Friday, June 26, 2015

ఆరోగ్యమే మహాభాగ్యం!

ఆరోగ్యమే మహాభాగ్యం! మనం ప్రతిరోజూ ఆహారంలో కొన్నిరకాలు కలిపి,విడిగా..తీస్కుంటూ వుంటాము.కానీ కొన్ని ఆహారపదార్ధాలను ఒకదానితో ఒకటి కలిపి తీసుకోవడం వలన చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన పెద్దలు చెప్పిన మాటలను, ఆహార నియమాలను, మరొక్కసారి మనమందరం గుర్తు చేసుకొని చక్కని అందమైన జీవితాన్ని మన సొంతం చేసుకొందాము ఏమంటారు సరేనా ? 
ఆహారంలో avoid చేయాల్సినవి.
1. తేనే (honey) మరియు నెయ్యి (gee) కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అయినది. Don't mix honey and ghee it is poisonous.

2. పెరుగు (curd) లేక చల్ల ను (butter milk) అరటి పండు తో కలిపి తినకూడదు. Done eat banana with curd or buttermilk.


3. అన్నాన్ని (rice) పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని minerals తగ్గిపోతాయి. Don't eat fruits with rice u loose minerals.


4. కూరగాయలతో (vegetables) కలిపి వెన్నె (cheese) కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. Don't eat cheese with vegetables. If so it is dangerous.


5. చేపల కూర (fish curry) తిన్నవెంటనే పాలు (milk) కానీ, పెరుగు (curd) కానీ తినకూడదు. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. Don't drink milk or curd after fish curry if so u will get leporsy.


6. లావుగా ఉన్నవారు బియ్యం (rice) తో వండివి కాకుండా గోధుములతో (wheat) ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది..
Fat people instead of rice they should have wheat products

.
7. ఆస్తమా (asthma) రోగులు టమోటా (tomato), గుమ్మడికాయ (pumpkin), ముల్లంగి (radish) వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదుasthma people shouldn't suppose to eat tomato, radish , pumpkin and their hair should not be wet.


8. మొలలు (piles) ఉన్నవారు గుడ్లు (eggs), మాంసం (meat) తినకూడదు. Piles people - don't eat eggs, meat.


9. నెయ్యిని రాగి (copper) పాత్రలో ఉంచి తినకూడదు. Don't use ghee if it is in copper vessel.


10. పొద్దునే bed coffee తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు . Early in the morning bed coffee is not good instead drink water.


11. అల్సర్ (ulcer) వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు. Ulcer people don't eat spicy food.


13. చర్మ వ్యాధులు (skin diseases) ఉన్నవారు పొట్ల కాయ (snake guard), పల్లీలు (pea nuts), ఎండు చేపలు (dry fish), చిక్కుడు కాయలు (Broad beans) తినకూడదు. Skin diseases people- don't eat snake guard, pea nuts, dry fish, broad beans.


14. నువ్వుల నునేతో (sesame oil) తో గోధుమ wheat కి చెందినవి చెయ్యకూడదు. Don't use Wheat and sea same oil together.


15. మోకాళ్ళ నొప్పులతో (arthritis) ఉన్నవారు మాంసం (meat), గుడ్లు( eggs) తో చేసిన వంటలు తినకూడదు. Arthritis people don't eat meat and eggs.


వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!! Pls Remember the above points and take necessary steps. Health is wealth....
(Ayurveda)

పెద్దలమాట చద్దిమూట!!

పెద్దలమాట చద్దిమూట!!

" పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం. "

         " పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం. "
పృధ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు.
శివుడు ఈ పంచభూతాల స్వరుపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై వున్నాడు.
1. పృధ్వీలింగం --- --- కంచి ( తమిళనాడు )
2. జలలింగం --- --- జంబుకేశ్వరం ( తమిళనాడు )
3. తేజోలింగం --- --- తిరువణ్నామలై ( తమిళనాడు )
4. వాయులింగం --- --- శ్రీ కాళహస్తి ( తిరుపతికి సమీపం )
5. ఆకాశ లింగం --- --- చిదంబరం ( తమిళనాడు )
కంచిలోని ఏకామ్రేశ్వరుడు ప్రుధ్వీలింగమై వున్నాడు. ఇక్కడి మామిడిచెట్టు కారణంగా ఈ దేవుడికి ఏకామ్రేశ్వరుడు అని పేరువచ్చింది. కంచి ఏడు ముక్తి దాయక క్షేత్రాలలో ఒకటి. రామేశ్వరం లోని సైకతలింగం కూడా ప్రుధ్వీ లింగమే.
జంబుకేశ్వరం లోని జలలింగం జలమయమై వుంటుంది. శివునకు జలం చాలా ఇష్టం. శివుడు అభిషేకప్రియుడు. దక్ష హింసవల్ల కల్గిన పాపాన్ని తొలగించుకోవడానికి శివుడు జంబుకేశ్వరం లో తపస్సు చేసాడని పురాణాలు చెపుతున్నాయి.ఈ క్షేత్రం తమిళనాడు లోని తిరుచినాపల్లి వద్ద వున్నది.
అరుణాచలం తేజోలింగనిలయం.అరుణాచలం చుట్టూ చేసే ప్రదక్షిణం మహాపుణ్య ప్రదానమని పెద్దలు చెపుతారు. ఈ క్షేత్రంలోనే రమణ మహర్షి తపోనిష్టుడై వుండి జ్గ్యాన మార్గోపదేశం పొంది ప్రసిద్ధి పొందారు.
శ్రీకాళహస్తి ని దక్షిణ కైలాసం అంటారు. ఇక్కడ వాయులింగ ప్రతిష్టిత మైనది. సాలెపురుగు, పాము, ఏనుగు అనే తిర్యగ్జంతువులు ఇక్కడ శివలింగాన్ని సేవించి ముక్తి పొందాయని శివపురాణం చెపుతోంది. అందువల్లనే శ్రీకాళహస్తిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి కెక్కింది.
ఆకాశలింగం చిదంబరంలో వున్నది. ఇక్కడ విశేషం ఏవిధమైన లింగాకారమూ కనిపించక నిరాకారమైన అంతరాలమే కనిపిస్తుంది. ఇది రూప రహితలింగం. అందువల్లనే ఆకాశ లింగంగా ప్రసిద్ధి చెందినది.ఆకాశంలాగా శివుడు ఆత్మ సర్వవ్యాపి అని దీని వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రం నిర్వికల్ప సమాధికి దోహదకారి.
ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకలైన ఈ లింగాలు పాంచ భౌతికమైన జగమంతా దైవస్వరూపమే అని చాటి చెపుతున్నాయి. ఓం నమః శివాయః ..

