Wednesday, September 13, 2017

ఉప్మా....ఏమిటి చెప్మా.?

ఉప్మా....ఏమిటి చెప్మా.?
-
ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు 😣😣...
ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి😎😎..
ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరితీయ్యాలి😂😂...
ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..
కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺...
వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇..
ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸...
తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..
ఇంకాస్త పెట్టమంటారా అంటే😳....
ఆ స్పూన్ తో తల మీద గట్టిగ కొట్టుకొని వెర్రి గా నవ్వాలనిపిస్తుంది💣💣💣...
ఈ దరిద్రానికి మళ్లీ రకాలు💥💥.
గోధుమ రవ్వ,,బొంబాయి రవ్వ అంటూ👂👂..బొంబాయి ముంబై అయినా..
ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చెలామణి అవుతాంది😛😛...
జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా🐇🐇...
ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయుప్మ🐓🐓..
టమాట వేస్తే టమేటా బాత్ 🍅🍅🍅....
ఉప్మా చేయి అంటే చాలు చిటికెలో చేతిలో ఉప్మా ప్లేట్ తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు🎅🎅....
శనివారం అయిందంటే చాలు ఎదో రూపం లో తగులుకుంటుంది🙇🙇..
ఈ మంతెన గారు ఊరుకోక గోధుమ రవ ఉప్మా మంచిది అని చెప్పారు💪💪..
ఇక చూడండి👈..వారోత్సవాలు...👈బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి☝....
తప్పు మీది కాదు సర్👐👐.ధైర్యం చేసి ఉదయన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రాం చూపించామ్ కదా✊✊...చేసిన పాపం ఉరికే పోదు👎👎..
ఇది తినడం ఒక ఎత్తు అయితే తిన్నాక లోపల కి వెళ్లి ఇది చేసే హంగామ అంతా ఇంతా కాదు🏃🏃🏃...
పడుకుంటే కడుపు లో షేర్ ఆటో లు తిరుగుతునట్టు ఒకటే గోల 🚆🚆🚆....
అర స్పూన్ తింటే ,,.అరిగించుకోటానికి ఆరు గంటలు పడుతుంది🎠🎠🎠...
ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే🎭🎭...మా రామ్ దేవ్ బాబా గురూ గారు మహత్తరమైన ఉపాయం చెప్పారు😜😝😜...
ఉప్మా కాశి లో వదిలేసాను అని చెప్పమన్నాడు 😛😛...
ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని చెప్పాడు 😌😌....
నేను అదే చేస్తా లాభం లేదు😫😫...
ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నారో 😊😊...
అదే లే తినాల్సివచ్చిందో చెప్పండి😆😆...
ఎదో మనిషి కి మనిషి సహాయం😜😜...మీకోసం ప్రార్థన చేస్తా..కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలని..
:)

నాన్నకి అంకితం

👉 కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది "నాన్న..."🚶

👉 నాన్నకి అంకితం 🏃
-----------------
👉అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
👉నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
👉 జీవితం అమ్మది - జీవనం నాన్నది.
-------------------
👉ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
👉ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .
👉 అమ్మ భద్రత - నాన్న బాధ్యత.
------------------
👉పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
👉పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు
👉 నడక అమ్మది - నడవడిక నాన్నది.
--------------------
👉తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
👉నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .
అమ్మ అలోచన-నాన్న ఆచరణ
----------------
👉అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.
      But... కానీ ....
👉నాన్న ప్రేమను నువ్వు నాన్నవుఅయ్యాకే తెలుసుకోగలవు...

💐🙏🌹👍
: కొడుకు :ఈ రోజు నా గుండె operation నాన్న


నాన్న :తెలుసురా ఎందుకు బయపడుతున్నావ్ నేను ఉన్నానుకదా నీకు


కొడుకు :i love u నాన్న


నాన్న :i love u too ra చెపుతూ
 ఏడ్చాడు


Operastion తరువాత ఎప్పుడైతే ఆ అబ్బాయ్ కి మెలుకువ వచ్చిందో కళ్ళ ముందు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు



కొడుకు :మా నాన్న ఎక్కడా



ఫ్రెండ్ :నీకు తెలియదా నీకు గుండె ఏవరిచ్చారో  మీ నాన్నేనురా !



కొడుకు :గుండె పగిలేల ఏడవడం మొదలుపెట్టాడు
అప్పుడు గుండె నుండి ఒక్క శబ్దం వచ్చింది  ఏడవకురా నీ గుండె చప్పుడులో నేను ఎప్పుడు నీతో బ్రతికే ఉంటానురా



కొడుకు :i miss you నాన్న


మన కాళ్ల మీద మనం
నిలబడ్డామని అమ్మ నాన్నని దూరం పెట్టకు. మనం ఇలా నిలబడడానికి అమ్మ నాన్న మన ముందుండి  నడిపించారు మర్చిపోకు మన  భారాన్ని  అంత నాన్న మోస్తూ మనల్ని నడిపించాడు మనం సంతోషగా బ్రతకడానికి తన ప్రాణాలను  దరబోసే వాడు నాన్న

పాము సాధువు కథ !


