Monday, July 9, 2018

అభ్యంగన స్నానం

తలంటు స్నానం తో ఎన్ని లాభాలో
మన భారతీయ జీవన విధానములో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది . ప్రతీ రోజు స్నానం చెయ్యడం మన పద్దతి .కొంతమంది రొండు పూటలా చేస్తారు .పండగ వోచ్చినపుడు ప్రత్యెక స్నానం చెయ్యడం అందరికి తెలిసిందే .వస్తు గుణ దీపిక లో తలంటు స్నానం గురించి వ్రాయబడింది. సంక్రాంతి నాడు తలంటు స్నానం ఒక ప్రత్యెక కార్యక్రమమని అందరికి తెలుసు .తలంటు స్నానాన్ని అబ్యాన్గన స్నానమని అంటారు . కొబ్బరి నూనె,నువ్వులనూనె,ఆవునెయ్యి ,ఆముదం వీటిలో దేనినైన అబ్యాన్గన స్నానానికి వాడవొచ్చు .నూనె చాలా మంచిది .ముందుగా నూనె శరీరానికి బాగా పట్టించి మర్దనా చెయ్యాలి .కనీసం పదినిమిషాలు ఆగిన తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టాలి ,తర్వాత మరో పది నిమిషాలు ఆగాలి తర్వాత పొడి పిండి తో మొత్తం దేహానికి పట్టిన నలుగును వదిలించుకోవాలి. తర్వాత శరీరమంతా శుబ్ర పడేలా రెండు బకెట్ నీళ్ళతో స్నానం చెయ్యాలి. ఈ విధముగా చేయడం వలన గజ్జి, చిడుము, సర్పి, దద్డురులు మొ .చర్మ రోగములు ,దుస్వప్నములు దరి చేరావు. శరీరం మీద మలినాలను ,దుర్గందాల ను పోగొడుతుంది సుఖ నిద్ర ,శరీరం తేలికగా వుండడం ,దేహానికి పుష్టి,కాంతి , మృదుత్వం కలుగుతుంది. కండ్లకు చాలవ చేస్తుంది, పైత్యాన్ని అనుస్తుంది .వృదాప్యం తొందరగా రాదు,అలసటనూ, వాతమును పోగొడుతుంది.సుఖ నిద్ర పట్టును, కాంతి, ఆయుష్షు పెరుగుదల ,బుద్ధి బలిమి ,దేహపుష్టి ,వీర్య వృద్ది కలుగుతాయి .జటరాగ్ని బాగుంటుంది .దేహము కాళ్ళు చేతులు ,గోళ్ళు, సిరస్సులందు పుట్టిన తాపమును ,మంటలను పోగొట్టును .మాడపట్టున చమురు ను వుంచి మర్దించడం వలన చెవులకు ,తక్కిన అవయములకు బలము నిచ్చును .తలవెంట్రుకలు వృద్ధ్హిపరచును ,మృదుత్వాన్ని ఇచ్చును.
అరిపాదాలకు చమురు మర్దించడం వలన మంటలను పోగొట్టును .అరికాళ్ళ నొప్పులు హరించును .
అబ్యాన్గన స్నానం వలన ఇన్ని రకముల ప్రయోజనములు వున్నాయి  కాబట్టే మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు .
ఆధునిక యుగంలో అభ్యంగన  స్నానానికి ప్రాధాన్యత తగ్గిపోవడము వలన దేహానికి అనారోగ్యం ఎక్కువ అవుతోంది .పూర్వ కాలంలో చర్మ వ్యాధులు చాలా తక్కువుగా ఉండేవి. వారం వారం  అభ్యంగన  స్నానం చాలామంచిది .కనీసం పండగలలోనైనా అభ్యంగన  స్నానం చేస్తే ఎంతో  మంచిది .

కులము కన్నా మంచి గుణము గొప్పది .

పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు
మాట కన్నా నెంచ మనసు దృఢము
కులము కన్నా మిగుల గుణమే ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ

గురి కుదరని పైపై పూజ కంటే నిశ్చలమైన జ్ఞానం ముఖ్యం. మారే మాటల కంటే అచంచలమైన మనస్సు ప్రధానం. సామాజికంగా ఏర్పడిన లక్షణం స్వభావతః ఏర్పడిన లక్షణం ఎన్నదగినది. బాహ్యంగా చేసే పనులు సరే, వాటికి మూలాలు లోపల ఉన్నాయా, లేదా అని చూసుకొమ్మంటున్నాడు వేమన. పాత మాటే కావచ్చు. కాని ఎప్పటికి పాతపడని మాట అని గుర్తించుకోవాలి.

పూజ అంటే తెలియనిదెవరికి? అర్చన, దేవుడిని కొలవడం. బుద్ధి అంటే బోధ చేత ప్రకాశించేది. బోధ అంటే జ్ఞానం, అంటే వస్తువు యొక్క యదార్థ గుణాన్ని తెలిపేది. నిదానం అంటే నెమ్మది, ఓపిక అనే అర్థాలున్నా ఇక్కడ కారణం, మూల హేతువు.

అలాగే మాట అంటే పైకి చెప్పేది. మనస్సు అంటే చిత్తం. ఇది జీవాత్మకంటే భిన్నమైంది. జ్ఞానం పుట్టేది దీనిలోంచే. పైకి చెప్పే మాటకు పునాది మనస్సులో ఉంటే, ఆ మాటకు కాంతి ఉంటుంది. మనసులో పుట్టిన జ్ఞానం స్థిరమైనది అని సారాంశం.

ఇక కులం, ఇది మనిషి పుట్టిన తర్వాత వచ్చిందే. సామాజికంగా దీనిలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. కాని మౌలికంగా మనిషి గుణమే గొప్పది.

‘అమ్మ’

మాతృ దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ
అతిధి దేవోభవ
మనది పితృ స్వామ్య వ్యవస్థ అయినా అనాదిగా అమ్మను ఆగ్రభాగమిచ్చి పూజించి గౌరవించడం మన సంప్రదాయం! అమ్మపై ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలుగా కీర్తించారు. ఈ సందర్భంలో వాటిలో కొన్నింటిని మననం చేసుకుందాం! అమ్మ’ – ప్రపంచంలోని ప్రతీ మనిషీ ఒక్కో రకంగా నిర్వచనం చెప్పే పదం. ‘అమ్మ’ అనే పదం ఒకటే అయినా అమ్మ గురించి చెప్పమంటే.. ఒక్కొక్కరి తలపుల్లో ఒక్కో భావం పలుకుతుంది. అమ్మ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా ఎన్నికబుర్లు చెప్పినా చెప్పేవారికీ, వినేవారికీ కూడా తనివి తీరదు. అసలు అమ్మ లేకపోతే సృష్టే లేదు కదా.

Sunday, July 8, 2018

ఒక తెలుగు అభిమాని కవిత


పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
కాకినాడ కాజ కజ్జికాయ
బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
తీయనైన భాష తెలుగు భాష!

మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
తాటిముంజలు మేటి సీతాఫలాలు
మెరయు చక్కెరకేళి మాధురులకన్న
తీయనైనది నా భాష తెలుగు భాష!

పెసర పిండి  పైన  ప్రియమగు నల్లంబు
దాని పైన మిర్చి దద్దరిల్ల
జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు 
సాటి తెలుగు  భాష మేటి భాష

స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు
తాగ లెక సురులు ధరణి లొన
ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు   
ఆవ కాయ కొఱకు నంగలార్చి.

కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు
రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ
కారమింగువలను  తగిలించి తిను వాడు
ఘనుడు తెలుగు వాడు కాదె భువిని

ఆట వెలది యనిన అభిమానమెక్కువ
తేట గీతి యనిన తియ్య దనము
సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు
కంద పద్యమెంత సుందరమ్ము

27-07-2018 చంద్ర గ్రహణము వివరములు

చంద్ర గ్రహణము వివరములు

శ్రీ మహాగణాధిపతయేనమః
            శ్రీగురుభ్యోనమః
ది--27-07-2018 శుక్రవారం విలంబనామసంవత్సర ఆషాఢపూర్ణిమరోజున కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము
     రాత్రి-  గం-11-52  నిముషములనుండి 03-48 నిముషములవరకు
నిత్య భోజనములు  మధ్యాహ్నం 02-00  లోగా ముగించుకోవాలి
బాలురకు,వృద్ధులకు అనారోగ్యవంతులకు రాత్రి 08-00  వరకు స్వీకరించవచ్చును.

మకరరాశిలొ గ్రహణం కావున
మకరరాశివారు చూడరాదు

అలాగె,ఉత్తరాషాడా,శ్రవణా నక్షత్రములవారికి,బహుదోషం

మేష,సింహ, వృశ్చిక,మీన రాసులవారికి ---  శుభం

వృషభ,కర్కాటక,కన్య,ధనుస్సు రాసులవారికి--  మధ్యమఫలం

మిధున,తుల,మకర,కుంభ రాసులవారికి---  అధమఫలితం

ఆరోజు మధ్యాహ్న సమయానికి,దేవాలయాలు మూసివేసి
మరుసటిరోజు యధావిధిగా సంప్రోక్షణాదులు చేయవలెను 

శుక్రవారం గ్రహణంరోజున ఆబ్దీకం వచ్చినయడల మధ్యాహ్నం 11-50 నిమషములలోపు పూర్తిచెయ్యవలెను
           శుభం..

'పాపోహం, పాప కర్మాహం ... ' అని ఎందుకంటాము ?

పూజంతా అయ్యాక చివరిలో - 'పాపోహం, పాప కర్మా2హం, పాపాత్మా పాప సంభవః ...' అంటాము కదా ! ఎందుకు ? నేనేమీ పాపాలు చెయ్యలేదు కదా' ! అలా ఎందుకనాలి?


యాని  కాని  చ పాపాని  జన్మాంతర  కృతాని  చ !
తాని  తాని  వినశ్యంతి  ప్రదక్షిణ  పదే  పదే  ! పాపో2హం పాప  కర్మా2హం  పాపాత్మా  పాపసంభవః !
పాహి మాం  కృపయా దేవ  శరణాగత  వత్సల ! అన్యథా శరణం నాస్తి
త్వమేవ  శరణం  మమ
తస్మాత్కారుణ్య భావేన  రక్ష రక్ష మహేశ్వర  !! అంటూ  ప్రార్ధిస్తాము.

మనం అసలు  పాపాత్ములమే  కాదు.  మనం పరబ్రహ్మ  స్వరూపులము. మనం  నిత్య శుద్ధ బుద్ధ ముక్త  సచ్చిదానంద ఆత్మ  స్వరూపులము. 
వేదవాణి మనను  'శృణ్వంతు సర్వే  అమృతస్య పుత్రాః ....' అంటూ సంబోధించి ప్రబోధించింది. అమృతము అంటే మరణము లేనిది, అంటే పరమాత్మ. అమృతస్య పుత్రాః అంటే పరమాత్మ నుంచి ఉద్భవించిన సంతానం. ఇటువంటి  వారు పాపాత్ములెలా  అవుతారు ?

మరి మనం 'పాపోహం, పాప  కర్మాహం ... ' అని  ఎందుకంటాము  ?

మనం చేసే పనులతో, మాట్లాడే మాటలతో, మనస్సు లో కలిగే  ఆలోచనలతో మనం  కావాలని చేసినా వద్దని చేసినా, పుణ్యము, పాపము తప్పని సరిగా కలుగుతాయి. కనుక  మనం చేసిన పాపాన్ని ఎప్పటికప్పుడు మనం పోగొట్టుకోవాలి. సంధ్యావందనం చేసేటప్పుడు ఏ పూట చేసిన పాపం ఆ పూట చేసే సంధ్యావందనంతో పోతుంది, అనే మంత్రాలున్నాయి. అలా పగలు చేసే పనుల వల్ల కలిగే పాపం పగలు చేసే సంధ్యావందనం తోను, రాత్రి చేసిన కర్మల పాపం రాత్రి చేసే సంధ్యావందనంతోను పోగొట్టుకుంటున్నారు.