పాణ్యం చెంచుకాలనీ.అనుభవాలు...చినవీరభద్రుడు

పాణ్యం చెంచుకాలనీ అనుభవాలపట్ల శతాధికంగా మీరంతా ఎంతో ప్రేమనీ, ప్రశంసనీ వర్షించి నన్ను ఉక్కిరిబిక్కిరిచేసేసారు. మీకందరికీ పేరుపేరునా నా నమస్సులు, నా సుమనస్సులు.
మిత్రురాలు Rama Devi అన్నట్టుగా ఒక విజయగాథ వినగానే మనలో ఏదో సంభవిస్తుంది. బహుశా మనిషి జీవనిర్మాణంలోనే మంచితనం పట్ల ఉద్వేగం చెందే మహత్తరగుణముందనుకుంటాను,లేకపోతే అన్ని స్పందనలు, అంత ఉద్వేగం,అంత ఉత్కంఠ ఎక్కణ్ణుంచి వస్తాయి!
అందరికీ మరోమారు పేరుపేరునా వందనాలు. అయితే కొందరి మాటలతో మళ్ళీ కొన్ని మాటలు కలపాలనే ఈ నాలుగు మాటలూను.
మొదట, Vasantha Lakshmi గారు, Satya Sai VissaJagadeesh Kumar గార్లు ఈ కథ తర్వాత ఏమయ్యింది, మధ్యలో ఆపెయ్యకండి అన్నారు. నేను కథ మధ్యలో ఆపలేదు. మొదలుపెట్టిందే చివరినుంచి. మీకులానే నేను కూడా ఆ రైతులేమయ్యారు, ఆ భూమి ఏమయ్యింది చూద్దామనే మొన్న పాణ్యం వెళ్ళాను. అక్కడ అడుగుపెట్టిన మొదటి ఇంట్లోనే బియ్యం మూటలు కనబడ్డాయి. ఆ బియ్యం ఆ రైతులు ఆ భూమిలో పండించిందే. ఆ సంగతి తెలియగానే నా వళ్ళు ఝల్లుమంది. ఎక్కడి నుంచి ఎక్కడిదాకా ప్రయాణించారు వాళ్ళు. ముఫ్ఫై ఏళ్ళకిందట దారిదోపిడీలు చేస్తున్నట్టు ముద్రపడ్డ కుటుంబాలు అడవినుంచి ఊళ్ళోకి వచ్చి, కోళ్ళఫారంతొ మొదలై, పాతికేళ్ళకిందట మొదటిసారి జొన్నపంట వేసుకుని, అదేలా కోతకొయ్యాలో కూడా తెలియని కుటుంబాలు ఇప్పుడు రైతులై సోనామసూరీ పండిస్తున్నారు. ఈ కథ ఇక్కడితో ఆగిపోయిందనుకోలేం. ఇప్పుడు కూడా అడుగడుగునా కొత్త సమస్యలు, కొత్త సవాళ్ళూ ఎదురవుతూనే ఉంటాయి. చూడగలిగి, రాయగలిగితే అదంతా గొప్ప ఇతిహాసమవుతుంది.
అందుకనే ఆత్మీయులు Sujatha Kalimili గారు స్పందిస్తూ ఆహారసేకరణదశనుంచి స్థిరవ్యవసాయానికి ఒక జాతి చేసినప్రయాణం ఈ కథలో ఉందన్నారు. ఆమె ప్రపంచప్రసిద్ధి చెందిన మానవశాస్త్రజ్ఞురాలు. డిల్లీలో నేషనల్ యూనివెర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఆచార్యులు. ఆమె కూడా ఈ అనుభవాన్ని చదివి ప్రతిస్పందించినందుకు నాకు చాలా సంతోషమనిపించింది.
మరికొన్ని సంతోషకరమైన స్పందనలు. ఒకటి Sainath Thotapalli గారు రాసింది. ఆ రోజు చెంచువారి పక్షాన నిలబడ్డ లాయర్ గురుమూర్తిగారు తనకి మామగారని ఆయన రాయడం నాకు అనూహ్యమైన ఆనందాన్నిచ్చింది. సాయినాథ్ గారు, నా తరఫున గురుమూర్తిగారికి నమస్కారాలు చెప్పండి. మరొకటి Rajaram Thumucharla గారు రాసింది, ఆయన కూడా తాను నంద్యాల్లో చదువుకుంటున్నప్పుడు గురుమూర్తిగారిగురించి విన్నానని రాసారు. ఒక వ్యక్తి తన వృత్తిని సత్యసంధతతో, నిష్టతో అనుష్టిస్తే అతడి పేరు ఎన్నాళ్ళయినా చెక్కుచెదరదనడానికి ఇట్లాంటివే ఉదాహరణలు.
ఇంకొకటి Dhenuka Naik చేత్తో రాసిన స్పందన. పేదప్రజలనుంచి వచ్చి తిరిగివాళ్ళకోసం జీవితాన్ని అంకితం చేస్తున్న ధేనుకానాయక్ వంటి యువకులే గిరిజనుల ఆశాదీపాలు.