⁠⁠⁠⁠⁠పాము సాధువు కథ !
ఓ సారి వూరి వెలుపల ఓ సాధువు గారు కొలువు తీరారు.. ఆ సాధువు గారు కూర్చుని ఉన్న అల్లంత దూరాన పుట్టలో ఉన్న పాము బయటకు వచ్చి బుసలు కొట్టింది . సాదువు గారు దానికి హితబోధ చేసారు చూడు నిన్ను చూసి అందరూ ఎలా భయపడుతున్నారో.. నువ్వు కుడా నాలా సాధువులా జీవించు అని హితం చెప్పారు. సాధువు గారు చెప్పిన మాట విని పాము తన కోపాన్ని తగ్గించుకుంది . ఆహారానికి తప్ప బయటకు రావడం మానేసింది .. మనుషులు ఎవరిని చూసినా బుస కొట్టడం మానేసింది .ఇపుడు జనాలు తనను చూసి భయపడ్డం లేదు..కొందరు ఆకతాయిలు ఇది గమనించి పుట్టలోకి వెళ్లబోతున్న పాము తోకను బట్టి ఈడ్చి నేల కేసి కొట్టారు. ఎలాగో జారవిడచుకుని బ్రతుకు జీవుడా అని పుట్టలోకి జారుకుంది. ఇప్పుడు ఆహారం కోసం పుట్ట నుండి బయటకు రావాలన్నా భయం వేస్తోంది.కొన్నాళ్లకు సాధువు గారు మళ్ళీ వచ్చి అదే చోట కొలువు దీరారు. అందరూ వెళ్లాక పాము బయటకు వచ్చి తన దీన గాథను వివరించింది . అపుడు సాధువు అన్నారు.. పిచ్చిదానా .. నిన్ను నీవు రక్షించుకునేదానికి అయినా బుసకొట్టాలి లేక పోతే ఇంతే.. నిన్ను అపకారం చేయవద్దన్నాను గానీ నిన్ను నీవు రక్షించుకోవద్దు అన్నానా అని చెప్పారు.. దీనిలో నీతి ఏమిటంటే
మనం హిందువులం.. అహింసా పరమో ధర్మ: అని చెబుతాయి మన వేదాలు , శ్రుతులు,ఇతిహాసాలు. మన ధర్మం అహింస అన్నాము కదా అని కనీసం నీ మీద ఉద్ధేశ్యపూర్వక దాడులు జరుగుతున్నా మౌనం వహిస్తే అది చాతకాని తనమే అవుతుంది తప్ప అహింస అనిపించదు. ధర్మాగ్రహం తప్పని సరి.. ఎవరి పాపానికి వారు పోతారులే అనుకుంటే పాము గతే పడుతుంది.

వాస్తవంగా జరిగిన కథ

ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ....దయచేసి చదవగలరు......
" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా 
కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది.
" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు.విషయమేంటి? " అని అడిగింది 
పెద్దకోడలు.
" ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది.
కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ
చేస్తున్నాము కదా! మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని
ఎన్ని రోజులని చూడగలం.అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను>"
అంది చిన్నకోడలు.
" ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు.
" మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో
చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో
ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం
మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు.
" దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు.
" మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం>" అంది చిన్నకోడలు.
ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని 
 ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని
చూసుకోవలని వారి ఉద్దేశ్యం. కానీ రోజూ భార్యల నస భరించలేక
ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు.
" నాన్నా! ఈ పిల్లలగొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేకపోతున్నాం.
మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి
చూసుకునేది. దగ్గరిలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ
చేరుద్దామని అనుకుంటున్నాము. మీరేమంటారు? "
" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్నిరోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని 
బయలు దేరండి ఇద్దరూ!? అన్నారు తండ్రి.
షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి.
" అదేంటి నాన్నా ! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి? బయట
బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి.
ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి."
" నిజమే! మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా
కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా
ఉన్నాం. ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి.
నా తదనంతరం ఈ ఇల్లు మీకే! పైన ఇంటి బాడుగతో,నాకు వచ్చే 
pension తో ఎలాగోలా బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నారు
తండ్రి.
" అదేంటి మామగారూ! వూర్లో్ జనాలు ఏమనుకుంటారు? బయటికివెళ్ళి
అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి. ఆలోచించండి" అన్నారు కోడళ్ళు.
ఊర్లో జనాలు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే మాట్లాడుకుంటారు.
ఇది నా ఇల్లు. నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు. నేను పోయేదాకా
ఇది నా సొంతం. నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి
ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన
మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి
వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి." అంటూ
తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళిపో్యారు.
షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ......కోడళ్ళకు.....
తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా
ఆశ్రమాలకు వెళ్ళిపోతు్న్నారు. వారు ఇలా తి్రగబడితే తప్ప
గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం ఉన్న
తల్లిదండ్రులను, ఆస్తిపాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ 
శరణాలల్లో ఉంటున్నారు. వారు తప్పక తెలుసుకోవలసిన విషయం ఇది.
తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ
చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి.