యదహ్నాత్ కురుతే పాపం
తదహ్నాత్ ప్రతి ముచ్యతే !
యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యా ప్రతిముచ్యతే !!

మన ప్రమేయం లేకుండా మనకు కలిగే పాపాలు ఇలా తొలగిపోతాయి కానీ కావాలని స్వార్ధంతో చేసే పాపాలు తొలగవు. వాటి ఫలం అనుభవించాల్సిందే  !

మనం అసలు పాపమే  చేసి ఉండక పోతే  మనుష్యులుగా పుట్టే  వాళ్ళమే కాదు. పూర్తిగా  పుణ్యమే ఉన్నవాళ్ళు,  పూర్తి సత్త్వగుణ  సంపన్నులు  దేవతలవుతారు. పూర్తిగా తమోగుణ సంపన్నులు చెట్లు చేమలుగా పుడతారు. తమోగుణ, రజోగుణ సంపన్నులు  రాక్షసులవుతారు. సత్త్వరజస్తమో గుణాలు  మూడు హెచ్చు తగ్గులలో ఉన్నవారు మానవులుగా  పుడతారు. మానవులలో సత్త్వ, రజస్, తమో  గుణాలలోని హెచ్చు  తగ్గులను బట్టి మానవులలోనే, దేవతలు,   మానవులు, రాక్షసులు కూడా ఉంటారు. మానవత్వం నుంచి దైవత్వానికి ఎదగటానికి మన సాధన ద్వారా  ప్రయత్నించాలి.

ఈ ప్రపంచమే సత్యము  అనుకునే అజ్ఞానమే పాపము. వివేచనతో ఈ అజ్ఞానం లోంచి బైట పడటమే పాపాన్ని పోగొట్టు కోవటము,  పుణ్యాన్ని సంపాదించటము.

మన అసలు స్వరూపం పరబ్రహ్మ తత్త్వం. కానీ అజ్ఞానం లో ప్రతిఫలించిన పరమాత్మ తనను తానే జీవునిగా భావించుకుంటోంది. ఆ జీవునికి తన్మాత్రలతో ప్రకృతిలోని భోగాలను అనుభవించటానికి ఒక శరీరము ఉపాధిగా దొరుకుతున్నది. ఆ ఉపాధిలో ఉండి,  ఇంద్రియాలు, ప్రాణముతో కలిసి చిత్తవృత్తుల ద్వారా సుఖ దుఃఖాల ననుభవిస్తూ, పాపపుణ్య కార్యాలను చేస్తున్నాడు. ఆకలి దప్పికలు ప్రాణ లక్షణాలైనట్లుగా
పాపము, పుణ్యము అనేవి జీవునికి సంబంధించినవి. జీవుడు చేసిన కర్మల ఫలం పాప పుణ్యాలను కలిగిస్తుంది. కనుక  మనకు పాప పుణ్యాలున్నాయి. ధర్మాచరణ వల్ల పాపం నశిస్తుంది. పరోపకారం చెయ్యటం వల్ల, ధర్మకార్యాచరణ వల్ల పుణ్యం కలుగుతుంది. పాప పుణ్యాలు ఏవీ  మిగలకుండా  చేసుకుని, స్వధర్మాన్ని నిష్కామంగా, భగవదర్పణ భావంతో ఆచరిస్తుంటే పాపపుణ్యాలు నశించిపోతాయి. సంచితం నశించిపోతుంది.
'ప్రారబ్ధం భోగతో నశ్యేత్'
అనుభవించి ప్రారబ్ధాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడు పాపము ఉండదు, పుణ్యము ఉండదు. అటువంటి స్థితిని  పొందేలా మన ప్రవర్తన ఉండాలి. అను నిత్యము అటువంటి జీవితం గడుపుతూ  'యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ' అని ఈశ్వరార్పణ భావంతో కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండేవారు చేసే ఏ పని ఫలితమూ వారినంటదు. పాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల ! - దయతో నన్ను రక్షించు అని ప్రార్ధించటము తప్పులు చేసి పాపాలుకలగకుండా కాపాడమని చేసే ప్రార్ధన కాదు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, అని పరమాత్మను సర్వస్య శరణాగతి చేసి సర్వ సమర్పణ భావంతో జీవించటమే  ! మామూలుగా పూజ చేసేటప్పుడు
మనకు పెద్దలు అలవాటు చేసిన నిత్య పూజలో సాధారణంగా - ధర్మార్ధకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిధ్యర్ధం అంటూ, ఇష్ట కామ్యార్ధ సిధ్యర్ధం అంటూ ఇంకా మనకు కావలసినవి కూడా చెప్పుకుంటాము. భావం తెలుసుకుని చెప్పుకోవాలి, చెప్పిన దానిని ఆచరించాలి.