అన్నిటికన్నా నమస్కరించవలసిన స్పందన Rama Reddy Ganta గారినుంచి వచ్చింది.ఆయన సి.వి.కృష్ణారావుగారిని స్మరించారు. అందుకు కృష్ణారావుగారి కుమార్తె, నా సోదరి Parvathi Medukonduruఆయనకు ధన్యవాదాలు చెప్పారు కూడా.. రామారెడ్డిగారూ, కృష్ణారావుగారు సాహిత్యంలోనే కాదు, నా ఉద్యోగజీవితంలో కూడా నా రోల్ మోడల్. ఆయన సాంఘికసంక్షేమాధికారిగా కరీంనగర్, వరంగల్, అదిలాబాదు జిల్లాల్లో చేసిన సేవ అద్వితీయమైంది. ఎస్.ఆర్. శంకరన్,కె.ఆర్.వేణుగోపాల్ వంటివారే ఆయన్ను అభిమానించకుండా ఉండలేకపోయారు. గిరిజనప్రాంతాల్లో కాగడా పట్టుకు నడిచిన మొదటి తరం అధికారుల్లో ఆయన ఆజానుబాహువు కాబట్టే ఫణికుమార్ తన 'గోదావరి గాథలు' పుస్తకానికి ఆయనతో పరిచయం రాయించుకున్నారు. నా చిన్నతనంలో, అంటే నేను ఎనిమిదోతరగతి చదువుకుంటున్నప్పుడు ఆయన మా జిల్లాలో రంపచోడవరం ఐ.టి.డి.ఏ కి ప్రాజెక్టు అధికారిగా వచ్చారు. ఆయన మా గ్రామానికి వచ్చి మా ఊళ్ళో గిరిజనులతో మాట్లాడిన తీరు నా మీద చెరగనిముద్ర వేసింది. ఒక అధికారిగా కృష్ణారావుగారు చేసిన సేవగురించీ,సాధించిన విజయాల గురించీ మరోమారు వివరంగా రాయాలి.
Attada Appalnaidu గారు తన స్పందనలో అభివృద్ధి గతం కంటే కొంచెం జరిగినప్పటికీ అది సాపేక్షమేననీ, అందువల్ల ప్రభుత్వాలని తప్పుపట్టకూడదు అని అనకూడదనీ రాసారు. అప్పల్నాయుడు ప్రజాపక్షం వహించిన రచయిత. ఉత్తరాంధ్ర సాహిత్యంలో కాళీపట్నానికీ,భూషణానికీ వారసుడు. నికార్సైన నిబద్ధత కలిగిన కలంవీరుడు. ఆయన మాటల్ని కాదనే సాహసం చెయ్యను. కానీ ఒకటనుకుంటాను. ప్రభుత్వం అమూర్తస్వరూపం. కన్యాశుల్కంలో జట్కావాడు ప్రభుత్వమంటే కనిష్టీబనే అనుకున్నట్టు, ప్రజలు ఏ ప్రభుత్వోద్యోగిని చూస్తే ఆ రూపంలోనే వాళ్ళకి ప్రభుత్వం సాక్షాత్కరిస్తుంది.
మిత్రురాలు Kuppili Padma దీన్నొక నవలగా ఎందుకు రాయకూడదని అడిగింది. ఇందులో నేనున్నాను కాబట్టి నవలగా రాయగల నిస్పాక్షికత నాకు సాధ్యం కాదు. కాని వేరెవరన్నా దీన్నొక నవలికగా మలచడం అసాధ్యం కాదనుకుంటాను. ఆ మాటకొస్తే ఈ అనుభవమే కాదు, ఇట్లాంటి అనుభవాలు మనందరి జీవితాల్లోనూ కనీసం ఒకటిరెండేనా ఉంటాయి. ఒక బాలికను ఆమె బంధువులు బడిమానిపించి పెళ్ళి చేయబోతే వాళ్ళని అడ్డుకుని వాళ్ళ చేత తన్నులు తినైనా సరే ఆ పిల్లకు చదువు చెప్పిన ఒక ఉపాధ్యాయుడి అనుభవాన్ని తీసుకుని చింగిజ్ అయిత్ మాతొవ్ 'తొలి ఉపాధ్యాయుడు ' నవల రాసాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ కథ లక్షలాదిమందిని చైతన్యపరుస్తూనే ఉంది. అట్లాంటి అనుభవాలు కథలుగా, నవలలుగా తెలుగులు ఇంకా రావలసే ఉందనుకుంటాను.
నా అనుభవాలు మరికొన్ని రాయమని కూడా మిత్రులు కొందరు రాసారు. గిరిజన విద్యారంగంలో నా అనుభవాలు ఇప్పటికే 'కొన్ని కలలు-కొన్ని మెలకువలు '(ఎమెస్కో,2005) పేరిట పుస్తకరూపంలో వచ్చాయి. కర్నూల్లోనూ, శ్రీశైలంలోనూ చెంచు వారితో కలిసి జీవించిన అనుభవాల్ని పుస్తకరూపంగా తెమ్మని కూడా మిత్రులడుగుతూ ఉన్నారు. చూడాలి, ఎప్పుడు వీలవుతుందో.
  • Satya Sai Vissa "అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే, 
    కలలు చెదిరినా పాటే కలతచెందినా పాటే
    ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను".
    అని 1978 లో సీతామాలక్ష్మి సినిమా కోసం వేటూరి వారు రాసినట్లు బ్రతుకు బాటలో ప్రతి పుట లో భావుకతని మానవతని నవతని నివసించిన ప్రతిచోట ప్రతిపూట అనుభూతించి ఆ అనుభవాన్ని రంగరించి మీ రచనామృతం ద్వారా మాకు అందిస్తున్నందుకు చినవీరభద్రుడు గారు మీ సుమనస్సుకు మా మనస్సుల సుమనస్సులు.

