్.

Total Pageviews