గురూపదేశం పొందిన వారు - మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్ధం, (జపించే దైవం పేరు) గురూపదేశమంత్ర సిధ్యర్ధం, మమషడూర్మ్యాది రహిత షట్స్ధల పరబ్రహ్మ నిర్వాణ సుఖసంపదవాప్త్యర్ధం, గురూపదేశ మంత్ర సిధ్యర్ధం, గురూపదేశ మంత్ర జప మహం కరిష్యే ! అని చెప్పుకుంటాము. ఆత్మా త్వం గిరిజా మతిః పరిజనాః ప్రాణాః శరీరంగృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితిః ! సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరాః ! యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం !! అనే భావన స్థిరపడినప్పుడు  ఏ కర్మ అంటదు.

ప్రధానోపాధ్యాయులకోసం మేమొక కరదీపిక రూపొందిస్తూండగా నా కొలీగ్ డా.సర్వేశ్వర్ నెట్ లోంచి కొంత సమాచారం తీసిపెట్టాడు. అందులో 'హెడ్ మాస్టర్'

ప్రధానోపాధ్యాయులకోసం మేమొక కరదీపిక రూపొందిస్తూండగా నా కొలీగ్ డా.సర్వేశ్వర్ నెట్ లోంచి కొంత సమాచారం తీసిపెట్టాడు. అందులో 'హెడ్ మాస్టర్' అనే ఒక మాడ్యూల్లో ఒక వ్యాసం నా దృష్టిని ఆకర్షించింది. ఆ వ్యాసం ద్వారా నేను మొదటిసారిగా డరోతీ సేయర్స్ రాసిన The Lost Tools of Learning (1947) గురించి విన్నాను.
ఆ వ్యాసం వెంటనే చదవకుండా ఉండలేకపోయాను. గత డెబ్బై ఏళ్ళుగా లెక్కపెట్టలేనన్ని సార్లు ముద్రించబడుతూ వస్తున్న ఆ వ్యాసం నాకొక కనువిప్పు. మొత్తం 23 పేజీల ఆ వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. విద్య పట్ల, బోధన పద్ధతుల పట్లా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా చదవవలసిన వ్యాసం అది.
మామూలుగా మనం యూరోప్ లో మధ్యయుగాలు చీకటి యుగాలనీ, మతం ప్రజల్ని గుడ్డిగా శాసించిందనీ, ఆ అంధయుగంనుంచి కొత్త పరివర్తన రినైజాన్సుతో మొదలయ్యిందనీ చదువుకున్నాం. అప్పుడే ప్రాచీన గ్రీకు గ్రంథాలు వారికి అందుబాటు లోకి వచ్చాయనీ, వాటిని అధ్యయనం చెయ్యడం ద్వారా వారు వివేచనాశీలురుగానూ, హేతువాదులుగానూ, మానవతావాదులుగానూ రూపొందారనీ చిన్నప్పుడు మా హైస్కూలో మా వెంకటరత్నం మాష్టారు మాకు చెప్పారు.