Thursday, June 25, 2015

మంచిమాట!!

మంచిమాట!!


ప్రదక్షిణ

                                                                    ప్రదక్షిణ
ఆలయాలను సందర్శించునపుడు ప్రదక్షిణ చేయడం అనేది అనాదిగా వస్తున్నా హైందవ సాంప్రదాయం. గర్భగుడిలోనున్న మూలవిరాట్టును దర్శించు కొనడానికి ముందుగా గర్భగుడిచుట్టూ భక్తులు కొన్ని సార్లు ప్రదక్షణ చేస్తుంటారు. మనసును ప్రాపంచిక విషయ చింతనల నుండి భక్తిభావాలవైపుకు మళ్ళించడానికి ప్రదక్షిణ తోడ్పడుతోంది. ఈవిధంగా మనస్సును ముందుగా శుభ్రపరచుకొని, పవిత్రమొనరించుట ద్వారా తరువాత మూలవిరాట్టును దర్శించుకొనినపుడు, ఇతర ఆలోచనలు లేకుండా పరిపూర్ణమైన మనస్సుతో దైవాన్ని ప్రార్ధించడానికి, దైవంపై మనస్సును సంపూర్ణంగా లగ్నం చేయడానికి ప్రదక్షిణ ఉపకరిస్తుంది. దేవాలయాలోనే కాకుండా, మహాత్ములకూ, పవిత్రస్థలాలకు, వృక్షాలకు, పర్వతాలకు, సరస్సులకు కూడా ప్రదక్షిణ చేయడం పరిపాటి. షిర్డీ, మంత్రాలయాలలోగల సమాధులకు, ఇళ్లలో పెంచే తులసి మొక్కకు, మారేడు, రావి వేప, మర్రి మొదలగు వృక్షాలకు, అరుణాచలం, కైలాసశిఖరం, బృందావనం మొదలగు పర్వతాలకు, మానస సరోవరంలాంటి సరస్సులకు కూడా ప్రదక్షిణలు చేస్తుంటారు. వివాహాది కార్యక్రమాల్లో వధూవరులను అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. షోడశోపచార పూజావిధానంలో ఆత్మప్రదక్షిణ రూపంగాను యజ్ఞయాగాది క్రతువులలోను ప్రకక్షిణ ఒక అంతర్భాగమనేది చెప్పనవసరం లేదు.
ప్రదక్షిణ అనే పదంలోని ప్రతి అక్షరానికి భావార్థం ఉంది. ‘ప్ర’ అనగా పాప నాశనమని, ‘ద’ అనగా కోరికలను నెరవేర్చుట అని, ‘క్ష’ అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం అని ‘ణ’ అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించునదని అర్థం.
ప్రదక్షణలో సవ్యప్రదక్షణ, అససవ్యప్రదక్షణ అని రెండు పద్ధతులున్నాయి. గడియారంలో ముల్లులు తిరిగే దిశలో చేసే ప్రదక్షణ సవ్యప్రదక్షణ అంటారు. ఈ ప్రదక్షణలో విగ్రహం భక్తునికి కుడిప్రక్కన ఉంటుంది. అపసవ్య ప్రదక్షణలో ఎడమ ప్రక్కన ఉంటుంది. శుభకార్యాలలో సవ్య ప్రదక్షణ, అశుభకార్యాలలో అపసవ్యప్రదక్షణ ఉంటుంది.
ప్రదక్షణ ఎన్నిసార్లు చేయాలనేది భక్తుని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. తక్కువసంఖ్యలో ప్రదక్షణలు చేసేటపుడు సాధారణంగా బేసి సంఖ్యలయిన ఒకసారో, మూడు సార్లో, ఐదుసార్లో, తొమ్మిదిసార్లో, పదకొండుసార్లో చేస్తారు. 108 సార్లో, 116 సార్లో, 1108 సార్లో చేస్తారు. కొన్ని సందర్భాలలో ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో 11 రోజులో, 40 రోజులో కూడ చేస్తుంటారు. ఏదేని కోరిక నెరవేరడానికి ప్రతిరోజూ ఇన్ని ప్రదక్షిణలు చొప్పున ఇన్నిరోజులు చేస్తామని మొక్కుకోవడం కూడ జరుగుతుంది. ప్రదక్షణలు బేసి సంఖ్యలో చేయడానికి ఒక కారణం కూడ ఉంది. ప్రదక్షణలు ఇంకా ‘సరి’ కాలేదని (అంటే పూర్తి కాలేదని) కాబట్టి బకాయి పడ్డ ఆ ప్రదక్షణలు పూర్తి చేయించు కొనడానికైనా రప్పించుకుంటే దైవదర్శన భాగ్యం మళ్ళీ మాకు కలుగుతుందని భావించి భక్తులు ప్రదక్షణలను ‘చేసి’ సంఖ్యతో చేసి వదలి పెడతారు.
