Friday, March 6, 2015

శుభోదయం !! " హారతి " వల్ల లాభము :-

                                                                శుభోదయం !!

                                 " హారతి " వల్ల లాభము 

                   గృహములలోను, పూజాగది లోను, గుడిలోను, శుభ కార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజుల వేడుకలలోను, కొత్త పెళ్ళికూతురు గృహములోకి ప్రవేశించినపుడు 'హారతి' ఇస్తూవుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం వుంది. శుభకార్యాలలో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయంలో అనేకమంది భక్తులు భగవంతుడిని దర్శిస్తుంటారు.దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబందించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా వుంటాయి. కర్పూరహారతి ఎలాగైతే క్షీణించి పోతుందో .. అలాగే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలు సమసి పోవాలని కోరుకొంటూ హారతి కళ్ళకు అద్దుకోవడమే అసలు సిసలు ఆధ్యాత్మిక ఆర్ధం, పరమార్ధం./\.

Tuesday, March 3, 2015

శుభోదయం !! మాతృ, పితృ, ఆచార్య, దైవ, ఋషి రుణాలంటే:-

శుభోదయం !!

                మాతృ, పితృ, ఆచార్య, దైవ, ఋషి రుణాలంటే:-

       పశుపక్షాదుల్లా పుట్టగానే, కాళ్ళు రాగానే బయటకి తెరిమెయ్యరు. తల్లి, తండ్రి ఇద్దరూ జీవితకాలం సంపాదించిన ధనాన్ని పోగుచేసి ఇచ్చి, పెళ్లికుడా చేసి ధర్మ,అర్ధాలతో సుఖించే పరిస్థితులని సృష్టిస్తారు.ప్రేమతో పెంచుతారు. తల్లి, తండ్రి ఋణం ఎంతసేవచేసినా తీరదు. ముసలితనంలో వాళ్ళని బిడ్డల్లా చూసుకోవడమే.
                        
                      మలమూత్రాలను కడిగి పెంచి పెద్ద చేసినందుకు ఆ సమయంలో తల్లి ఋణం తీర్చుకోవాలి. తాను నిస్వార్ధముతో పెంచి పెద్ద చేసిన తండ్రి రుణం తీర్చుకోవాలి. లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని నేర్పించినందుకు గురు రుణాన్ని, మనకి బుద్ధిని, కర్మని ఇస్తున్న దైవ రుణాన్ని భక్తి ద్వారా, ధర్మ మార్గం ద్వారా,సకల శాస్త్రాలను, ధర్మాలను గ్రందాల ద్వారా మనకు అందచేసినందుకు ఋషి   రుణాన్నితీర్చుకోవాలి. వివాహం ద్వారా అన్ని రుణాలని తీర్చి తిరిగి తాను రుణ పడటమే మానవ జన్మ.

Monday, March 2, 2015

ధర్మశాస్త్రం చెప్పేది:

ధర్మశాస్త్రం చెప్పేది:
  1. సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడు వుండకూడదు
  2. రెండు చేతులతో తల గీరుకోరాదు.
  3. అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును.
  4. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు.
  5. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను.
  6. గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు.
  7. గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు.
  8. గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు.
  9. సూర్యోదయాత్ పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం లక్ష్మి కటాక్షము. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం లక్ష్మి లోగిలోకి రావడానికి దోహదం.
  10. చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు.
  11. ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు.

శుభోదయం../\..


శుభోదయం../\..

చిన్న పిల్లలు తప్పు చేసినప్పుడు దండించే కన్నా, మంచి చేసినప్పుడు గుర్తించి మెచ్చుకోవడమూ, ప్రోత్సాహపూర్వకమైన బహుమతులను ఇవ్వడమూ చేయాలి. ఏ పిల్లవాడిలోనూ దండించి సత్‌ప్రవర్తనను నేర్పలేము. ముందుగా మనం ఆచరించి నేర్పించాలి. అలాగే ప్రేమాప్యాయతలను ఇవ్వడమూ, పుచ్చుకోవడమూ నేర్పించాలి.




పరీక్షా సమయంలో మంచి మార్కులు రావాలంటే చదువుతో పాటు పెద్దలు, అనుభవజ్ఞులు చెప్పిన సలహాలు సూచనలు పాటించండి.

పరీక్షా సమయంలో మంచి మార్కులు రావాలంటే చదువుతో పాటు పెద్దలు, అనుభవజ్ఞులు చెప్పిన సలహాలు సూచనలు పాటించండి.


Sunday, March 1, 2015

శుభోదయం ../\..





శుభోదయం ../\..
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము .



మాతృభాష ప్రాధాన్యత!!!

మాతృభాష ప్రాధాన్యత!!!





Total Pageviews