కానీ, ఆ గ్రీకు గ్రంథాల్ని మధ్యయుగాల విద్యార్థులు ఏ పద్ధతిలో చదివారు? వాటిని వారికెవరు బోధించారు? ఏ బోధన-అభ్యసన ప్రక్రియ వల్ల లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, బొకాషియో, డాంటే, షేక్ స్పియర్, గెలీలియో, బ్రూనో లు రూపొందారు? ఏ విద్యాబోధన పునాదులమీద తదనంతర కాలాల్లో ఫ్రాన్సిస్ బేకన్,న్యూటన్, వోల్టేర్, డెనిస్ డిడిరో, గొథే, సెర్వాంటిస్ లు ప్రభవించగలిగారు? వారు ఏ పద్ధతిలో చదువుకున్నారు? మాంటిసోరీ, పెస్టలోజి, ఫ్రోబెల్ వంటి విద్యావేత్తలు లేని కాలంలో, ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక విద్యావిధానం ఊహించడానికి కూడా లేని రోజుల్లో, అచ్చుపుస్తకాలూ, పత్రికలూ, కంప్యూటర్లూ, ఇంటర్నెట్లు లేని కాలంలో ఏ సామగ్రి, ఏ సాహసం, ఏ వ్యక్తిత్వ నిర్మాణం ఆధారంగా యూరోప్ ప్రపంచవిజేత కాగలిగింది?
ఇది ఒక ప్రశ్న. దీని వెను వెంటనే పుట్టే మరొక ప్రశ్న మరి ఇప్పుడు అటువంటి మహామేధావులు, సృజనాత్మక కళాకారులూ, మౌలిక శాస్త్రవేత్తలూ ఎందుకు ప్రభవించడం లేదు? నిజమే,టెక్నాలజీ పరంగా ప్రపంచం ఇప్పుడు సాధిస్తున్న విజయాలు మనం కొలవలేనివి.కాని మౌలిక విజ్ఞాన శాస్త్రంలో మనం ఎక్కడున్నాం?
ఇక మూడవ ప్రశ్న, అన్నిటికన్నా, ముఖ్యమైన ప్రశ్న, డరోతీ సేయర్స్ అడిగింది. ఆమె ఇలా అంటోంది:
'ఇంతదాకా పశ్చిమ యూరోపు చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యున్నతస్థాయికి అక్షరాస్యతా శాతం చేరిన ఈ కాలంలో, ప్రజలు మనమింతదాకా కనీ వినీ ఎరగనంతగా, వ్యాపార ప్రకటనల, బహిరంగ ప్రచారాల ప్రభావానికి లోనుకావడం మీకు వింతగా, దురదృష్టకరంగా గోచరించడంలేదా? లేదా అదంతా, రేడియోవల్లా, పత్రికలవల్లా ముదంటికంటే ప్రచారం మరింత విస్తృతంగా వ్యాపించడం తప్ప మరేమీకాదని తీసిపారేస్తారా? నిజంగా చూడండి, ఈ పరిస్థితికి, ఒక వాస్తవానికీ, అభిప్రాయానికీ మధ్య తేడా చూడలేకపోవడానికీ, నిర్ధారణకీ, సంభావ్యతకీ మధ్య సరిహద్దులు గీసుకోలేని ఈ పరిస్థితికి కారణం మన ఆధునిక విద్యాపద్ధతులేమోనన్న అనుమానం, మీ మనసుల్లో, లోపల్లోపల, మీకు కలగడం లేదా?'
ఆమె ఈ ప్రశ్న అడిగినప్పుడు యూరోప్ అప్పుడే రెండవ ప్రపంచ యుద్ధం ముగించింది. ఒక ప్రజాస్వామిక దేశం ఒక రాజరిక దేశం మీద ఆటంబాంబు వేసిన పొగ మధ్య ఉక్కిరిబిక్కిరవుతూ ఆమె ఈ ప్రశ్న అడిగింది. కానీ, అప్పటికి టివి లేదు, ట్విట్టర్, స్కైప్, ఫేస్ బుక్, యూట్యూబుల్లేవు. ఇప్పుడు, ఈ అత్యాధునిక సమాచార ప్రసార సాధనాల మధ్య ఆమె ప్రశ్న,మరింత బిగ్గరగా నా మొహం మీద మొహం పెట్టి, అడుగుతోంది: చెప్పు, మనుషులు ఎందుకింత ద్వేషపూరితంగా, ఇంత అర్థరహితంగా, ఇంత వితండంగా వాదించుకుంటున్నారు?