పెద్ద పెద్ద పర్వతాలకు, సరస్సులకు ప్రదక్షణలు చేసేటపుడు కొన్ని కిలోమీటర్ల దూరం నడవవలసి వస్తుంది. ఉదాహరణకు అరుణాచలంలో గిరిప్రదక్షణ చేసేటపుడు ఏడు కిలోమీటర్లు దూరం నడవలాని అంటారు. అట్టి ప్రరిస్థితులలో ఆపకుండా ప్రదక్షణ చేయాలనే నియమం లేదు.
భక్తుని ఓపికనుబట్టి, అవసరాన్ని బట్టి మధ్యమధ్యలో ఎన్ని సార్లైనా విశ్రాంతి తీసుకొన వచ్చును. ఆహారం కూడ తీసుకొన వచ్చును. ప్రదక్షణను మౌనంగాకాని, మనస్సులో సంబందిత భాగావన్నామాన్ని స్మరిస్తూగాని, బిగ్గరగా సంకీర్తన చేస్తూగాని, ధ్యానావస్థలో మనసు మనసునుంచి గాని చేయవచ్చు. ప్రదక్షనాను ప్రారంభించాక పూర్తయ్యేవరకు మనస్సును భగవంతునిపై లగ్నం చేయడం వలన అది ఒక విధమైన ధ్యానావస్థకు దారితీస్తుంది. తద్వారా ప్రదక్షణ అనంతరం మనస్సు ఎంతో ప్రశాంతంగాను, శరీరం ఎంతో విశ్రాంతిగాను ఉంటుంది. కాబట్టి ప్రదక్షణ చేసేటపుడు లౌకిక విషయాలు ఆలోచించడం మాట్లాడటం, చేయరాదు. ప్రదక్షణలు తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో పరుగులు తీయటం అభిలషణీయంకాదు. నిదానంగా నిండుగర్భిణి నడిచేటంత నెమ్మదిగా ప్రదక్షణ చేయాలనేది శ్రాస్త్రనిర్ణయం. ప్రదక్షణ ప్రక్రియ ఒకసారి ప్రారంభించాక తిరిగి వెనక్కి తిరగడం, వెనక్కి నడవడం మంచిది కాదు. గర్భగుడిచుట్టూ బయట ఉపాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఉన్నట్లయితే ముందుగా వాటన్నిటికి నమస్కరించి ఆ తరువాత గర్భగుడి చుట్టూ ఆపకుండా, ప్రక్కకు తిరిగి వేరే విగ్రహాలకు నమస్కరించా కుండా ప్రదక్షణలు చెయ్యాలి.
ప్రదక్షణ ప్రధానంగా ద్వైతమతానికి చెందిన సాంప్రదాయం. జీవాత్మను పరమాత్మ చుట్టూ ప్రదక్షణ చేయిస్తే అది కొన్నాళ్ళకు పరమాత్మలో లీనమవుతుందనే విశ్వాసమే ప్రదక్షణ చేయుటలో ముఖ్యద్దేశ్యం. ఈ సందర్భంగా భ్రమరకీటక న్యాయం గూర్చి వివరించడం ఉచితంగా ఉంటుంది. భ్రమరము అనగా తుమ్మెద గుడ్లను పెట్టి పొదగదు. పిల్లలను కనాడు. వేరొక జాతి కీటకం యొక్క పిల్లను ఎత్తుకొనివచ్చి, తన గూటిలో పెట్టి, దాని చుట్టూ ఘూమ్మని శబ్దం చేస్తూ తిరుగుతుంది. అలా ఆ కీటక్పు పిల్ల భ్రమరశబ్దాన్నే వింటూ ఉండటం వలన, భ్రమరాన్నే చూస్తూ ఉండటం వలన కొంతకాలానికి అది కూడ భ్రమరంగానే తయారైపోతుంది. అదే విధంగా ఒక నామాన్ని స్మరిస్తూ, ఒక రూపం చుట్టూ మనస్సును పరిభ్రమింప చేయుటవలన ఆ మనస్సు కొన్నాళ్ళకు ఆ రూపంలో లయమవుతుందనే విశ్వాసమే ప్రదక్షణలో ముఖ్యోద్ధేశ్యం.
రమణమహర్షి ప్రదక్షణ ప్రక్రియను అద్వైత పారంగాకూడ వివరించారు. నిరాకారుడైన భగవంతుని చుట్టూ ప్రదక్షణ చేయడం అసంభవం. అదేవిధంగా ఈ ప్రపంచమంతా భాగవత్స్వరూపమే కాబట్టి ఈ ప్రప్రంచం చుట్టూ ప్రదక్షణ చేయడంకూడా అసాధ్యం. తాను ఆత్మస్వరూపుడునని ప్రపంచంకూడా ఆత్మ స్వరూపమేనని భావించి తన కుతూ తాను తిరగడమే అసలయిన ఆత్మ ప్రదక్షణ అంటారు. మనస్సు వలెనే పరమాత్మకు, జీవాత్మకు భేదంకల్గుతుందని. కాబట్టి ఆ మనస్సును ఆత్మస్వరూపుడైన తన ఆత్మచుట్టూ ప్రదక్షణ చేయించడం వలన కొన్నాళ్ళకు మనస్సు ఆత్మలో లయమైపోయి. మనోనాశనం జరుగుతుందని, అదే అసలయిన ఆత్మప్రదక్షిణ అంటారు.