Good morning


Tuesday, September 12, 2017

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం.
ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.
ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు.
కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland) (సగర పుత్రులు బూడిద కుప్పలు గా మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horseland) ( యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన #గంగోత్రి హిమానీనదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.
వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది #మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు.
అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ #అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.
ఇంకో ఆసక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు.
ఇంతకుముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.
మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత #ఆంజనేయస్వామివారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు.
రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు.
మధ్య అమెరికా, #హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు.
హిందువులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? అమెరికా అంటే పాతాళమా?
“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ:” – అనగా #సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. దేవతలకు మన మానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు. వారి ఒక దినం మన ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలయినప్పుడు పాతాళంలో అది రాత్రి. (ఇప్పుడు మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది, సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం)
రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60వేల మంది కూడా ఎలా భూమిని వెదుకుతూ వెళ్ళారో, భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిల ముని ధ్యానభంగం చెయ్యడం, ఆయన ఆగ్రహం చవి చూసి భస్మమై పోవడం, వారి భస్మాల పైన భూమి నుండి గంగను అవతరింప చేసి పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహింప చేసి వారిని తరింపచేస్తాడు భగీరధుడు.
మన భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం వున్నట్టు చెబుతారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది.
#అహిరావణుని వృత్తాన్తంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతడిని మట్టు పెట్టి రామలక్ష్మణులను విడిపించినట్టు ఐతీహ్యం. అలాగ మరెన్నో కధలు భూ-పాతాళ రాకపోకల గురించి వున్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, #oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.
ఒకానొకప్పుడు అంటే ఒక 400 సంవత్సరాల క్రితం వరకు అక్కడ వున్న తెగను దునుమాడి, వారిని హతమార్చి, అక్కడ శిధిలాల నిర్మితమైన నవ శకం నేడు మనం చూస్తున్న శక్తివంతమైన దేశం అమెరికా. ఇత:పూర్వం నివశించేవారిని నేటివ్ ఇండియన్స్ అని, ఇండియన్ అమెరికన్ అని, నేడు కొత్తగా నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు. వారు ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు. ఇప్పటికీ #హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. చరిత్రలో మరొక ఐతీహ్యం కూడా చెప్పబడుతూ వున్నది.
మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. #Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు(sorcism ) నమ్ముతారు చేస్తారు. #ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు.
వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది.) . అలాగే అర్జున, పాతాళ యువరాణి ఉలుపివృత్తాంత౦ కూడా వారి వాంగ్మయంలో చిల్లి పెప్పర్ man గా కనబడుతుంది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరిపోతుంది.
వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్యవలసిన అవసరం వున్నది.
ఒకసారి నడిచే దేవుడు కంచి #పరమాచార్య వారు ఒక israel దేశస్తుడిని ఉద్దేశించి వారి మంత్రాలకు మన మంత్రాలకు వున్న సంబంధం వివరిస్తారు. వారు అన్నారు ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. అప్పుడు సంస్కృతానికి పూర్వం వున్న దేవభాష గురించి చెబుతారు. అప్పుడు వారన్నారు మీకందరికీ తాళం కనబడుతోంది. కేవలం మా ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా వున్నాయి అని. ఎంత సత్యమో కదా ......
Like

Saturday, September 9, 2017

పెళ్ళిచూపుల్లో

పెళ్ళిచూపుల్లో
అబ్బాయి తండ్రి అమ్మాయితో......
"అమ్మాయి, నీకు టైపింగ్ వచ్చా"
"ఆయ్, నిమిషానికి కనీసం పది మందికి వాట్స్ అప్ లో రిప్లై ఇవ్వగలనండి"
"మంచిది. వంటా వార్పు ఏమైనా వచ్చా"
"ఆయ్, సిటీలో ఉన్న కర్రీ పాయింట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, టేక్ అవే సెంటర్స్ యాప్స్ అన్ని అలవాటు చేసుకున్నానండి. ఆర్డర్ పెట్టడం చిటికెలో పని"
"శభాష్. టెక్నాలజీ ఏమైనా నేర్చుకున్నావా"
"ఆయ్, ఆండ్రాయిడ్ నౌగట్ దాకా మొబైల్ అప్ డేట్ లో ఉంచుకున్నానండి"
"భలే భలే. స్పోర్ట్స్ లో ప్రవేశం ఉందామ్మ"
"ఆయ్, టెంపుల్ రన్ లో ఈ కాలనీలోనే నన్ను బీట్ చేసిన వాళ్ళు లేరండి"
"కేక, మరి డ్రైవింగ్ అయినా వచ్చా"
"ఆయ్, ఊబర్, ఓలా నాకు బెస్ట్ కస్టమర్ అవార్డ్ కూడా ఇచ్చాయండి"
"అబ్బో, మరి ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతుక్కోవడం లాంటి పనులు"
"ఆయ్, ఎవరు కావాలన్నా జస్ట్ డయల్ ఉంది కదండీ"
"వెళ్లోస్తానమ్మా"
"నేను నచ్చానాండి?"
" ఇంటికి వెళ్ళాక మెసెంజర్ లో చెప్తానమ్మా. కాస్త ఆన్ లైన్ లోనే ఉండు"

Total Pageviews