డరోతీ సేయర్స్ వ్యాసం చదవకముందు నాకు అనుమానంగా ఉన్నదికాస్తా ఇప్పుడు రూఢి అయిపోయింది. ఈ అర్థరాహిత్యానికీ, ఈ ద్వేషానికీ మూలాలు మన పాఠశాలల్లోనే వెతకవలసి ఉంటుందని. విజ్ఞానసాధనాలు కాలేకపోయిన మన పాఠశాల వైఫల్యానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఇది. నిజమే, ఈ ఆధునిక విద్య మధ్యయుగాల్లో యూరోప్ లోనూ, వందేళ్ళ కిందట భారతదేశంలోనూ మనం ఊహించలేనిది. కాని, వందేళ్ళ కిందట దేశం చూసిన ఒక గాంధీ, టాగోర్, అంబేద్కర్, జగదీశ్ చంద్రబోస్, రామానుజన్, రామన్, రాధాకృష్ణన్ ఇప్పుడెందుకు కనిపించడం లేదు? భాషలేవైనా, ప్రాంతాలేవైనా, మతధర్మాలేవైనా, భారతదేశం ఒకటే అని తాము నమ్మి, మనల్ని నమ్మించగలిగిన ఆ మహామానవులు ఇప్పుడు టెలివిజన్ స్టూడియోల్లో ఎందుకు కనిపించడం లేదు?
మధ్యయుగాల్లో చదివిన చదువుకన్నా ఇప్పుడు మన పాఠశాలల్లో పిల్లలు ఎన్నో సబ్జెక్టులు చదువుకుంటున్నారనీ, కాని దాని అర్థం వాళ్ళు మధ్యయుగాలనాటి విద్యార్థుల కన్నా ఎక్కువ తెలుసుకుంటున్నారని మాత్రం కాదంటోంది డరోతీ. ఆమె ఈ మాటలు అంటున్నప్పటికి సరిగ్గా నలభై ఏళ్ళముందు గాంధీజీ తన హింద్ స్వరాజ్ లో ఈ ప్రశ్నలే వేసినట్టు ఆమెకి తెలీదు. తాను చదువుకున్న ఆల్జీబ్రా, జాగ్రఫీ, హిస్టరీ ఏవీ కూడా తన ఇంద్రియాలనెట్లా అదుపులో పెట్టుకోవాలో తనకు నేర్పలేకపోయాయని గాంధీ ఆ పుస్తకంలో వాపోయాడు.
మధ్యయుగాల్లో విద్యావ్యవస్థ ఇందుకు భిన్నంగా ఉండేదని అంటుంది డరోతీ సేయర్స్. అప్పుడు విద్యార్థులకి నేర్పేవి మొత్తం ఏడు అంశాలు. వాటిలో మొదటి మూడింటినీ 'ట్రివియం' అనీ, మిగిలిన నాలుగింటినీ 'క్వాడ్రివియం' అనీ అనేవారు. ట్రివియంలో మూడు అంశాలు: తర్కం, వ్యాకరణం, అభివ్యక్తి (రెటారిక్). తర్కం అంటే ఆలోచించమెట్లానో తెలుసుకునే కళ. వివిధ సంకేతాల్ని కనుగొనడం, వాటిమధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వ్యాకరణం. తాను అర్థం చేసుకున్నదాన్ని ఆలోచనతో మేళవించి చెప్పగలగడం రెటారిక్. నిజానికి ఇవి మూడూ సబ్జెక్టులుకావు, అధ్యయన పద్ధతులు అనవలసి ఉంటుంది. అంటే నేర్చుకోడమెట్లానో నేర్పే పద్ధతులన్నమాట. ఒకసారి, ఈ పద్ధతుల్ని పిల్లవాడికి పరిచయం చేసిన తరువాత, పిల్లవాడు, నేర్చుకోడమెట్లానో నేర్చుకున్నాక, ఏ విషయాన్నైనా, ఎంత కొత్త విషయాన్నైనా తనంత తానే నేర్చుకోగలుగుతాడు.