ప్రజల పక్షాన, ప్రకృతి పక్షాన నిలిచే ఒక నిజాయితీ గల అధికారి కధ! ఒక అడవిరాముడు సినిమాను తలపిస్తూ వుంది. బహుశా ఆ పాత్రకి స్పూర్తేమో


 వాడ్రేవు చినవీరభద్రుడు గారి నిజజీవిత కధ 
నిన్న పొద్దున్న పాణ్యం చెంచుకాలనీలో, కాలం ఆ జాతిలోనూ, కుటుంబాల్లోనూ తెచ్చిన మార్పులేవైవుంటాయా అని ఆలోచిస్తూ, ఒక ఇంట్లో అడుగుపెట్టాను.ఆ ఇల్లు, ఒకే ఒక్క గది,అక్కడొక మూల నాలుగైదు మూటలు కనిపిస్తే అవేమిటని అడిగాను. నాతో పాటు దగ్గరుండి అన్నీ వివరిస్తున్న సర్పంచ్ మేకల సుబ్బరాయుడు అవి బియ్యం మూటలని చెప్పాడు.
ఎంతకు కొంటున్నారని అడిగాను.
'కొన్నవి కాదు సార్, మేం పండించుకున్నవే, వడ్లు మిల్లుకేస్తే వచ్చిన మూటలు' అన్నాడు.అంటూ,'కర్నూలు సోనా ' అని అక్కడ విప్పి ఉన్న ఒక మూటలోంచి గుప్పెడు బియ్యం తీసి నా చేతుల్లో పోసాడు. తెల్లగా, తళతళలాడుతున్న సన్నబియ్యం!
నాకు వళ్ళు జలదరించించింది.
అక్కణ్ణుంచి సుబ్బరాయుడి ఇంటికి రాగానే స్థానిక పత్రికావిలేకరులు చుట్టుముట్టారు. సాధారణంగా ఒక ప్రభుత్వాధికారి గ్రామాలకు వచ్చినప్పుడు చుట్టూ చేరినట్టే.
'కాని నేను మీతో ఒక ప్రభుత్వాధికారిగా కాదు, ఒక స్నేహితుడిగా మాట్లాడాలనుకుంటున్నాను, నేనిందాకణ్ణుంచీ అనుభవిస్తున్న పులకింత పంచుకోవాలనుకుంటున్నాను ' అన్నాను.
'మామూలుగా ప్రతి ఒక్కరూ 'అభివృద్ధి అంటే ఏమిటి? ఎక్కడ జరిగింది? అని అడుగుతారు. సంఘాన్నీ, ప్రభుత్వాన్నీ విమర్శింస్తుంటారు. నిజమే,మన దేశం చాలా బీదది,మన సమాజాలు చాలా పేదవి. ఎంత సాధించినా, ఇంకా సాధించవలసినదానితో పోలిస్తే మనం సాధించింది చాలా చాలా కొంచెంగానూ, తక్కువగానే కనిపిస్తుంది. కాని ఇదిగో, ఇట్లాంటి సన్నివేశాల్లో, నాలాంటివాడు, ఈ జీవితాల్ని కొన్నేళ్ళుగా చూస్తూన్నవాడు అట్లాంటి మాటలు మాట్లాడలేడు, అట్లాంటి ప్రశ్నలు అడగలేడు. మీరిప్పుడు చూసారుకదా, ఆ ఇంట్లో కర్నూలు సోనా బియ్యం. అందులో మీకేమీ విశేషం కనిపించదు. నగరం నుంచి వచ్చిన ఒక అధికారి బియ్యం చూసి ఆశ్చర్యపోతున్నాడేమా అని మీరే ఆశ్చర్యపోయిఉండవచ్చు. కాని, నాకు అది కేవలం ఆశ్చర్యం మాత్రమే కాదు, అద్భుతం కూడా 'అన్నాను.
ఆ విలేకరులు పాతిక, ముఫ్ఫై ఏళ్ళ వయసు యువకులు.
'నేను పాతికేళ్ళ కిందట ఈ జిల్లాలో జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పనిచేసాను. అప్పటికి మీరు పుట్టిఉండరు, పుట్టినా కళ్ళు తెరిచి ఉండరు. నేనీ జిల్లాకు రాగానే మా జిల్లా కలెక్టరు నాకోసం కొన్ని పనులు సిద్ధంగా ఉంచారు. అందులో ఒకటి, అన్నిటికన్నా ముఖ్యమైంది, ఈ పాణ్యం చెంచులకి వ్యవసాయం నేర్పించడం. అప్పటికి ఏడెమినిదేళ్ళ కిందట, అంటే 82,83 కి ముందు ఈ చెంచుకుటుంబాలు చుట్టుపక్కల అడవుల్లో ఉండేవారు. నంద్యాల-కర్నూలు రోడ్డు మీద ఏ దొంగతనాలు జరిగినా పోలీసులు వాళ్ళనే పట్టుకుని హింసించేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక పోలీసు అధికారి, ఆయన పేరు కాశీనాథ్, నంద్యాల్లో డి.ఎస్.పి గా పనిచేసేవాడు, ఆయన ఆ పరిస్థితి చూడలేక వాళ్ళందరినీ పాణ్యంలో తీసుకొచ్చి ఒక కాలనీ కట్టి పునరావాసం చేయించాడు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో ఆ కాలనీ ప్రారంభం చేయించాడు. వాళ్ళ ఉపాధికోసం ఒక కోళ్ళఫారం పెట్టించాడు. కాని నేను అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితి మళ్ళా మొదటికి వచ్చింది. ఆ కోళ్ళ ఫారాన్ని సగం పోలీసులూ, మిగిలిన సగం దొంగలూ తినేసారు. చెంచువాళ్ళని ఊళ్ళొకి తెచ్చి తమకి భద్రత లేకుండా చేసారని ఊళ్ళోవాళ్ళు గొడవచేయడం మొదలుపెట్టారు.
అందుకని జిల్లాకలెక్టరు ఎమ్మార్వోతో మాట్లాడి వాళ్ళకొక నలభై ఎకరాల బంజరు పట్టా ఇప్పించాడు. నేను వెళ్ళగానే అక్కడ చెంచువాళ్ళతో ఒక ఉమ్మడి సేద్యం సహకార సంఘం ఏర్పాటు చెయ్యమనీ, వాళ్ళకి సాగుపనులు నేర్పమనీ, పంటలు పండించమనీ చెప్పాడు.'
'పాణ్యంనుంచి లోపలకి బలపనూరు దగ్గరు ఉన్న ఆ మారుమూల భూమిని మేం బుల్ డోజర్లతో చదునుచేయించాం, రెండు గొట్టపు బావులు తవ్వించి సాగునీటి వసతి ఏర్పాటు చేసాం. చక్కటి మాగి రకం జొన్న వేద్దామన్నారు రైతులు. మొదటి పంట వేసాం. మాఘమాసం వచ్చేటప్పటికి, మేలిమి బంగారు వన్నె తిరిగిన జొన్న కంకుల్తో పంట బరువెక్కింది.అదంతా కూడా మైఖెల్ షొలొకోవ్ 'బీళ్ళు దున్నేరు ' నవల్లోలానే ఉండింది.'
'ఒక రోజు ఆ పంట ఎట్లా ఉందో చూద్దామని పొలం దగ్గరికి వెళ్ళేటప్పటికి సాయంకాలమైంది. అక్కడొక మనిషి కనబడ్డాడు. మీరెవరు, ఇక్కడెందుకున్నారు అని అడిగాను.
నేను నంద్యాల్లో లాయర్ని. ఈ రోజు మున్సిఫ్ కోర్టులో కొందరు షెడ్యూలు కులాల రైతులు ఈ పొలం మీద కేసు పెట్టారు. ఈ పంట తాము వేసుకున్నామనీ, చెంచువాళ్ళు కోసేసుకోబోతున్నారనీ, తమ పంట కాపాడమనీ కోర్టువారిని అడిగారు. అందుకని కోర్టువారు నన్ను కమిషనర్ గా అప్పాయింట్ చేసారు. రేపే ఈ పంట వేలం వెయ్యబోతున్నాం. అందుకని చూసుకుందామని వచ్చాను అన్నాడు.'
'నేను వింటున్నదేమిటో నాకు అర్థం కాలేదు. మోకాళ్ళల్లో నిస్సత్తువ వచ్చేసింది. ఏమిటి నేను వింటున్నది? ఈ పంట వేసింది చెంచువాళ్ళు కదా, ఎస్.సి రైతులు ఎక్కణ్ణుంచి వచ్చారు? వాళ్ళు కోర్టుకెళ్ళడమేమిటి? కమిషనర్ని వెయ్యడమేమిటి? పంట వేలం వెయ్యడమేమిటి?'
'నేను అతణ్ణి ఆపి మా కథంతా చెప్పాను. కోర్టు ముందుకొచ్చిన కేసు తప్పుడు కేసనీ, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అన్యాయమనీ మొత్తుకున్నాను. కాని అతడు వినలేదు. 'నాకేమీ తెలియదు, నేను నా పని చేసుకుపోక తప్పదు 'అన్నాడు.'
'చివరికి, మేం కూడా ఆ వేలంపాటలో పాల్గొంటామనీ, కాబట్టి వేలం వెయ్యడం ఒక్క రోజు ఆపమనీ అడిగాను. అతడు అయిష్టంగానే ఒప్పుకున్నాడు.'
'నేను పాణ్యంవచ్చి చెంచువాళ్ళతో మాట్లాడేను. నంద్యాల్లో గిరిజన కార్పొరేషన్ మేనేజరు కృష్ణారావుతో మాట్లాడేను. నాకు అర్థమయిందేమంటే, ఆ ప్రభుత్వ భూమి మీద స్థానికంగా ఉన్న ఒక రెడ్డి కన్నువేసాడు. అతడు ఆ భూమి చెంచువాళ్ళకి దక్కకూడదనే ఆ కేసు పెట్టించాడు. జరిగిందేమంటే కలెక్టరు చెంచు వాళ్ళకి భూమి ఇమ్మన్నప్పుడు అక్కడ ఎమార్వో కలెక్టర్ని సంతొషపరిచే హడావిడిలో అంతకుముందు ఎస్.సి లకు ఇచ్చిన భూమినే మళ్ళా చెంచువాళ్ళకి ఇచ్చేసాడు. కాని ఆ పట్టాలు కాన్సిల్ చెయ్యడం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ పట్టాలు చూపించే ఆ రెడ్డి దళితులతో చెంచువాళ్ళమీద కోర్టుకేసుపెట్టించాడు.'
'ఏమైతేనేం,సమయం లేదు. మిగిలింది ఒకే ఒక్క రోజు. పొద్దున్నే కలెక్టర్నిఇంటికిపోయి కలిసాను. ఆయన జిల్లాజడ్జితో మాట్లాడేరు. కాని ఆయన మాత్రం ఏం చెప్తాడు. 'మీరేం చేస్తారో నాకు తెలీదు. ఒక్క గింజ కూడా మనం పోగొట్టుకోకూడదు.'అని లోపలకి వెళ్ళిపోయాడు. కాని అంత పొద్దున్నవేళా ఆయన నుదుటిమీద చెమట పట్టడం చూసాను.'
'నేను నంద్యాల వెళ్ళి అసిస్టెంటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కలిసాను. ఆయనకి కూడా ఏమీ తోచలేదు. 'మా సీనియర్ గురుమూర్తి అని ఒక రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు, ఆయన్ని సలహా అడుగుదాం ' అన్నాడు. మేం ఆ గురుమూర్తిని కలుసుకునేటప్పటికి సాయంకాలమైంది. నేను జరిగిందంతా చెప్పాను. మేం భూమి చదునుచేసినప్పుడు, పొలందున్నినప్పుడు, పంట వేసినప్పుడు తీసిన ఫొటోలు చూపించాను. ఆయనకేమీ పాలుపోలేదు. అట్లానే మాట్లాడుతూ కూచున్నాడు.'