కానీ,ఇప్పుడు మన పాఠశాలల్లో ఇది జరుగుతోందా? 'పిల్లవాడికి పద్యాలకి అర్థం చెప్పరూ' అని వెంకమ్మ అడిగిన ప్రశ్నకి 'యిప్పటి మటుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ళ స్కూళ్ళల్లో తెలుగుపద్యాలమీద ఖాతరీ లేదండి. యంతసేపు జాగర్ఫీ, గీగర్ఫీ, అర్థమెటిక్,ఆల్జీబ్రా, మాథమాటిక్స్, యివన్నీ హడలేసి చెప్తారండి' అంటాడు గిరీశం. అప్పణ్ణుంచి ఇప్పటిదాకా మన పాఠశాలల్లో నడుస్తున్నది విద్య కాదు, 'హడలేసి చెప్పడమే'.
తర్కం, వ్యాకరణం,రెటారిక్ నేర్పిన తర్వాత, పిల్లలకి నాలుగు సబ్జెక్టులు మాత్రమే మధ్యయుగాలు నేర్పేవి. మొదటిది, అరిథ్ మెటిక్,అంటే, సంఖ్యల్ని అర్థం చేసుకోవడం. రెండవది సంగీతం. అంటే సంఖ్యాజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమెట్లానో తెలుసుకోవడం. మూడవై జామెట్రీ. అంటే స్థలం గురించిన పరిజ్ఞానం. నాలుగవది, ఖగోళశాస్త్రం. స్థలం గురించి తెలుసుకున్నదాన్ని ఆచరణలో అనువర్తింపచెయ్యడం. ఈ నాలుగు అంశాల్లోనూ మధ్యయుగాల్లో బోధించిన విషయం బహుశా ఇప్పుడు అయిదవతరగతి పిల్లవాడి స్థాయికి మించి ఉండకపోవచ్చు. కాని, మనం చూడవలసింది విషయవిస్తృతిని కాదు. విషయంవేరు, అభ్యసన సామర్థ్యం వేరు. ఇప్పటి అయిదవ తరగతి పిల్లవాడికి లభించే పరిజ్ఞానంతోనే అప్పుడొక కోపర్నికస్ రూపొందాడని మనం మర్చిపోకూడదు. కాని, ఇప్పుడు మసాచుసెట్స్ యూనివెర్సిటీనుంచి నోబెల్ బహుమతులు పుచ్చుకుంటున్న శాస్త్రవేత్తలు ప్రభవిస్తున్నారు కాని,మరొక కోపర్నికస్ పుట్టలేదని మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఇరవయి ఒకటవ శతాబ్దానికి అవసరమైన విద్యానైపుణ్యాలుగా చెప్పుకుంటున్న నాలుగు నైపుణ్యాల్లోనూ: critical thinking, creative abilities, communication మధ్యయుగాల ట్రివియంలో ఉన్నవేనని నాకిప్పుడు అర్థమవుతోంది. నాలుగవ నైపుణ్యం, collaboration ఒక్కటే కొత్తగా వచ్చి చేరిన నైపుణ్యం. అందులో ఆశ్చర్యం లేదు. గత అయిదువందల ఏళ్ళుగా ప్రపంచం నేర్చుకున్న గుణపాఠాల వల్ల నేర్చుకోకతప్పని నైపుణ్యం అది.
GBT.ORG
However, it is in the highest degree improbable that the reforms I propose will ever be carried into effect. Neither the parents, nor the training colleges, nor the examination boards, nor the boards of governors, nor the ministries of education, would countenance them for a moment. For they amount....

Total Pageviews