రాత్రి పదయ్యంది. అప్పుడు ఆయనకి హటాత్తుగా ఆలోచన వచ్చింది.
'ఈ కేసులో దళితులు కలెక్టర్నీ,ఎమ్మార్వోనీ రెస్పాండెంట్లుగా పెట్టారు. చెంచు వాళ్ళ ఊసేలేదిందులో. నేను చెంచు వాళ్ళతో రేప్పొద్దున సబార్డినేట్ జడ్జికోర్టులో కేసు వేయిస్తాను, అయ్యా, మా పొలంలో మా పంట మేం పండించుకుంటే, ఈ దళితులు,ఎమ్మార్వో, కలెక్టరూ ఈ గొడవంతా ఏమిటి, మా పంట మాకు ఇప్పించండి అనడిగిస్తాను అన్నాడు. 'ఇంకో మాట, ఆ ఫొటోలు చూపించారు చూడండి, అవే నాకు సాక్ష్యం. అయితే కోర్టు ఫొటోలు నమ్మదు, నెగిటివ్లు కావాలి 'అన్నాడాయన.'
ఒక్కసారి మళ్ళా మేం బలం పుంజుకున్నాం. ఆ రాత్రంతా కర్నూలు, పాణ్యం, నంద్యాల, పాణ్యం, నంద్యాల తిరుగుతూనే ఉన్నాం. నెగిటివ్లు సంపాందించాం. అఫిడవిట్ తయారు చేసాం. చెంచువాళ్ళ సంతకాలు పెట్టించాం.
తెల్లవారింది. పదింటికి కోర్టుకి బయలుదేరుతూ ఆ పెద్దాయన 'చాలాకాలమైంది నేను నల్లకోటువేసుకుని 'అన్నాడు. అజాద్ హింద్ ఫౌజు కోసం నల్లకోటు వేసుకున్న జవహర్ లాల్ లాగా.
కాని 'ఒక్కమాట. నేను నా వృత్తిలో ఎప్పుడూ అబద్ధాలాడలేదు. ఇప్పుడు కూడా సబ్ జడ్జిముందు అబద్ధమాడలేను. కిందకోర్టు పంట వేలంవెయ్యమందనీ, కమిషనర్ని నియమించిందనీ చెప్పకుండా ఉండలేను.తీరా అట్లా చెప్పాక, సబ్ జడ్జి స్టే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు మీరేమంటారు?'అన్నాడు.
'మీ ఇష్టం' అన్నాన్నేను.
సబ్ జడ్జి మధ్యాహానికల్లా స్టే ఇచ్చాడు.
మా సంతోషానికి అంతం లేదు. కాని మళ్ళా సాయంకాలం గురుమూర్తిగారు మాకు కబురు పెట్టాడు. ఈ స్టే మీద నాకు నమ్మకం లేదు. రేప్పొద్దున సబ్ జడ్జి ఈ స్టే వెకేట్ చేసినా ఆశ్చర్యం లేదు, మీ జాగ్రత్త మీరు పడండి అన్నాడు.
నన్నుమళ్ళా అపారమైన నీరసం ఆవహించింది.
ఒక్కరోజు, ఆ ఒక్కరోజులో పంట మొత్తం కోసెయ్యాలి. ఎట్లా?
43 ఎకరాల జొన్నపంట.
చెంచువాళ్ళు ఒక్కరోజులో కోతకొయ్యడం అసాధ్యం. నేనూ, మేనేజరు కృష్ణారావూ మళ్ళా పాణ్యం వెళ్ళాం. చుట్టు పక్కలగ్రామాల్లో మాట్లాడి కూలిమనుషుల్ని బెత్తాయించాం. కోసిన పంట కోసినట్టు తరలించడానికి గిరిజన కార్పొరేషన్ ట్రక్కులెలానూ ఉండనే ఉన్నాయి.
మర్నాడు పొద్దున్నే పంటకోతమొదలయ్యింది. పండగలాగా చేద్దామనుకున్నాం. కాని మా పొలంలో మేమే దొంగల్లాగా, ఆతృతతో, భయంతో పంట కోత మొదలుపెట్టాం. పొద్దువాటారే సమయానికి ఇంకా నాలుగైదు ఎకరాలు మిగిలే ఉండగా, నంద్యాలనుంచి లాయరు రొప్పుకుంటూ పరుగెత్తుకొచ్చాడు.
'సబ్ జడ్జి కోర్టు స్టే వెకేటయ్యింది.' అన్నాడు.
' మీరు పంట కోతకొయ్యడం అన్యాయం 'అన్నాడు.
నీ దిక్కున్నచోట చెప్పుకో అన్నారు చెంచువాళ్ళు.
రాత్రంతా పంటకోత కొనసాగింది.
పుత్తడివన్నె జొన్నపొట్టలు. ఎన్నాళ్ళుగా ఆ భూమి చెంచువాళ్ళకి ఋణపడిఉందో అద్భుతమైన కరుణతో వర్షించిన సుభిక్షం.
ఆ పంట మొత్తం పాణ్యం చెంచుకాలనీకి తరలించేటప్పటికి అర్థరాత్రి దాటింది.
ఈ పంట ఇక్కడ ఇలా వదిలిపోతే వీళ్ళు దీన్ని కాపాడుకోలేరేమో అన్నాడు కృష్ణారావు.
ఆ రాత్రి అక్కడే ఆశ్రమపాఠశాల ఎదట ఆ కంకులమధ్య ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేం.
ఇదిగో, ఇప్పుడు ఈ చెంచు వాళ్ళ ఇంట్లో ఆ పొలంలో పండిన కర్నూలు సోనా బియ్యం చూడగానే అదంతా గుర్తొచ్చింది.' అన్నాన్నేను ఆ విలేకరులతో.

Total Pageviews